Kangana Ranaut: మా నిర్మాత ఆఫీసు అమ్ముకోలేదు - బాలీవుడ్ మీడియాపై కంగనా రనౌత్ ఫైర్
బాలీవుడ్ మీడియాపై కంగనా రనౌత్ విరుచుకుపడ్డారు. నెగిటివ్ పీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. 'ధాకడ్' ఫలితం గురించి కాకుండా ఇతర డిజాస్టర్ సినిమాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
![Kangana Ranaut: మా నిర్మాత ఆఫీసు అమ్ముకోలేదు - బాలీవుడ్ మీడియాపై కంగనా రనౌత్ ఫైర్ Kangana Ranaut fires on Bollywood media over Dhaakad Producer Deepak Mukut office sold out articles Kangana slams Koffee With Karan show calls Karan As Papa Jo Kangana Ranaut: మా నిర్మాత ఆఫీసు అమ్ముకోలేదు - బాలీవుడ్ మీడియాపై కంగనా రనౌత్ ఫైర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/07/dbb299bf955f256520cd2321dd18632b1657193976_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'ధాకడ్' సినిమా థియేటర్ల దగ్గర ఆశించిన విజయం సాధించలేదు. సుమారు 85 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో రూపొందిన సినిమా థియేట్రికల్ బాక్సాఫీస్ దగ్గర కేవలం మూడంటే మూడు కోట్లు మాత్రమే వసూలు చేసిందని సమాచారం. వసూళ్ళు, లెక్కలు చూస్తే... బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెప్పే మాటల ప్రకారం తీవ్రంగా నిరాశ పరిచింది.
'ధాకడ్' థియేటర్ల దగ్గర దారుణంగా పరాయజం పాలవడంతో నిర్మాత దీపక్ ముకుత్ ఆఫీసు అమ్మేశారని ఆ మధ్య బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. లేటెస్ట్ ఇంటర్వ్యూలో అవన్నీ పుకార్లేనని ఆయన చెప్పుకొచ్చారు. తనకు భారీ నష్టాలు ఏమీ రాలేదని, కొంత లాస్ ఉన్నప్పటికీ అది రికవరీ అవుతుందని ఆయన తెలిపారు.
జూలై 1న జీ 5 ఓటీటీలో 'ధాకడ్' విడుదలైంది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో మంచి అమౌంట్ వచ్చిందట. నిర్మాత ఆఫీసు అమ్ముకోలేదని చెప్పడంతో కంగనా రనౌత్ బాలీవుడ్ మీడియా మీద ఫైర్ అయ్యారు. తనపై ఎటాక్ చేసే దమ్ముంటే ముందుకు వచ్చి చేయాలని ఘాటుగా స్పందించారు. ''రోజూ 'ధాకడ్' ఫ్లాప్ అని వందల ఆర్టికల్స్ చదువుతున్నాను. '83', 'గంగూబాయి కతియావాడి', 'రాధే శ్యామ్', 'జగ్ జగ్ జియో' డిజాస్టర్స్ గురించి ఎవరూ మాట్లాడరు. ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?'' అని ఆమె ప్రశ్నించారు.
Also Read : 'మాయోన్' రివ్యూ: శ్రీకృష్ణ మాయ నిజమా? కల్పితమా? ఈ మైథలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
'కాఫీ విత్ కరణ్' కార్యక్రమం మీద కూడా కంగనా రనౌత్ విమర్శలు గుప్పించారు. కరణ్ జోహార్‌కు బదులు 'పాపా జో' అని సంబోధించిన కంగనా... ఆ కార్యక్రమంలో తన ఎపిసోడ్ మోస్ట్ పాపులర్ అని, ఆ తర్వాత ఫిల్మ్ ఫేర్ అవార్డులను బ్యాన్ చేసినట్టు కరణ్‌ను ప్రజలు బ్యాన్ చేశారని పేర్కొన్నారు.
Also Read : థోర్ లవ్ అండ్ థండర్ రివ్యూ: ఉరుముల దొర ఆకట్టుకున్నాడా?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)