Kannappa - కన్నప్ప: టికెట్ రేట్స్, థియేటర్స్ కౌంట్ to సెన్సార్ కట్స్, బడ్జెట్ వరకు... ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్!
Kannappa Release Date: జూన్ 27న 'కన్నప్ప' పాన్ ఇండియా రిలీజ్. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్, కట్స్ నుంచి ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే స్క్రీన్స్ కౌంట్, టికెట్ రేట్స్ వరకు... మీకు ఈ డీటెయిల్స్ తెలుసా?

'కన్నప్ప' ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదల అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. విష్ణు మంచు ఈ సినిమాతో పాన్ ఇండియా టార్గెట్ చేశారు. అందుకోసం ప్రాణం పెట్టేశారు. ఈ సినిమా సెన్సార్, సెన్సార్ బోర్డు విధించిన కట్స్ నుంచి వరల్డ్ వైడ్ రిలీజయ్యే స్క్రీన్స్ కౌంట్, టికెట్ రేట్స్ వరకు... ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలుసుకోండి.
సింగిల్ స్క్రీన్ vs మల్టీప్లెక్స్:
'కన్నప్ప' టికెట్ రేట్ ఎంత?
Kannappa Ticket Price In AP Telangana: Single Screen vs Multiplex: 'కన్నప్ప' సినిమాకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్, మల్టీప్లెక్స్ - రెండిటిలో ప్రస్తుతం ఉన్న టికెట్ రేటు మీద రూ. 50 పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఏపీలోని మల్టీప్లెక్స్ స్క్రీన్‌లలో 'కన్నప్ప' టికెట్ రేటు రూ. 200 నుంచి రూ. 295 వరకు ఉంది. సింగిల్ స్క్రీన్‌లలో రూ. 100 నుంచి రూ. 150 మధ్యలో ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే... మల్టీప్లెక్స్ స్క్రీన్‌లలో టికెట్ రేటు 295 రూపాయలు. రిక్లయినర్ సీట్స్ అయితే రూ. 350. సింగల్ స్క్రీన్‌లలో నెల టికెట్టు రూ. 50 నుంచి మొదలు పెడితే బాల్కనీ టికెట్టు రూ. 175 వరకు అమ్ముతున్నారు.
Kannappa ticket price in USA: ముంబై లాంటి మెట్రోపాలిటన్ సిటీల్లో అయితే కొన్ని ఏరియాల్లో రిక్లయినర్ సీట్ రేటు రూ. 860 ఉంది. బుకింగ్ ఛార్జీలు అన్నీ కలిపితే 950 దాటుతుంది. అమెరికాలో అయితే ప్రీమియర్ షోస్ టికెట్ రేటు 25 డాలర్లు. ఫస్ట్ వీక్ 20 డాలర్లుగా పెట్టారు.
'కన్నప్ప' విడుదలయ్యేథియేటర్లు ఎన్ని?
Kannappa Theatrical Release, How Many Screens Is Kannappa Releasing In Worlswide?: 'కన్నప్ప' సినిమాను ప్రపంచవ్యాప్తంగా 5,400 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. ఓవర్సీస్ మార్కెట్ (విదేశాల్లో) 1,100 స్క్రీన్లలో విడుదల అవుతోంది. ఒక్క అమెరికాలో 200లకు పైగా ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. ఇండియాలో ఈ సినిమా రిలీజ్ అవుతున్న స్క్రీన్స్ సంఖ్య 4,300. విష్ణు మంచు కెరీర్‌లో బిగ్గెస్ట్ రిలీజ్ ఇది. రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, చందమామ కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణం ఉండటంతో క్రేజ్ కూడా అదే స్థాయిలో ఉంది.
Also Read: ఎవరీ ప్రీతి ముకుందన్? 'కన్నప్ప'లో విష్ణు మంచు జంటగా నటించిన హీరోయిన్ బ్యాగ్రౌండ్, కెరీర్ తెల్సా?
'కన్నప్ప'కు సెన్సార్ విధించిన కట్స్ ఎన్ని?
Kannappa Censor Certificate, Cuts, Run Time: 'కన్నప్ప' సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. సుమారు 10 కట్స్ ఇచ్చిందని తెలిసింది. తొలుత 3.15 గంటలు సినిమా ఇవ్వగా... కట్స్ తర్వాత 3.03 గంటల నిడివి వచ్చిందట. నెమలి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కొన్నిటిని కట్ చేశారట. అలాగే, యాక్షన్ సీన్లలో బ్లడ్ ఎక్కువ ఉన్నవాటికి కూడా కత్తెర వేశారట.
'కన్నప్ప' బడ్జెట్ ఎంత? బిజినెస్ ఎలా జరిగింది?
Kannappa Budget, Pre Release Business Details: 'కన్నప్ప' నిర్మాణానికి దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిసింది. ఒక్క ఏరియా కూడా అమ్మలేదు. సొంతంగా విడుదల చేస్తున్నారు. డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్మలేదు. ఒక విధంగా విష్ణు భారీ రిస్క్ చేస్తున్నారని చెప్పాలి. సినిమాపై నమ్మకం ఉండటంతో కమిషన్ బేసిస్ మీద డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇచ్చారు. ఓటీటీ వాళ్లు ఆఫర్ చేసిన అమౌంట్ నచ్చకపోవడం, థియేటర్లలో రెస్పాన్స్ చూశాక వాళ్ళే ఎక్కువ రేటు ఆఫర్ చేస్తూ వస్తారని డీల్ ఆపేశారు.





















