Prabhas Cut Out: 'కన్నప్ప' థియేటర్స్ దగ్గర ప్రభాస్ మేనియా... తెలుగు రాష్ట్రాలలో భారీ కటౌట్లు!
Kannappa Release Date: జూన్ 27న థియేటర్లలోకి వస్తున్న 'కన్నప్ప' థియేటర్ల దగ్గర ప్రభాస్ మేనియా నెలకుంది. ప్రతి చోట ఆయన భారీ కటౌట్లు కనపడుతున్నాయి.

'కన్నప్ప' సినిమాలో విష్ణు మంచు (Vishnu Manchu) టైటిల్ రోల్ చేశారు. ఆయనే హీరో. అయితే తెలుగు రాష్ట్రాలలో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) మేనియా నెలకొంది. సినిమాలో రుద్ర పాత్రలో ఆయన నటించడం వల్ల బాహుబలి డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. 'కన్నప్ప' విడుదల అయ్యే థియేటర్ల దగ్గర తమ అభిమాన కథానాయకుడి భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఆల్రెడీ ఖమ్మంలో కటౌట్...
విశాఖలోని కిన్నెర దగ్గర కూడా!
Prabhas Cut Out Photos At Kannappa Theaters: ఖమ్మంలో 'కన్నప్ప' విడుదల అయ్యే ఓ థియేటర్ దగ్గర ప్రభాస్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. త్వరలో విశాఖలోని కిన్నెరసాని థియేటర్ దగ్గర కూడా కటౌట్ ఏర్పాటు చేయడానికి ఫ్యాన్స్ రెడీ అయ్యారు. పలు ఏరియాలలో ప్రభాస్ కటౌట్లు పెట్టడానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. నార్త్ ఇండియాలో కూడా ప్రభాస్ క్రేజ్ 'కన్నప్ప' సినిమాకు హెల్ప్ అవుతోంది.
లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబుతో పాటు ఆయన తనయుడు విష్ణు మంచుతో ఉన్న స్నేహం వల్ల ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోకుండా ప్రభాస్ ఈ సినిమా చేశారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉన్నప్పటికీ... సోలో హీరోగా ఆయన మార్కెట్ వందల కోట్లు ఉన్నప్పటికీ... అవేవీ ఆలోచించకుండా స్నేహం కోసం ఈ సినిమా చేశారు. ప్రభాస్ గురించి ఇంటర్వ్యూలలోనూ - సినిమా వేడుకలలోనూ విష్ణు మంచు చాలా గొప్పగా చెప్పారు. తన జీవితంలో కృష్ణుడు ప్రభాస్ అని తెలిపారు.
సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడు?
Prabhas role in Kannappa: 'కన్నప్ప' సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడు? ఆయన క్యారెక్టర్ నిడివి ఎంత ఉంటుంది? అని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం రచయిత బివిఎస్ రవి ఇచ్చారు. ఇంటర్వెల్ తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుందని చెప్పారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయన తెర మీద కనిపించనున్నారని తెలిసింది. 'కన్నప్ప' హైలైట్స్‌లో రుద్ర పాత్ర ఒకటి అవుతుందని యూనిట్ కూడా నమ్మకంగా ఉంది.
ప్రభాస్ కాకుండా మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్, నటుడు శరత్ కుమార్ సహ పలువురు ఈ 'కన్నప్ప' సినిమాలో నటించారు. ఈ సినిమాతో ఓపెనింగ్ డే వంద కోట్లు కలెక్ట్ చేయాలని విష్ణు మంచు టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. జూన్ 27న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 5400 స్క్రీన్లలో సినిమా రిలీజ్ కానుంది.
Also Read: 'కన్నప్ప' ఓపెనింగ్ డే టార్గెట్ @ 100 కోట్లు... విష్ణు మంచు ఫస్ట్ డే సెంచరీ కొడతారా?





















