అన్వేషించండి

Vettaiyan Movie: రజనీకాంత్‌కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, ‘Thalaivar 170‘ టైటిల్ వచ్చేసింది!

Vettaiyane: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా మూవీ ‘Thalaivar 170‘ టైటిల్ ఫిక్స్ అయ్యింది. ఆయన బర్త్ డే సందర్భంగా చిత్రం బృందం టైటిల్ టీజర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాకు ‘వెట్టయన్’ అనే పేరు పెట్టింది.

Title of Thalaivar 170  Vettaiyan: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్‘ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్నారు. అదే ఊపులో తన కెరీర్ లో 170వ సినిమా చేస్తున్నారు. 'జైభీమ్' ద‌ర్శ‌కుడు టీజే జ్ఞాన్ వేల్ ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు.  ఈ సినిమాకు ‘Thalaivar 170‘ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో సౌత్ నుంచి నార్త్ వరకు పలువురు స్టార్ హీరోలు కీలక పాత్రలు పోషించబోతున్నారు. తెలుగు నుంచి రానా ద‌గ్గుబాటి ఈ మూవీలో నటిస్తుండగా, మ‌లయాళం నుంచి ఫ‌హాద్ ఫాజిల్‌ కనిపించనున్నారు. ఈ చిత్రంలో మంజూ వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నుంచి లెజెండ‌రీ న‌టుడు అమితాబ‌చ్చ‌న్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. పలువురు అగ్ర తారలు ఈ సినిమాలో భాగస్వామ్యం కావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

రజనీ బర్త్ డే సందర్భంగా టైటిల్ టీజర్ విడుదల

ఇవాళ రజనీకాంత్ బర్త్ డే కావడంతో చిత్రబృందం ఆయనకు అదిరిపోయే గిఫ్ట్ అందించింది. ‘Thalaivar 170‘ టైటిల్ టీజర్ ను విడుదల చేసింది. ఈ సినిమాకు ‘వెట్టయన్’ అనే పేరు పెట్టింది. వెట్టయన్ అంటే తెలుగులో వేటగాడు అని అర్థం. నిమిషం పాటు ఉన్న ఈ టైటిల్ టీజర్ లో రజనీ తన మార్క్ నటనతో మెస్మరైజ్ చేశారు. టీజర్ ప్రారంభంలో రజనీకాంత్ కుర్చీలో కూర్చుని టేబుల్ మీద కాళ్లు పెట్టి సుభాష్ చంద్రబోస్ బుక్ చదువుతూ కనిపిస్తారు. ఆ తర్వాత ఖాకీ షూతో ఆఫీస్ నుంచి బయటకు నడిచి వస్తారు. ఈ లుక్ అచ్చం ‘జైలర్’ సినిమాలో మాదిరిగానే కనిపించడం విశేషం. ‘జైలర్’ సినిమాలో రజనీ జైలర్ పాత్రలో కనిపించగా, ఈ సినిమాలో పోలీసు అధికారిగా కనిపించబోతున్నారు. “వేట మొదలైనప్పుడు వేటాడ్డం తప్పదు” అంటూ రజనీ చెప్పే డైలాగ్ మాసీగా ఆకట్టుకుంటుంది. రివాల్వర్ తో బుల్లెట్ కురిపించడంతో టైటిల్ పడుతుంది. ఇక ఈ టీజర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరింతగా ఆకట్టుకుంటుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ మరోసారి మ్యూజిక్ తో మాయ చేయబోతున్నారు. టీజే జ్ఞానవేల్ టేకింగ్ కూడా నెక్ట్స్ లెవల్ అని చెప్పుకోవచ్చు.      

ఈ సినిమా కథ ఏంటంటే? 

ఇక ఈ సినిమా ఓ బూటకపు ఎన్ కౌంటర్ కథాంశంతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు జ్ఞానవేల్ గతంలో జర్నలిస్టుగా పని చేశారు. చెన్నైలో ఆయన రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో పోలీసులు ఓ బూటకపు ఎన్ కౌంటర్ చేశారట. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనను జ్ఞానవేల్ రిపోర్ట్ గా దగ్గరి నుంచి గమనించారు. అదే విషయాన్ని కథగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం!

రజనీకాంత్, జ్ఞానవేల్ కాంబోలో వస్తున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జైలర్’ మూవీతో రజనీకాంత్, ‘జైభీమ్’ సినిమాతో జ్ఞానవేల్ మంచి విజయాలను అందుకున్నారు. వీరిద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులలలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్‌ను సంగీతం అందిస్తున్నారు.  

Read Also: 73వ వసంతంతోకి రజనీకాంత్, తలైవా గురించి 9 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP government employees: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?

వీడియోలు

Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam
Auqib Nabi IPL 2026 Auction | ఐపీఎల్ 2026 వేలంలో భారీ ధర పలికిన అనామక ప్లేయర్ | ABP Desam
Matheesha Pathirana IPL 2026 Auction | భారీ ధరకు వేలంలో అమ్ముడుపోయిన పతిరానా | ABP Desam
Quinton de Kock IPL 2026 Auction Surprise | సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ కు అంత తక్కువ రేటా.? | ABP Desam
Cameron Green IPL Auction 2026 | ఆసీస్ ఆల్ రౌండర్ కు ఐపీఎల్ వేలంలో ఊహించని జాక్ పాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP government employees: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
Jai Akhanda: 'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!
'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!
Bride Viral video: రెండు గంటల్లో పెళ్లీ -ఎక్స్‌తో పెళ్లికూతురు కిస్సింగ్ - జెన్‌జీ ఇంతేనా? వైరల్ వీడియో
రెండు గంటల్లో పెళ్లీ -ఎక్స్‌తో పెళ్లికూతురు కిస్సింగ్ - జెన్‌జీ ఇంతేనా? వైరల్ వీడియో
Pawan Kalyan Gift To Sujeeth: 'ఓజీ' దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఖరీదైన గిఫ్ట్... ఆ కారు రేటు ఎంతో తెలుసా?
'ఓజీ' దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఖరీదైన గిఫ్ట్... ఆ కారు రేటు ఎంతో తెలుసా?
Lionel Messi: మరోసారి భారత్‌కు లియోనెల్ మెస్సీ! టీ20 ప్రపంచ కప్‌లో భారత్-అమెరికా మ్యాచ్‌కు వచ్చే అవకాశం!
మరోసారి భారత్‌కు లియోనెల్ మెస్సీ! టీ20 ప్రపంచ కప్‌లో భారత్-అమెరికా మ్యాచ్‌కు వచ్చే అవకాశం!
Embed widget