అన్వేషించండి

PaPa Telugu Movie: తెలుగులో డబ్బింగ్ అవుతున్న తమిళ్ బ్లాక్ బస్టర్!

కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన తమిళ హిట్ 'దా... దా...'ను తెలుగులో 'పా...  పా'గా డబ్బింగ్ చేశారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.

మలయాళ నటి అపర్ణా దాస్ (Aparna Das)కు తెలుగులోనూ కొందరు అభిమానులు ఉన్నారు. ఆమె నటించిన సినిమాలు తక్కువే అయినప్పటికీ... ప్రశంసలు ఎక్కువ వచ్చాయి. తెలుగులో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ'లో నటించారు. గతేడాది ఆమె నటించిన తమిళ సినిమా 'దా... దా' బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో 'పా... పా' పేరుతో అనువదించారు.

'పాపా... ఓ నాన్న'గా దాదా...
ట్రైలర్ విడుదల చేసిన నక్కిన!
'పాపా' సినిమాకు 'ఓ నాన్న' అనేది ఉపశీర్షిక. ఇందులో కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించారు. కె భాగ్యరాజ్, ఐశ్వర్య భాస్కరన్ హీరోకి తల్లిదండ్రులుగా.. వీటీవీ గణేష్, ప్రదీప్ ఆంటోనీ ఇతర ప్రధాన పాత్రల్లో  కనిపించనున్నారు. గణేష్ కె బాబు దర్శకత్వం వహించారు. తమిళంలో ఈ చిత్రాన్ని ఎస్ అంబేత్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జె కె ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఎంఎస్. రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చేతుల మీదుగా 'పాపా' ట్రైలర్ విడుదల చేశారు.

Also Readభీమా రివ్యూ: క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్ ఇచ్చిన గోపీచంద్ - సినిమా హిట్టా? ఫట్టా?

సినిమా చూశా... చాలా బావుంది - త్రినాథరావు నక్కిన
'పాపా' ట్రైలర్ విడుదల కార్యక్రమానికి రావడానికి ముందు తనకు నిర్మాత ఎంఎస్ రెడ్డి గారు తమిళ సినిమా 'దాదా'ను చూపించారని దర్శకుడు త్రినాథరావు నక్కిన తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''దాదా... అంటే నాన్న. పాపా... అంటే కూడా నాన్నే. తమిళ రచయిత, దర్శకుడు గణేష్ కె బాబు సినిమాలో ప్రతి సన్నివేశాన్ని చాలా బాగా రాసుకున్నాడు. ఏదైతే రాసుకున్నాడో... అది తెరపైకి తీసుకు వచ్చాడు. నాకు ఆయన రైటింగ్ స్టైల్ నచ్చింది. పాపా... ఇదొక నాన్న కథ మాత్రమే కాదు, స్నేహితుడు కథ, అమ్మ కథ, ప్రేమికుడి కథ. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో హీరో కవిన్ చక్కగా నటించాడు. అతని క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. తన హెయిర్ స్టైల్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుని చేశారు. నాకు నచ్చిన చిత్రమిది. సంగీతం, సినిమాటోగ్రఫీ ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా ఉన్నాయి. థియేటర్లలో సినిమా చూసి సక్సెస్ చేయాలి'' అని అన్నారు.

Also Readగామి రివ్యూ: అఘోరాగా విశ్వక్‌ సేన్ నటించిన సినిమా ఎలా ఉంది? హిట్టా
PaPa Telugu Movie: తెలుగులో డబ్బింగ్ అవుతున్న తమిళ్ బ్లాక్ బస్టర్!

నిర్మాత ఎంఎస్ రెడ్డి మాట్లాడుతూ... ''బిజీగా ఉన్నప్పటికీ మాకోసం ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్. గతంలో 'సాహసం చేయరా డింభకా' సినిమా ప్రొడ్యూస్ చేశా. ఇప్పుడు 'పా...పా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. తమిళంలో విడుదలైన 50 రోజుల తర్వాత థియేటర్లకు వెళితే హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. అప్పుడు అమెరికాలో నా స్నేహితుడు శ్రీకాంత్ కి ఫోన్ చేసి 'మంచి సినిమా చూశా' సినీ చెప్పారు. తన సహకారంతో తెలుగులోకి తీసుకొస్తున్నా. అతి త్వరలో 'ఆత్రేయపురం ఆణిముత్యం' సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ సినిమాతో మణికంఠ అనే కొత్త దర్శకుని పరిచయం చేయబోతున్నాను'' అని చెప్పారు. 'పాపా' చిత్రానికి సహ నిర్మాతలు: శ్రీకాంత్ నూనెపల్లి - శశాంక్ చెన్నూరు, ఛాయాగ్రహణం: కె ఎళిల్ అరుసు, సంగీతం: జెన్ మార్టిన్.

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget