అన్వేషించండి

'లియో'లో కమల్ హాసన్ సర్ప్రైజ్ ఎంట్రీ? దాచిపెట్టాం, ఇంకా చాలా ఉన్నాయంటున్న లోకేష్

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ నటిస్తున్న 'లియో' మూవీలో లోకనాయకుడు కమలహాసన్ సర్ప్రైజ్ ఎంట్రీ ఉంటుందని లేటెస్ట్ కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లియో'(Leo) పై ఇప్పటికే ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పీక్స్ కి చేర్చింది. ఈ ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ అయితే కచ్చితంగా ఈ మూవీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమని చెప్పకనే చెప్పేస్తున్నారు. ఇక 'లియో' ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఓ ఇంటర్వ్యూలో 'లియో' మూవీ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమని స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ సర్ ప్రైజ్ ఎంట్రీ కూడా ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

లేటెస్ట్ కోలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం, లియో మూవీలో కమల్ హాసన్ వాయిస్ ఓవర్ ఉంటుందట. సినిమా క్లైమాక్స్ లో కమల్ వాయిస్ ఓవర్ వస్తుందని, లియో తర్వాత లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో విక్రమ్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. అంటే లియో తర్వాత ఇదే యూనివర్స్ నుంచి 'విక్రమ్ 2' వస్తుందన్నమాట. అంతేకాకుండా కమల్ వాయిస్ మాత్రమే కాకుండా క్లైమాక్స్‌లో విక్రమ్ సర్ప్రైజింగ్ ఎంట్రీ కూడా ఉంటుందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ పరోక్షంగా వెల్లడించారు. లియో లో మీరు ఊహించని సర్ప్రైజ్ లు ఉంటాయని వాటిని ఇప్పుడే చెప్పదలుచుకోలేదని అన్నాడు.

దీంతో లియోలో కచ్చితంగా కమల్ ఎంట్రీ ఉంటుందని ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ లో వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈ ఇంటర్వ్యూల్లోనే లియోపై రకరకాల హింట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను తారస్థాయికి తీసుకెళ్తున్నాడు. "మరో పది రోజులు ఆగండి మీకే తెలుస్తుంది. సినిమాలో చాలా విషయాలని కావాలనే మేము దాచిపెట్టాం. ప్రేక్షకులు వాటిని పూర్తిగా థియేటర్స్ లో ఎక్స్ పీరియన్స్ చేయాలని అలా చేశాం" అంటూ చిత్ర నిర్మాత కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మూవీ టీం సినిమాలో చాలా విషయాలను దాచి పెట్టమని అధికారికంగా స్పష్టం చేస్తుండడంతో కచ్చితంగా అ మూవీలో కమల్ ఎంట్రీ ఉంటుందని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ మూవీలో విజయ్ కి జోడిగా త్రిష హీరోయిన్ గా నటిస్తోంది సుమారు. 15 ఏళ్ల తర్వాత విజయ్ సరసన త్రిష నటిస్తుండడంతో ఈ జోడిని బిగ్ స్క్రీన్స్ పై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ బ్యానర్ పై లలిత్ కుమార్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించారు. అక్టోబర్ 19 దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read : విజయ్ అభిమానులకు సారీ చెప్పిన విగ్నేష్ శివన్ - తప్పు తెలుసుకున్నా అంటూ సుదీర్ఘ పోస్ట్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : అచ్చియమ్మ రోల్‌... రొమాంటిక్ సీన్స్ కాంట్రవర్సీ - రంగమ్మత్త రియాక్షన్
అచ్చియమ్మ రోల్‌... రొమాంటిక్ సీన్స్ కాంట్రవర్సీ - రంగమ్మత్త రియాక్షన్
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Balan The Boy: తెలుగు డబ్బింగ్ ఇంత ఘోరమా? మినిమమ్ కేర్ తీసుకోరా బాలన్?
తెలుగు డబ్బింగ్ ఇంత ఘోరమా? మినిమమ్ కేర్ తీసుకోరా బాలన్?
Salim Kumar: విషమంగా నేషనల్ అవార్డు విన్నర్ ఆరోగ్య పరిస్థితి... ఆస్పత్రిలో సలీం కుమార్
విషమంగా నేషనల్ అవార్డు విన్నర్ ఆరోగ్య పరిస్థితి... ఆస్పత్రిలో సలీం కుమార్

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Revanth Reddy: హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Tech Layoffs: 2026లో భారీగా లేఆఫ్స్.. ఇప్పటివరకే 1 లక్షకు పైగా ఉద్యోగాలు తొలగింపు
2026లో భారీగా లేఆఫ్స్.. ఇప్పటివరకే 1 లక్షకు పైగా ఉద్యోగాలు తొలగింపు
Sahara Desert Tragedy: సహారా ఎడారిలో శవాల గుట్టలు - ఎందుకిలా జరుగుతోంది?
సహారా ఎడారిలో శవాల గుట్టలు - ఎందుకిలా జరుగుతోంది?
Embed widget