By: ABP Desam | Updated at : 15 Apr 2022 07:52 PM (IST)
KGF-2
KGF 2 in OTT | నిన్న ‘RRR’ బాలీవుడ్ బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలకొడితే.. నేడు ‘KGF 2’ మూవీ కూడా అదే రేంజ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు సిద్ధమైపోయింది. టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు మాంచి రివ్యూలు సంపాదించిన కేజీఎఫ్-2 త్వరలోనే ఓటీటీలో కూడా సందడి చేయడానికి సిద్ధమైపోతోంది. అంచనాలకు తగినట్లే ఈ చిత్రం ఉండటంతో హీరో యాశ్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.
మరోవైపు ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు కూడా ఎక్కడాలేనంత క్రేజ్ లభిస్తోంది. నీల్ తర్వాతి చిత్రం ‘సలార్’లో ప్రభాస్ హీరో కావడంతో అంచనాలు మామోలుగా లేవు. ‘కేజీఎఫ్-2’ తొలి రోజే రూ.135 కోట్ల రూపాయాలు వసూళ్లయ్యాయి. ఇందులో బాలీవుడ్ నుంచి వచ్చిన కలెక్షన్స్ రూ.50 కోట్లు. సినిమాకు ఇప్పటికే మంచి టాక్ వచ్చింది కాబట్టి.. మున్ముందు కూడా మంచి వసూళ్లే రాబడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నారు.
Also Read: 'కేజీయఫ్ 2' సినిమా రివ్యూ: నో డౌట్ - బొమ్మ బ్లాక్‌బస్టర్, యశ్ అదుర్స్ అంతే!
మరోవైపు ఓటీటీలో ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నవారికి కూడా గుడ్ న్యూస్. త్వరలోనే ఈ చిత్రాన్ని ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో రిలీజ్ చేయడానికి ఒప్పందం జరిగినట్లు సమాచారం. రిలీజ్ డేట్‌కు నాలుగు వారాల తర్వాత ‘కేజీఎఫ్ 2’ స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మే 13 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావల్సి ఉంది. కేజీఎఫ్-2లో యశ్‌తోపాటు సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, శ్రీనిధి శెట్టి, ఈశ్వరీ రావు తదితరులు నటించారు.
Also Read: 'గాలివాన' రివ్యూ: 'జీ 5'లో విడుదలైన సిరీస్ ఎలా ఉందంటే?
NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్
Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్
F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్
Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
NTR30: బన్నీ నో చెప్పిన కథలో ఎన్టీఆర్ నటిస్తున్నారా?
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!