అన్వేషించండి

Kamal Haasan : పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్

Kamal Haasan Reaction : పుష్పక విమానం సీక్వెల్ గురించి 45 ఏళ్లుగా మాట్లాడుకుంటున్నా... ఇప్పుడు సింగ్ గీతంగా వస్తోందని చెప్పారు కమల్ హాసన్. సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు.

Kamal Haasan Speech In Sing Geetham Pre Release Event : 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టి 'సింగ్ గీతం'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఈ నెల 11న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఆదివారం చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ వేడుకకు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై సింగీతంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

'45 ఏళ్ల స్టోరీ'

తన 21 ఏళ్ల వయసులో సింగీతంతో తన జర్నీ స్టార్ట్ అయ్యిందని... ఫస్ట్ మూవీ క్యాజువల్‌గానే తెరకెక్కిందని అన్నారు కమల్ హాసన్. 'సింగీతం శ్రీనివాసరావుకు సినిమాపై ఎంతో ప్రేమ. ఆ విషయంలో ఇప్పటికీ ఎలాంటి మార్పూ లేదు. మా ఫస్ట్ మూవీ క్యాజువల్‌గానే తెరకెక్కింది. తర్వాత నాకు రెండు కథలు చెప్పారు. వాటిలో ఒకటి పుష్పక విమానం తెరపైకి వచ్చింది. రెండో దాని గురించి 45 ఏళ్లుగా మాట్లాడుకుంటున్నా... కానీ చేయలేకపోయాం.

అదే ఈ 'సింగ్ గీతం'... టేక్ 1, టేక్ 2, టేక్ 3 చెప్పినట్లు... సింగీతానికి ఏజ్ కేవలం నెంబర్ మాత్రమే. నేను తమిళనాడులో ఉన్నప్పుడు ఆయన పేరును కొందరు సంగీతం అని పలికేవారు. ఇన్నేళ్ల తర్వాత సినిమా పేరుతో సంగీతం కాదు సింగీతం అంటూ క్లారిటీ ఇచ్చారు.' అంటూ నవ్వులు పూయించారు.

Also Read : Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?

'ఆ మూవీ రూ.200 కోట్లు'

ఓ స్టార్ హోటల్‌లో 'పుష్పక విమానం' షూటింగ్ చేసినట్లు తెలిపారు కమల్ హాసన్. 'సినిమా అంతా ఏసీలోనే షూట్ చేసినందుకు గర్వంగా ఉంది. ఆ రోజుల్ని చాలా మిస్ అవుతున్నా. అప్పట్లో పుష్పక విమానం రూ.15 లక్షల్లో తీశాం. ఇప్పుడు అది రూ.200 కోట్ల మూవీ వంటిది. 720Pలో షూట్ చేసిన ఫస్ట్ డిజిటల్ మూవీ ఇది.

ఆలోచనల్లో జెన్ జీ కన్నా ఓ అడుగు ముందే ఉంటారు సింగీతం. ఆయన్నుంచి ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయాలని ఉంది. స్టార్స్ ఉంటేనే పెద్ద సినిమా కాదు. పెద్ద సినిమా అంటే గొప్ప ఐడియా ఉండాలి. ఏ సినిమా హిట్ అవుతుంది? ఏది ఫెయిల్ అవుతుంది? అన్నది ఎవరూ చెప్పలేరు. సినిమా హిట్ అయితే అర్హత ఉన్నా లేకున్నా క్రెడిట్ కోసం తాపత్రయపడతారు. కానీ ఫ్లాప్ అయితే మాత్రం ఒకరినొకరు నిందించుకుంటారు.' అని అన్నారు.

ఇండస్ట్రీలోనే అప్పట్లో పుష్పక విమానం మూవీ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. 'విచిత్ర సహోదరులు', 'మైఖేల్ మదన కామరాజు', 'ఆదిత్య 369' ఇలా ఎన్నో హిట్ చిత్రాలు అందించారు సింగీతం శ్రీనివాసరావు. 94 ఏళ్ల వయసులో 'సింగ్ గీతం' అనే మూవీతో రాబోతున్నారు. ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించగా... దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

Also Read : Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nag Ashwin: 'కల్కి' క్లైమాక్స్‌పై విమర్శలు... రిప్లై ఇచ్చిన నాగ్ అశ్విన్ - నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు
'కల్కి' క్లైమాక్స్‌పై విమర్శలు... రిప్లై ఇచ్చిన నాగ్ అశ్విన్ - నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు
Tejaswini Nandamuri Latest Dance Video: సారంగదరియా పాటకు తేజస్విని నందమూరి డ్యాన్స్... సాయి పల్లవి రేంజ్‌లో బాలయ్య చిన్న కుమార్తె స్టెప్పులు
సారంగదరియా పాటకు తేజస్విని నందమూరి డ్యాన్స్... సాయి పల్లవి రేంజ్‌లో బాలయ్య చిన్న కుమార్తె స్టెప్పులు
Maa Inti Bangaram OTT: మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్ డేట్... వంద కోట్లు కొల్లగొట్టిన సమంత సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్ డేట్... వంద కోట్లు కొల్లగొట్టిన సమంత సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Lenin Box Office Collection Day 3: లెనిన్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... అయ్యగారి కెరీర్‌లో నంబర్ వన్ - అఖిల్ దూకుడు
లెనిన్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... అయ్యగారి కెరీర్‌లో నంబర్ వన్ - అఖిల్ దూకుడు
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Telangana Politics Mind Game: తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
TG20 League Winner: టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
Veg Momos Recipe: ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
Embed widget