Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్... ఇంకా టైమ్ ఉందమ్మా - కల్కి సీక్వెల్ అప్డేట్ ఇచ్చిన నిర్మాతలు
Prabhas Upcoming Movies: ప్రభాస్ అప్‌కమింగ్ మూవీస్ లిస్టులో 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ ఒకటి. ఆ మూవీ అప్డేట్ ఇచ్చారు నిర్మాతలు. అది ఎప్పుడు మొదలు అవుతుంది? ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే...
ప్రపంచ బాక్సాఫీస్ బరిలో అక్షరాలా వెయ్యి కోట్ల రూపాయలు వసూలు చేసిన మైథాలజికల్ సోషియో ఫాంటసీ సినిమా 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఫిల్మోగ్రఫీలో మరో భారీ బాక్సాఫీస్ విజయంగా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంది. మరి, 'కల్కి పార్ట్ 2' సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుందో తెలుసా? ఈ సినిమా గురించి నిర్మాతలు ఏం చెప్పారో తెలుసా?
ఆల్రెడీ 35 శాతం చిత్రీకరణ పూర్తి...
త్వరలో ఆ కబురు చెబుతాం! - ఇఫీలో నిర్మాతలు
'కల్కి 2898 ఏడీ' విడుదలకు ముందే సీక్వెల్ షూటింగ్ కూడా కొంత పూర్తి చేశామని చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ తెలిపారు. ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంకా దత్ కూడా ఆ మాట చెప్పారు.
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ 2024)కు స్వప్నా దత్, ప్రియాంకా దత్ వెళ్లారు. అక్కడ కల్కి సాధించిన విజయం గురించి, అదే విధంగా సీక్వెల్ గురించి మాట్లాడారు. కల్కి పార్ట్ 2 కోసం ఆల్రెడీ 35% చిత్రీకరణ పూర్తి చేసామని తెలిపారు. అయితే మిగతా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే విషయంలో ఇంకా ఒక నిర్ణయం ఏది తీసుకోలేదని వివరించారు.
''ప్రస్తుతం కల్కి పార్ట్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు అన్నీ ఓ కొలిక్కి వచ్చాక... రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాం. మొదటి భాగంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ గర్భవతిగా కనిపించారు. రెండో భాగంలో ఆవిడ అమ్మగా కనిపించే సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన కొత్త కబురు అందరికీ చెబుతాం'' అని స్వప్నా దత్, ప్రియాంకా దత్ తెలిపారు.
'కల్కి' విడుదల సమయంలో జరిగిన ప్రచార కార్యక్రమాలు చూస్తే దీపిక పదుకోన్ నిండు గర్భవతిగా కనిపించారు. సినిమాలో కూడా ఆమెది అదే పాత్ర. సినిమా విడుదలైన తర్వాత పండంటి బిడ్డకు దీపిక జన్మ ఇచ్చారు. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆవిడ చిత్రీకరణలకు హాజరు కావడం ఇప్పట్లో వీలు పడే అవకాశాలు లేవు. ఆవిడ మళ్లీ షూటింగ్స్ స్టార్ట్ చేసేటప్పుడు కల్కి పార్క్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.
Also Read: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... మారుతి దర్శకత్వంలో నటిస్తున్న హారర్ కామెడీ 'ది రాజా సాబ్' చిత్రీకరణ పూర్తి చేసే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దానితో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న ఒక ప్రేమ కథ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఆ రెండు పూర్తయిన తర్వాత ప్రభాస్ ఫ్రీ అయితే 'స్పిరిట్' సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రెడీ అవుతున్నారు. ఎలా చూసినా మరో రెండు సంవత్సరాల వరకు కల్కి సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు చాలా తక్కువ కనపడుతున్నాయి.