kangana Ranaut On Marriage : పెళ్లంటే ఇష్టం లేదు కానీ టైమ్ వచ్చినప్పుడు అవుతుంది, పిల్లల్నీ కంటా - కంగనా రనౌత్
'టీకూ వెడ్స్ షేరు' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్..తన పెళ్లిపై ఓపెనప్ అయ్యారు. తనకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని, ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉందంటూ కామెంట్స్ చేశారు
Kangana Ranaut : ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటి కంగనా రనౌత్... పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని వెల్లడించింది. కానీ, ప్రతీ దానికి సమయం అనేది ఒకటుంటుంది కదా. అలాగే తన జీవితంలోనూ ఆ సమయం రావాలంటే వస్తుంది. నేను పెళ్లి చేసుకుని నా కంటూ ఓ కుటుంబాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాను. కానీ, సరైన సమయంలో అది జరుగుతుందని నమ్ముతున్నాంటూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకున్నా... టైం వస్తే తప్పక అవుతుందని , దాన్నెవరూ ఆపలేరు కదా అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇంతకు ముందు 2021లోనూ తన వివాహంపై కంగనా ఇలాంటే వ్యాఖ్యలే చేశారు. తన జీవితంలో ఓ ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారని, సమయం వచ్చినపుడు తప్పకుండా అతడిని అందరికీ పరిచయం చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రానున్న ఐదేళ్లలో పెళ్లి చేసుకుని, భర్త, పిల్లలతో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉందని కూడా ఆమె అప్పట్లోనే వెల్లడించారు. తాజాగా చేసిన 'టీకూ వెడ్స్ షేరు' ప్రమోషన్స్ లో భాగంగా... ఆమెను పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు మరోసారి అటువంటి సమాధానమే ఇచ్చారు.
ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవ్నీత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించిన తన మొదటి ప్రొడక్షన్ 'టీకూ వెడ్స్ షేరు' ప్రమోషన్‌లో కంగనా రనౌత్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని జూన్ 23న ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
'ఎమర్జెన్సీ'లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ కనిపించనున్నారు. ఈ మూవీలో కంగనాతో పాటు అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గుండెపోటుతో మరణించిన దివంగత నటుడు సతీష్ కౌశిక్‌కి ఇదే చివరి చిత్రం.
వీటితో పాటు కంగనా రనౌత్ 'చంద్రముఖి 2' చిత్రంలో కూడా కనిపించనున్నారు. హీరోయిన్ జ్యోతిక, సూపర్ స్టార్ రజనీకాంత్ జంటగా నటించిన తమిళ బ్లాక్‌బస్టర్ చిత్రం 'చంద్రముఖి'కి ఈ చిత్రం సీక్వెల్. అందులో రాఘవ లారెన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అందం, నృత్య నైపుణ్యాలకు పేరుగాంచిన రాజు ఆస్థాన నర్తకి పాత్రలో కంగనా రనౌత్ కనిపించనుంది.
Also Read : 'సలార్' మీద భారం వేసిన ప్రభాస్ ఫ్యాన్స్ - అంతా 'ఆదిపురుష్' వల్లే
ఇటీవలే సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసిన కంగనా.. వర్కవుట్లు చేస్తూ కనిపించారు. ఎమర్జెన్సీ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు తగ్గట్టుగా వ్యాయామం చేస్తూ కనిపించారు. ఈ సినిమాలో మిసెస్ గాంధీగా కనిపించడానికి రెండేళ్ల తర్వాత మళ్లీ తన దినచర్యలో వ్యాయామం చేయడం మొదలు పెట్టానని, రాబోయే ఫిల్మ్ లో తన మార్పు కోసం ఎదురుచూస్తున్నానంటూ క్యాప్షన్ లో రాసుకొచ్చారు.
For past two years every cell in my body was Mrs Gandhi, now is the time to move on to the next role, happy to get back to my fitness routine for next action packed comedy 🙂
— Kangana Ranaut (@KanganaTeam) June 13, 2023
(Announcement coming soon) pic.twitter.com/lS3k2RKz0a
Read Also : హాలీవుడ్ ‘ఫ్లాష్’లో ఆంజనేయుడి రిఫరెన్స్ - ఆనందంతో షేర్ చేస్తున్న ఫ్యాన్స్!