By: ABP Desam | Updated at : 30 Apr 2022 02:48 PM (IST)
యశ్
'కెజియఫ్ 2' సినిమా ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో అరుదైన రికార్డు సృష్టించింది. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఖాతాలో వెయ్యి కోట్లు చేరాయి. అవును... 'కెజియఫ్ 2' ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సో... నిర్మాత విజయ్ కిరగందూర్‌కి మంచి లాభాలు వచ్చాయని వేరే చెప్పాల్సిన పని లేదు కదా!
ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన నాలుగో సినిమాగా 'కెజియఫ్ 2' రికార్డులకు ఎక్కింది. దీని కంటే ముందు ఉన్న సినిమాల్లో ఈ ఘనత సాధించిన సినిమాల్లో ఆమిర్ ఖాన్ 'దంగల్', ప్రభాస్ 'బాహుబలి 2', ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' ఉన్నాయి. అందులో రెండు సినిమాలు రాజమౌళివే కావడం విశేషం.
#KGFChapter2 has crossed ₹ 1,000 Crs Gross Mark at the WW Box Office..
Only the 4th Indian Movie to do so after #Dangal , #Baahubali2 and #RRRMovie— Ramesh Bala (@rameshlaus) April 30, 2022
'కె.జి.యఫ్ 2'లో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించారు. ఇందులో ప్రధానమంత్రి రమికా సేన్ పాత్రలో రవీనా టాండన్, అధీరాగా సంజయ్ దత్, విజయేంద్ర వాసిరాజు పాత్రలో ప్రకాశ్ రాజ్, సలార్ తల్లిగా కీలక పాత్రలో ఈశ్వరీ రావుతో పాటు పలువురు నటించారు. రవి బస్రూర్ సంగీతం, భువన గౌడ ఛాయాగ్రహణం సినిమాను మరో మెట్టు ఎక్కించాయని విమర్శకులు, ప్రేక్షకులు చెబుతున్నారు.
Also Read: చిరంజీవి, రామ్ చరణ్ 'ఆచార్య' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదలైంది. ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదలైంది. ఇంకా కొన్ని థియేటర్లలో 'కెజియఫ్ 2' ప్రదర్శింపబడుతోంది. ఫైనల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందనేది చూడాలి.
Also Read: 'ఆచార్య'తో కొరటాల శివకు 25 కోట్లు లాస్? వచ్చేది పోయె, వస్తుందని అనుకున్నదీ పోయె!
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Hombale Films (@hombalefilms)
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Nayanthara Wedding Date: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Ashoka Vanamlo Arjuna Kalyanam: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా
Major Ticket Prices: కరోనా తర్వాత తక్కువ టికెట్ రేట్స్ వసూలు చేస్తున్న సినిమా అడివి శేష్ మేజర్
Vivo T2x 5G: రూ.11 వేలలోనే వివో 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?
Kishan Reddy On TRS: తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పెట్టుబడులు కేంద్రం ఘనతే- ప్రజలు గమనిస్తున్నారన్న కిషన రెడ్డి
AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !