Keerthi Suresh: షూటింగ్‌లో నన్ను ఆ హీరోయిన్ పేరుతో పిలిచేవారు - సర్కారు వారి పాట ఈవెంట్లో కీర్తి క్యూట్ కంప్లయింట్!

సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్లో సినిమా హీరోయిన కీర్తి సురేష్ మాట్లాడారు.

FOLLOW US: 

సర్కారు వారి పాట షూటింగ్ జరిగే సమయంలో దర్శకుడు పరశురామ్ తన పేరు మర్చిపోయి రష్మిక అని పిలిచేవారని సర్కారు వారి పాట హీరోయిన్ కీర్తి సురేష్ అన్నారు. ఆయన గత సినిమా గీత గోవిందంలో హీరోయిన రష్మిక కాబట్టి అలా అన్నారని, తర్వాతి సినిమాలో రష్మిక హీరోయిన్‌గా చేస్తే కీర్తి సురేష్ అని పిలుస్తారో లేదో చూడాలని క్యూట్‌గా కామెడీ చేశారు. సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కీర్తి సురేష్ మాట్లాడారు.

ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ ‘నేను మైత్రి మూవీ మేకర్స్‌తో ఇంతకు ముందే పనిచేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. కానీ సర్కారు వారి పాటతో ఈ ప్రయాణం ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాతలందరికీ ధన్యవాదాలు. కళావతిని నాకు బహుమతిగా ఇచ్చినందుకు పరశురామ్‌కు థ్యాంక్స్.’

‘షూటింగ్‌లో పరశురామ్ అప్పుడప్పుడు నా పేరు మర్చిపోయే రష్మిక అనేవారు. ఆయన రష్మికతో తర్వాతి సినిమా చేసేటప్పుడు కీర్తి అని పిలుస్తారో లేదో చూడాలి. ఆయనతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. కళావతిగా అందరి మదిలో నిలిచిపోయేలా నన్ను చూపించినందుకు సినిమాటోగ్రాఫర్ మదికి థ్యాంక్స్. ఇది థమన్‌తో నాకు రెండో సినిమా. భం అఖండ లాంటి మాస్ సాంగ్ నుంచి కళావతి వంటి క్లాస్ సాంగ్ వరకు అన్నీ హిట్లు కొడుతున్నారు. పాటలు ఇస్తూ, స్టేజ్ షోలు, లైవ్ షోలు చేయడం చాలా కష్టం. ఇవన్నీ నువ్వు ఎలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు.’

‘మహేష్ బాబుతో షూటింగ్‌లో ఉన్నప్పుడు ఆయన టైమింగ్ ఎలా మ్యాచ్ చేయాలని నాకు టెన్షన్. డబ్బింగ్ చెప్పేటప్పుడు తన గ్లామర్ ఎలా మ్యాచ్ చేస్తానా అని టెన్షన్. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ నన్ను మాట్లాడనిస్తారో లేదో టెన్షన్. కానీ అవి నాకు మాత్రమే టెన్షన్. మీకు (అభిమానులకు) ఇవన్నీ సెలబ్రేషన్స్. మహేష్ గారితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్.’

‘ఈ సినిమా కోసం అభిమానులు ఎంత వెయిట్ చేస్తున్నారో తెలుసు. ఆయన ఉన్నారు... ఆయన విన్నారు... ఆయన మీ ముందుకు వస్తున్నారు. మే 12వ తేదీన థియేటర్‌కు వెళ్లి సేఫ్‌గా సినిమా చూడండి. మహేష్ రియల్ లైఫ్ కళావతి నమ్రతకు థ్యాంక్స్. ఆవిడ ఎంతో సపోర్ట్ చేశారు. లవ్ యూ ఆల్...’ అన్నారు.

Published at : 07 May 2022 11:59 PM (IST) Tags: Mahesh Babu keerthi suresh Sarkaru Vaari Paata Sarkaru Vaari Paata pre release event Parasuram Petla Keerthi Suresh Speech

సంబంధిత కథనాలు

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!