Upcoming Telugu Movies: లవ్ ఎంటర్‌టైనర్స్ To క్రైమ్ థ్రిల్లర్స్ - ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో వచ్చే మూవీస్ లిస్ట్ ఇదే
Latest Telug Movies: ఈ వారం లవ్, ఫ్యామిలీ, హారర్ థ్రిల్లర్ మూవీస్ థియేటర్స్, ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. సినీ ప్రియులకు వీనుల విందు అందించేందుకు రెడీ అవుతున్నాయి.

Upcoming Telugu Movie In Theaters And OTTs: ప్రతీ వారంలానే ఈ వారం కూడా మూవీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు మూవీస్, వెబ్ సిరీస్‌లు రెడీ అవుతున్నాయి. లవ్ ఎంటర్‌టైనర్స్ నుంచి హారర్ థ్రిల్లర్స్ వరకూ పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే...
లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జూనియర్
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి కుమారుడు గాలి కిరీటి రెడ్డి హీరోగా వస్తోన్న లేటెస్ట్ మూవీ 'జూనియర్'. కిరీటి సరసన బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా... జెనీలియా, కన్నడ లెజండరీ హీరో రవిచంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 18న తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించినట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.
కొత్తపల్లిలో ఒకప్పుడు
మనోజ్ చంద్ర, మౌనిక ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. ప్రొడ్యూసర్, నటి ప్రవీణ పరుచూరి ఈ మూవీతో దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఉషా బోనెల, రవీంద్ర విజయ్, బెనర్జీలతో పాటు బొంగు సత్తి, ఫణి కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పోలీస్ వారి హెచ్చరిక
సన్నీ అఖిల్ హీరోగా బాబ్జీ దర్శకత్వం వహించిన మూవీ 'పోలీస్ వారి హెచ్చరిక'. శుభలేఖ సుధాకర్, అజయ్ ఘోష్, రవి కాలే, షియాజీ షిండే, కాశీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 18న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: 'మోనికా'తో సౌబిన్... డ్యాన్స్ అదిరెన్ - అసిస్టెంట్ డైరెక్టర్ To హీరో... ఈ విషయాలు తెలుసా?
ఓటీటీల్లో వచ్చే మూవీస్/వెబ్ సిరీస్‌లు
మరోవైపు ఓటీటీల్లోనూ పలు హిట్ మూవీస్, వెబ్ సిరీస్‌లు ఈ వారం స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
- జులై 15 - హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ (ప్రైమ్ వీడియో), కుంగ్ ఫూ పాండా (నెట్ ఫ్లిక్స్), ఎంత్రీ గెన్ 2.0 (ప్రైమ్ వీడియో), ట్రైన్ వ్రెక్ (నెట్ ఫ్లిక్స్), డ్రాగన్ బాల్జ్ (నెట్ ఫ్లిక్స్), కాయాట్ల్ (నెట్ ఫ్లిక్స్), కోయిటల్ (సిరీస్ - హాట్ స్టార్)
- జులై 16 - యామీ బ్రాడ్లీ ఈజ్ మిస్సింగ్ (ఇంగ్లీష్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్)
- జులై 17 - అన్ టేమ్డ్ (ఇంగ్లీష్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్), లిలిమ్ (నెట్ ఫ్లిక్స్), చిహాయాఫురు (నెట్ ఫ్లిక్స్), ది అమెట్యూర్ (హులు), గుటర్ గూ సీజన్ 3 (ఎంఎక్స్ ప్లేయర్)
- జులై 18 - కుబేర (ప్రైమ్ వీడియో), సత్తుమమ్ నీదియుమ్ (తమిళ సిరీస్ - జీ5), భైరవం (జీ5), అస్త్ర (మనోరమ మ్యాక్స్), ది భూత్నీ (జీ5), స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 (జియో హాట్ స్టార్), వాల్ టు వాల్ (నెట్ ఫ్లిక్స్), డిలైట్ ఫుల్లీ డిసైట్ ఫుల్ (నెట్ ఫ్లిక్స్), టు కిల్ ఏ మంకీ (నెట్ ఫ్లిక్స్), స్టార్ ట్రెక్ సీజన్ 3 (జియో హాట్ స్టార్), బ్రైడ్ హార్డ్ (ప్రైమ్ వీడియో), ఫైనల్లీ డాన్ (ప్రైమ్ వీడియో), వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (నెట్ ఫ్లిక్స్), జానీ ఇంగ్లీష్ (లయన్స్ గేట్ ప్లే), రీమ్యాచ్ (ఇంగ్లీష్ సిరీస్ - లయన్స్ గేట్ ప్లే), టేక్ పాయింట్ (కొరియన్ మూవీ - నెట్ ఫ్లిక్స్), సమ్మర్ మ్యూజికల్ (ఇంగ్లీష్ మూవీ - ఆపిల్ ప్లస్ టీవీ)
- జులై 19 - ఇస్ (నెట్ ఫ్లిక్స్), ది అసెస్మెంట్ (నెట్ ఫ్లిక్స్)





















