అన్వేషించండి

Keeravani: ఇళయరాజా సంగీతంలో కీరవాణి పాట - ఏ సినిమా కోసమో తెలుసా?

Keeravani turns lyricist again: కీరవాణిలో మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, లిరిసిస్ట్ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు 60కు పైగా పాటలు రాశారు. ఇప్పుడు ఇళయరాజా సంగీతంలో పాట రాశారు. అది ఏ సినిమా కోసమో తెలుసా?

ఇండియన్ సినిమా స్థాయిని ఆస్కార్ అంత ఎత్తులో నిలబెట్టిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani). ఆయనలో స్వరకర్త మాత్రమే కాదు... సాహిత్య కారుడు కూడా ఉన్నారు. ఆయన పాటలు కూడా రాస్తారు. ఇప్పటి వరకు కీరవాణి 60కు పైగా పాటలు రాశారు. ఇప్పుడు ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఒక పాట రాశారు. అది ఏ సినిమా కోసమో తెలుసా?

'షష్టిపూర్తి' కోసం పాట రాసిన కీరవాణి
రూపేష్ కథానాయకుడిగా మా ఆయి (MAA AAI) ప్రొడక్షన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేసిన సినిమా 'షష్టిపూర్తి' (Shashtipurthi Movie). ఇందులో నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, ఉత్తమ నటిగా రెండుసార్లు జాతీయ పురస్కారం గెలుచుకున్న అర్చన ప్రధాన తారాగణం. క్లాసిక్ హిట్ 'లేడీస్ టైలర్' విడుదలైన 38 ఏళ్ళకు వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. పవన్ ప్రభ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రూపేష్ చౌదరి నిర్మాత. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

న్యూ ఇయర్ సందర్భంగా 'షష్టిపూర్తి' సినిమాలోని 'ఏదో ఏ జన్మ లోదో... ఈ పరిచయం' పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు  వెల్లడించారు. ఈ సాంగ్ స్పెషాలిటీ ఏమిటంటే... ఇళయరాజా సంగీతం అందించగా, కీరవాణి సాహిత్యం సమకూర్చారు.

'ఏదో ఏ జన్మ లోదో...' పాట గురించి దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ ''మేం చెన్నైలో షూటింగ్ చేస్తున్నాం. ఒకవైపు చిత్రీకరణ, మరొక వైపు మ్యూజిక్ సిట్టింగ్స్ - సాంగ్స్ రికార్డింగ్ జరుగుతున్నాయి. సినిమాలో ఐదు పాటలున్నాయి. చైతన్య ప్రసాద్ గారు కొన్నిటికి సాహిత్యం అందించారు. ప్రత్యేక సందర్భంలో వచ్చే పాటకు కీరవాణి గారు సాహిత్యం అందిస్తే బావుంటుందని భావించాను. చైతన్య ప్రసాద్ గారికి కీరవాణి గారు బాగా తెలుసు. ఇద్దరూ సన్నిహితులు. చైతన్య ప్రసాద్ గారి ద్వారా కీరవాణి గారిని సంప్రదించాను. మా అదృష్టం కొలదీ ఆ సమయంలో కీరవాణి గారు చెన్నైలోనే ఉన్నారు. భోజన సమయంలో వెళ్లి కలిశా. సినిమాలో సందర్భం చెప్పి పాట రాయమని అడిగాను. వెంటనే ఓకే అన్నారు. మేం స్టూడియో‌కు తిరిగి వెళ్లే సరికి పల్లవి రాసి పంపించారు. ఆ రోజే చరణం, తర్వాత రోజు మరో చరణం రాసేశారు. ఇళయరాజా గారి బాణీకి ఆస్కార్ విజేత కీరవాణి గారు సాహిత్యం అందించడం, అది కూడా మా సినిమాలో పాట కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మేం చేసుకున్న అదృష్టమిది. ఇళయరాజా గారి బాణీలో కీరవాణి గారు పాట రాయడం ఇదే ప్రథమం. అదీ కీరవాణి గారు ఆస్కార్ గెలుచుకున్న తర్వాత పాట రాయడం ఇంకా విశేషం'' అని చెప్పారు.

Also Readమహేష్ బాబు - రాజమౌళి సినిమా పూజ ఎక్కడ, ఎన్ని గంటలకు జరుగుతుందంటే?

Keeravani: ఇళయరాజా సంగీతంలో కీరవాణి పాట - ఏ సినిమా కోసమో తెలుసా?

చిత్ర కథానాయకుడు - నిర్మాత రూపేష్ మాట్లాడుతూ ''మా సినిమాలో ఇళయరాజా గారి సంగీతం, కీరవాణి గారి సాహిత్యంతో కూడిన పాట ఉండటం మా అదృష్టం. ఈ ఛాన్స్ హీరోగా, నిర్మాతగా నాకు ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. కుటుంబ బంధాలు - విలువల నేపథ్యంలో తీసిన చిత్రమిది. రాజేంద్ర ప్రసాద్, అర్చనతో నటించడం నాకొక లెర్నింగ్ ప్రాసెస్. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్ డేట్ వెల్లడిస్తాం'' అని తెలిపారు. రూపేష్ సరసన ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్ నటించారు.

Also Read: క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ సూపర్ స్టార్... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Shiva Rajkumar: క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియోఅమెరికాలో తెలుగు యూత్ పాడు పని! కేటీఆర్, బండి సంజయ్‌ అనుచరులేనా?Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Shiva Rajkumar: క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
Atul Subhash: ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్ - వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
Krishna Last Film: కృష్ణ ఆఖరి సినిమా విడుదలకు రెడీ - ఎందుకు లేట్ అయ్యిందో చెప్పిన డైరెక్టర్
కృష్ణ ఆఖరి సినిమా విడుదలకు రెడీ - ఎందుకు లేట్ అయ్యిందో చెప్పిన డైరెక్టర్
Hyderabad Crime News: భార్య దెప్పిపొడుస్తోందని రాయితో కొట్టి చంపేశాడు- హైదరాబాద్‌లోని మేడిపల్లిలో దారుణం
భార్య దెప్పిపొడుస్తోందని రాయితో కొట్టి చంపేశాడు- హైదరాబాద్‌లోని మేడిపల్లిలో దారుణం
Embed widget