అన్వేషించండి

Kalki 2898 AD: నార్త్, సౌత్ ఒకవైపు, అమితాబ్ మరోవైపు - ‘సాహో’ బ్యూటీ కామెంట్స్ వైరల్ - ‘కల్కీ 2898 ఏడీ’ మూవీస్‌పై సెలబ్రిటీస్ స్పందన

Kalki 2898 AD: 'క‌ల్కీ’ ప్ర‌పంచవ్యాప్తంగా రిలీజై సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్ర‌భాస్ తో పాటు ఇంకా ఎంతోమంది న‌టీన‌టులు ఉన్నారు. ద‌ర్శ‌కులు కూడా క‌నిపించారు. వాళ్లంతా ఏమ‌న్నారంటే?

Kalki 2898 AD cameos Reaction About Movie: 'క‌ల్కీ 2898ఏడీ' సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా  రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియాగా తెర‌కెక్కిన ఈ సినిమాలో ప్ర‌భాస్, క‌మ‌ల్ హాస‌న్, అమితాబ్ బ‌చ్చ‌న్, దీపికా ప‌దుకునే ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సైన్స్ ఫిక్ష‌న్ కి పుర‌ణాలు జోడిస్తూ ఈ సినిమా తీశాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. అయితే, ఈ సినిమాలో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఆర్జీవి, దుల్క‌ర్ స‌ల్మాన్  హీరోయిన్ మృణాల్ ఠాకూర్, ఫ‌రియా అబ్దుల్లా, విజ‌య దేవ‌ర‌కొండ త‌దిత‌రులు కూడా ఉన్నారు. ఈ న‌టీన‌టులంతా నాగ్ అశ్విన్ సినిమాల్లో న‌టించిన వాళ్లు, వైజ‌యంతి మూవీ బ్యాన‌ర్ లో న‌టించిన‌వాళ్లే. కాగా.. ఈ ప్రాజెక్ట్ లో న‌టించ‌డంపై వాళ్లంతా ఆనందం వ్య‌క్తం చేశారు. ఈవిధంగా త‌మ మ‌న‌సులో బ‌య‌ట‌పెట్టారు. 

మృణాల్ ఏమ‌న్నారంటే? 

మృణాల్ ఠాకూర్.. 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యింది ఈ మ‌రాఠి భామ‌. వైజ‌యంతి మూవీస్ ప్రొడ‌క్ష‌న్స్ ద్వారా తెలుగు డెబ్యూ సినిమా చేసింది. ఆమె 'క‌ల్కీ'లో సినిమాలో ఒక పాత్ర పోషించారు. దానిపై మృణాల్ ఇలా అన్నారు. “ క‌ల్కీ కోసం న‌న్ను అప్రోచ్ అయిన వెంట‌నే ఒక్క నిమిషం కూడా ఆలోచించ‌కుండా ఓకే చెప్పేశాను. ప్రొడ్యూస్ ఆశ్విన్ ద‌త్, స్వ‌ప్న ద‌త్, ప్రియాంక మీద నాకు అంత న‌మ్మ‌కం ఉంది. ‘సీతారామం’ లాంటి స‌క్సెస్ ఫుల్ ప్రాజెక్ట్ చేయ‌డం వ‌ల్లే అలా ఓకే చెప్ప‌గ‌లిగాను. ఇంత అద్భుత‌మైన సినిమాలో భాగం కావ‌డం నా అదృష్టం అనుకున్నాను అందుకే ఓకే చెప్పేశాను” అని అన్నారు మృణాల్ ఠాకూర్. క‌ల్కీ సినిమాలో మృణాలో ఒక పాత్ర చేశారు. చాలా త‌క్కువ టైం ఆమె సినిమాలో క‌నిపిస్తారు. 

'జాతి ర‌త్నాలు' సినిమా ద్వారా తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది ఫ‌రియా అబ్దుల్లా. ఆమె కూడా ‘క‌ల్కీ 2898 ఏడీ’ సినిమాలో క‌నిపించారు. ఒక పాట‌లో చాలా కొద్దిసేపు ఫ‌రియా క‌నిపిస్తారు. ఆమె ఈ సినిమాపై ఏమ‌న్నారంటే? నాగ్ అశ్విన్ ఈ సినిమా అద్భుతంగా తీశార‌ని అన్నారు. సినిమా చూశాన‌ని, మ‌ళ్లీ వెళ్లి చూడాల‌నిపిస్తుంది అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ లో చిన్న‌ప్రాత వేసినందుకు చాలా ఆనందంగా ఉంది. వైజ‌యంతి మూవీస్ తో ప‌నిచేయడం నిజంగా నా అదృష్టం అంటూ ప్ర‌భాస్ తో దిగిన ఫొటోను పోస్ట్ చేసింది ఫ‌రియా. 

రామ్ గోపాల్ వ‌ర్మ ఈ సంద‌ర్భంగా నాగ్ అశ్విన్ కి థ్యాంక్స్ చెప్పాడు. నాగ్ అశ్విన్.. నీ ఆశ‌యాలు, ఆలోచ‌న‌లకి కుడోస్. అమితాబ్ బ‌చ్చ‌న్ సార్ ఈ సినిమాలో మీరు గ‌తంలో కంటే 100 రెట్లు డైన‌మిక్ గా క‌నిపించారు. ప్ర‌భాస్ అయితే నెవ‌ర్ బిఫోర్ లా క‌నిపించారు. నాకు ఈ సినిమా ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఇక ఈ సినిమాపై విజయ్ దేవ‌ర‌కొండ‌, రాజ‌మౌళి కూడా స్పందించారు. సినిమా స‌క్సెస్ అయినందుకు డైరెక్ట‌ర్, సినిమా టీమ్ కి వాళ్లు విషెస్ చెప్పారు. ఇక ఈ సినిమాలో రాజ‌మౌళి, ప్ర‌భాస్ మ‌ధ్య ఫ‌న్నీ డైలాగులు న‌వ్వుతెప్పించాయి. ఇక విజ‌య దేవ‌ర‌కొండ అర్జునుడి పాత్ర‌లో క‌నిపించి అంద‌రినీ మెప్పించ‌చాడు.

శ్రద్ధాకపూర్ కామెంట్స్ వైరల్

‘కల్కి 2898 ఏడీ’ మూవీ చూసిన ‘సాహో’ బ్యూటీ శ్రద్ధాకపూర్ కూడా ప్రశంసల వర్షం కురిపించింది. అమితాబ్ నటనకు తాను ఫిదా అయినట్లు తెలిపింది. ‘సౌత్ ఏమిటీ, నార్త్ ఏమిటీ.. సినిమా అంతా ఒక వైపు, అమితాబ్ బచ్చన్ ఒక వైపు’’ అని కామెంట్ చేసింది. అలాగే.. అమితాబే ఒక యూనివర్శ్ అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

Also Read: ఒకే రాత్రి ఇద్దరితో, ఆ బిడ్డకు ఇద్దరు తండ్రులా? త్రిప్తి దిమ్రి ‘బ్యాడ్ న్యూస్’ ట్రైలర్ చూస్తే ఫ్యూజ్ లు ఎగిరిపోవాల్సిందే!

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
DC Movie OTT : ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
Irumudi Trailer : ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
Embed widget