By: ABP Desam | Updated at : 17 May 2023 01:18 PM (IST)
'మళ్ళీ పెళ్లి'లో నరేష్, పవిత్రా లోకేష్
'కావేరి గాలిలా...
తాకేసి పోకలా!
నేనింక ఉండేదెలా?''
అంటూ పవిత్రా లోకేష్ (Pavitra Lokesh)ను చూసి నవరస రాయ నరేష్ విజయ కృష్ణ (Naresh Vijaya Krishna) పాట పాడుతున్నారు. వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న 'మళ్ళీ పెళ్లి' సినిమాలో ప్రేమ గీతమిది.
మెగా ఫిల్మ్ మేకర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన 'మళ్ళీ పెళ్లి' చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ విజయ కృష్ణ మూవీస్ సంస్థను ఈ సినిమాతో పునః ప్రారంభించారు. నరేష్ విజయ కృష్ణ నిర్మించారు. ఆల్రెడీ టీజర్, ట్రైలర్, రెండు పాటలను విడుదల చేశారు. ఈ 'కావేరి గాలిలా... తాకేసి పోకలా' సాంగ్ మూడోది. ఈ రోజు విడుదల చేశారు.
'కావేరి గాలిలా...' పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. నరేష్ అయ్యర్ ఆలపించారు. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే... నరేష్, పవిత్ర జీవితంలో కొన్ని రోజుల క్రితం జరిగిన ఘటనలు, సంఘటనలతో సినిమా తెరకెక్కించారని అర్థం అవుతోంది. ఇందులో పవిత్రతో నరేష్ పరిచయం తర్వాత 'ఇంకొక జన్మే అనిపిస్తున్నా... జీవితమింకా మొదలే కాదేంటో?' అంటూ వాళ్ళ పరిచయాన్ని, బంధాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
Also Read : తెలుగు హీరోను డమ్మీ చేస్తే ఎలా? తమిళ క్యారెక్టర్ ఆర్టిస్టులే ఎక్కువా?
'మళ్ళీ పెళ్లి'ని సినిమా అనడం కంటే నరేష్, పవిత్రాల బయోపిక్ (pavitra naresh biopic) లేదా సెమీ బయోపిక్ అనడం కరెక్ట్ అని కొందరు చెబుతున్నారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ ఎలా ఉందంటే? నరేష్ జీవితంలో జరిగిన ఘటనలు, సంఘటనల సమాహారమే అని అర్థం అవుతోంది. అయితే... సినిమాలో పేర్లు మార్చారు. నరేంద్రగా నరేష్, పార్వతిగా పవిత్రా లోకేష్ కనిపించారు. మూడో భార్య రమ్యా రఘుపతి పాత్రలో వనితా విజయ్ కుమార్ నటించారు.
Also Read : పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ బైక్స్ & కారుకు సేమ్ నంబర్, సమంత కారుకూ... హరీష్ శంకర్ 2425 సెంటిమెంట్!
నరేష్, పవిత్రా లోకేష్ పరిచయం ప్రేమగా ఎలా మారింది? టాపిక్ నుంచి 'మా' ఎలక్షన్స్, బెంగళూరు ఎపిసోడ్ & మూడో భార్యను ఆయన కాలి మీద తన్నడం వరకు 'మళ్ళీ పెళ్లి' ట్రైలర్లో అన్నీ చూపించారు. మేడమ్ (విజయ నిర్మల) కొడుకు నరేంద్ర అని అన్నపూర్ణమ్మ చెప్పే డైలాగ్ వింటుంటే... ఎటువంటి మొహమాటాలకు పోలేదని తెలుస్తోంది. డైలాగుల్లో కొన్ని డబుల్ మీనింగ్స్ కూడా చోటు చేసుకున్నాయి. వెయ్యి కోట్ల ఆస్తి నరేష్ వెనుక ఉందని చెప్పకనే చెప్పారు.
అనన్యా నాగళ్ళ గ్లామర్ హైలైట్ అయ్యేలా...
'మళ్ళీ పెళ్లి' నుంచి ఇప్పటికి రెండు పాటలు విడుదల చేశారు. తొలి పాట 'ఉరిమే మేఘమా...'లో నరేష్, పవిత్రా లోకేష్ ఎక్కువ కనిపించారు. ఆ తర్వాత విడుదల చేసిన రెండో పాట 'రా రా హుస్సూర్ నాతో...'లో వాళ్ళిద్దరితో పాటు 'వకీల్ సాబ్', 'మల్లేశం', 'ప్లే బ్యాక్' సినిమాల ఫేమ్ అనన్యా నాగళ్ళ గ్లామర్ హైలైట్ అయ్యింది. ఈ నెల 26న థియేటర్లలో తెలుగు, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది.
జయసుధ, శరత్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్న 'మళ్ళీ పెళ్లి' సినిమాలో వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.
Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?
Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ
Sharwanand Marriage : శర్వానంద్ పెళ్ళైపోయిందోచ్ - రక్షితతో ఏడడుగులు వేసిన హీరో
Shiva Balaji Madhumitha : మధుమితను ప్రేమలో పడేయాలని శివబాలాజీ అన్ని చేశారా - వెన్నెల కిశోర్ 'ఛీ ఛీ' అని ఎందుకున్నారు?
NTR Back To India : ఇండియా వచ్చేసిన ఎన్టీఆర్ - ఈ వారమే 'దేవర' సెట్స్‌కు...
Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి
Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి
Coromandel Express: ప్రమాదంలో గూడ్సు రైలు పైకెక్కేసిన కోరమాండల్ రైలింజన్, విస్మయం కలిగించేలా ఘటన!