అన్వేషించండి

Kalyan Ram: విశ్వాసంగా ఉండటానికి కుక్కను అనుకున్నావురా? - కళ్యాణ్ రామ్ కామెంట్స్

Kalyan Ram: కళ్యాణ్ రామ్ అప్‌కమింగ్ మూవీ ‘డెవిల్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ‘దేవర’ గురించి ఆసక్తికర అప్డేట్ బయటపెట్టాడు.

Devil Trailer : నందమూరి కళ్యాణ్ హీరోగా తన కెరీర్ ప్రారంభించినప్పుడు యాక్టర్‌గా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డాడు. గత కొంతకాలంగా తన సినిమాలు కమర్షియల్‌గా హిట్ అవ్వడం మొదలయ్యింది. వైవిధ్యభరితమైన కథలు తనకు హిట్ అందిస్తుండడంతో అదే రూట్‌లో వెళ్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇప్పుడు మరోసారి ‘డెవిల్’ అనే స్పై థ్రిల్లర్ పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా.. అందులో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు కళ్యాణ్ రామ్. ముందుగా తాను తినే మెతుకులపై తన అభిమానుల పేరు ఉంటుందని చెప్తూ.. తన స్పీచ్‌ను ప్రారంభించాడు.

మంచి కంటెంట్..
‘డెవిల్’ ట్రైలర్ బాగుందా అని ఈవెంట్‌కు వచ్చినవారిని అడగగా.. వారంతా బాగుంది అని అరిచారు. దీంతో కళ్యాణ్ రామ్ సంతోషంగా తన స్పీచ్ మొదలుపెట్టాడు. ‘‘బింబిసార అప్పుడు చెప్పాను మీకు - మంచి కంటెంట్ ఉండి, మంచి కథ, కథనంతో విజువల్‌ను గొప్పగా చూపించగలిగితే.. ఆడియన్స్ వచ్చి సినిమాను చూస్తారు, ఆదరిస్తారు అనే మాటను మీరు నిజం చేశారు. డెవిల్ కూడా అలాంటి కథే. విజువల్స్ బాగానే ఉన్నాయిగా.. ఫస్ట్ డేనే చూసేస్తారు కదా. మీకు నచ్చిందన్న నమ్మకం మీ అరుపులతోనే నాకు కలిగింది’’ అని ‘డెవిల్’ గురించి చెప్తుంగానే.. ఆడియన్స్ అంతా ఎన్‌టీఆర్ పేరు అరవడం మొదలుపెట్టారు. అయితే దాని గురించి మాట్లాడాలంటే ముందుగా ‘డెవిల్’ గురించి మాట్లాడాలని, ఆడియన్స్‌ను సైలెంట్‌గా ఉండమని రిక్వెస్ట్ చేసుకున్నాడు.

సినిమా అనేది వన్ మ్యాన్ షో కాదు..
‘‘సినిమా అనేది ఎప్పుడు వన్ మ్యాన్ షో కాదు. ఎంతోమంది ఎఫర్ట్ ఉంటుంది’’ అని టెక్నిషియన్స్ అందరి గురించి చెప్పడం మొదలుపెట్టారు కళ్యాణ్ రామ్. ‘డెవిల్’ అనేది 1940ల్లో జరిగిన కథ కాబట్టి ఆ సెట్ వేయడానికి చాలా కష్టపడ్డారని, ఒక ప్రపంచమే సృష్టించారని టెక్నిషియన్స్ అందరినీ పేరుపేరునా ప్రశంసించారు. నిర్మాత ఖర్చు గురించి వెనకాడకుండా అందరినీ ప్రోత్సహించారని అన్నాడు. ‘‘డిసెంబర్ 29న డెవిల్ మీ అందరి ముందుకు వస్తుంది. నా మాట రాసిపెట్టుకోండి చాలా బాగుంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కొత్త కథగా కూడా ఉంటుంది’’ అని తన సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు కళ్యాణ్ రామ్. అభిమానులు డైలాగ్ చెప్పాలని కోరగా.. తాను నిజజీవితంలో కూడా ఇలాగే ఉంటానంటూ సినిమాలోని డైలాగ్ చెప్పారు కళ్యాణ్ రామ్. ‘‘విశ్వాసంగా బతకడానికి, విధేయతతో బతకడానికి కుక్కను అనుకున్నావు రా.. లయన్’’ అనే డైలాగ్‌ చెప్పగానే అభిమానులు కేరింతలు కొట్టారు. 

అందరిపై చాలా బాధ్యత ఉంటుంది..
ఎన్‌టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ గురించి ప్రేక్షకులంతా అప్డేట్స్ అడగడం మొదలుపెట్టారు. ‘‘లాస్ట్ టైమ్ తమ్ముడు కూడా చెప్పాడు అప్డేట్స్ గురించి మాట్లాడొద్దు అని. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా చేసిన తర్వాత ఒక నటుడికి గానీ, ఒక దర్శకుడికి గానీ, ఒక ప్రొడక్షన్ హౌజ్‌కు గానీ చాలా బాధ్యత ఉంటుంది. విజువల్‌లో గానీ, కథలో గానీ చిన్నపాటి తప్పు జరిగితే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మేము తెలిసి తప్పు చేయము కానీ దాన్ని బాధ్యతగా తీసుకొని మేము ఎంత కష్టపడతామో మాకు తెలుసు. మీరు చూసేటప్పుడు ఇంతకంటే గోల చేయాలి. త్వరలో గ్లింప్స్ రాబోతోంది. దానికి కావాల్సిన పనులు జరుగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్‌కు చాలా సమయం పడుతుంది. దేవరతో కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం. దయజేసి ఓపిక పట్టండి. టీమ్ అంతా కలిసి డేట్ అనౌన్స్ చేస్తాం’’ అంటూ ‘దేవర’ గురించి అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు కళ్యాణ్ రామ్.

Also Read: రజనీకాంత్‌కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, ‘Thalaivar 170‘ టైటిల్ వచ్చేసింది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
BSNL Broadband Plan: బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Embed widget