Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2' విజయాలే కారణమా?
ఫేమస్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తన 50వ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ చేశారు. అయితే, ఆయన రూట్ మార్చడం గమనార్హం.
'కుచ్ కుచ్ హోతా హై' నుంచి 'ఏ దిల్ హై ముష్కిల్' వరకూ... ప్రముఖ హిందీ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ చూడండి. ప్రతి సినిమాలో ప్రేమ, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు ప్రధానంగా ఉంటాయి. అటువంటి ఆయన రూట్ మార్చారు.
కరణ్ జోహార్ తన 50వ పుట్టినరోజు సందర్భంగా ఒక కొత్త సినిమా ప్రకటించారు. సో వాట్? అందులో వింత ఏముంది? విశేషం ఏమిటి? అనుకోవచ్చు. అసలు మేటర్ ఏంటంటే... యాక్షన్ సినిమా అని నొక్కి మరీ చెప్పారు కరణ్ జోహార్. ఆయన ఖాతాలో విజయాలు ఉన్నాయి. విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాలు ఉన్నాయి. అయితే, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా లేదు.
'బాహుబలి' రెండు పార్టులు, 'సాహో', 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్' రెండు భాగాలు - ఈ మధ్య సౌత్ ఇండియన్ హీరోలు, దర్శకులు చేసిన మాస్ మసాలా యాక్షన్ సినిమాలు హిందీలో భారీ విజయాలు సాధించాయి. వాటి ఫలితాలు చూసి కరణ్ జోహార్ యాక్షన్ సినిమా తీయాలని అనుకుంటున్నారా? లేదంటే ఆయనకు యాక్షన్ సినిమా చేయాలని అనిపించిందో? ఏది ఏమైనా రూట్ మార్చారు.
Also Read: కమల్ హాసన్‌కు NTR 31 కథ చెప్పిన ప్రశాంత్ నీల్ - లోక నాయకుడు ఏం చెబుతాడో?
KARAN JOHAR ANNOUNCES NEXT FILM: ACTION FLICK... On his 50th birthday, director #KaranJohar announces his next film - an action flick... Shoot begins April 2023, post the release of #RockyAurRaniKiPremKahani... OFFICIAL STATEMENT... pic.twitter.com/a5t6dTuvyn
— taran adarsh (@taran_adarsh) May 25, 2022
ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న 'రాకీ ఆర్ రాణీ కి ప్రేమ్ కహాని' సినిమాకు కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ఏప్రిల్ 2023లో యాక్షన్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.
Also Read: రష్మికకు అదొక సెంటిమెంట్ - ఆమె ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా షెడ్యూల్‌లో అది కామన్
View this post on Instagram