అన్వేషించండి

Kiara Advani - Jr NTR : ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూలో కియారా అడ్వాణీ - రామ్ చరణ్ సినిమా తర్వాత!

Kiara Advani In War 2 : రామ్ చరణ్ హీరోగా శంకర్ తీస్తున్న 'గేమ్ ఛేంజర్'లో కియారా అడ్వాణీ నటిస్తున్నారు. దాని తర్వాత ఎన్టీఆర్ సినిమాలో ఆమె నటించనున్నారని సమాచారం.

మ్యాన్ ఆఫ్ మాసెస్, యుంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) బాలీవడ్ డెబ్యూకు అంతా రెడీ! హిందీలో భారీ యాక్షన్ సినిమా చేసేందుకు కొమురం భీమ్ 'యస్' చెప్పారా? అంటే... 'అవును' అని బీటౌన్ అంటోంది. హ్యాండ్సమ్ & యాక్షన్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. 'వార్ 2'లో ఎన్టీఆర్ నటించనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ కియారా అడ్వాణీ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారట.

'వార్ 2'లో కియారా అడ్వాణీ!
అవును... 'వార్ 2'లో కియారా అడ్వాణీ నటిస్తున్నారని ప్రముఖ హాలీవుడ్ మీడియా సంస్థ వెరైటీ పేర్కొంది. బాలీవుడ్ వర్గాలు సైతం అది నిజమేనని అంటోంది. మరి, హృతిక్ జోడిగా కియారా కనపడతారా? లేదంటే ఎన్టీఆర్ జంటగానా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.  

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న 'గేమ్ ఛేంజర్'లో ఇప్పుడు కియారా అడ్వాణీ నటిస్తున్నారు. హిందీలో కార్తీక్ ఆర్యన్ జోడిగా 'సత్య ప్రేమ్ కి కథ' కూడా చేస్తున్నారు. ఈ రెండూ పూర్తి అయ్యాక... నవంబర్ నుంచి 'వార్ 2' షూటింగులో జాయిన్ అవుతారట. 'వార్ 2' షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న 'దేవర' చిత్రీకరణను ఎన్టీఆర్ పూర్తి చేయనున్నారు. 'వార్ 2'తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Also Read : ఆ ఆరులో మూడు ప్రభాస్ సినిమాలే - 'ఆదిపురుష్' ఫస్ట్ డే కలెక్షన్లతో రికార్డ్   

'వార్ 2'లో హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్!?
'వార్ 2'లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య సన్నివేశాలు 'నువ్వా నేనా' అన్నట్టు ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజున హృతిక్ విషెష్ చెబుతూ... 'యుద్ధభూమిలో కలుద్దాం' అని పేర్కొన్నారు. ఆ తర్వాత 'వార్ 2'లో యాక్షన్ సీక్వెన్సులపై అంచనాలు మరింత పెరిగాయి. 

Also Read 'ఆదిపురుష్'కు ఫ్లాప్ టాక్ వెనుక టాప్ 5 రీజన్స్ - ఏంటిది ఓం రౌత్?

'వార్' సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అయితే, 'వార్ 2'కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. దీనికి ప్రముఖ దర్శక - నిర్మాత, యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా కథ అందించారట. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన 'బ్రహ్మాస్త్ర' సినిమాకు దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించారు. హైదరాబాద్ ఈవెంట్ కు ఎన్టీఆర్ అథితిగా అటెండ్ అయ్యారు. అప్పుడు 'వార్ 2' గురించి డిస్కషన్ జరిగినట్టు సమాచారం. 

షారుఖ్, సల్మాన్ కూడా ఉన్నారండోయ్!
యశ్ రాజ్ ఫిల్మ్స్... హిందీ చలన చిత్ర పరిశ్రమలో బడా నిర్మాణ సంస్థ. బాలీవుడ్ బడా బడా స్టార్ హీరోలతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్లు నిర్మించిన యశ్ రాజ్ ఫిల్మ్స్... 'వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్' పేరుతో ఇండియన్ జేమ్స్ బాండ్ తరహా సినిమాలకు శ్రీకారం చుట్టింది. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్', 'పఠాన్' సినిమాలో ఆ యూనివర్స్ (YRF SPY Universe) లో భాగంగా వచ్చినవే. షారుఖ్ 'పఠాన్'లో సల్మాన్ అతిథిగా కనిపించారు. 'టైగర్ 3'లో షారుఖ్ అతిథిగా కనిపిస్తారని సమాచారం. భవిష్యత్తులో ఈ హీరోలు అందరితో మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget