Ravi Teja: రవితేజ సినిమాలో హీరోయిన్స్ గోల... క్లారిటీ ఇచ్చిన మాస్ మహారాజా టీమ్
Ravi Teja New Movie: సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' విడుదల చేసేందుకు రెడీ అయ్యారు రవితేజ. ఆ తర్వాత మరో సినిమా చేస్తున్నారు. అందులో హీరోయిన్స్ గురించి వచ్చిన ప్రచారాన్ని చిత్ర బృందం ఖండించింది.

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ట్రాక్ రికార్డ్ ఈ మధ్య కాలంలో అంత గొప్పగా లేదు. ఆయన 75వ సినిమా 'మాస్ జాతర' అంచనాలు అందుకోవడంలో బోల్తా కొట్టింది. అంతకు ముందు సినిమాలు సైతం అంతంత మాత్రంగా ఆడాయి. ఈ నేపథ్యంలో ఆయన కొత్త సినిమాలపై ఆసక్తి నెలకొంది. మాస్ పక్కన పెట్టి, మూస ధోరణి కథలను కాదని సున్నితమైన భావోద్వేగాలు - కుటుంబ అనుబంధాలు ఆవిష్కరించిన దర్శకులతో సినిమాలు చేయడం మొదలు పెట్టారు. ఈ తరుణంలో ఆయన కొత్త సినిమా మీద హీరోయిన్స్ విషయంలో ఓ పుకారు మొదలైంది. దాన్ని చిత్ర బృందం ఖండించింది.
రవితేజ కొత్త సినిమాలో ఆరుగురు హీరోయిన్లు!?
స్టార్ హీరోల సినిమాల్లో ఒకరిద్దరు హీరోయిన్లు ఉండటం కామన్. అయితే న్యాచురల్ స్టార్ నాని 'నిన్ను కోరి', యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య 'మజిలీ', ది విజయ్ దేవరకొండ 'ఖుషి' సినిమాల దర్శకుడు శివ నిర్వాణతో ఓ సినిమాకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో ఆరుగురు హీరోయిన్లు నటిస్తారని ప్రచారం మొదలైంది.
రవితేజతో ఆరుగురు హీరోయిన్లు నటించడం అంటే మామూలు విషయం కాదు. ఈ హీరో ఇంతకు ముందు 'రావణాసుర' అని ఓ సినిమా చేశారు. అందులో ఐదుగురు హీరోయిన్లు నటించారు. ఆరుగురు హీరోయిన్లు అంటే ఎవరికి ఎటువంటి క్యారెక్టర్ ఇస్తారో అని కొందరు జోకులు వేశారు. ఈ ప్రచారాన్ని చిత్ర బృందం ఖండించింది. అది కేవలం పుకారు మాత్రమే అని, అందులో ఎటువంటి నిజం లేదని తెలిపింది. అదీ సంగతి!
Fake alert ‼️
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 2, 2025
The news circulating about 6 heroines in Mass Maharaja #Raviteja’s next movie is completely fake.
Requesting everyone not to believe and spread such baseless rumours .
సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' విడుదల!
ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' చేస్తున్నారు రవితేజ. అందులో ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లు. ఆ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఇటీవల సినిమాలో మొదటి పాట విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభిస్తోంది.
Also Read: Linga Bhairavi Temple Photos: లింగ భైరవి దేవి టెంపుల్ ఫోటోలు... ఈ గుడిలోనే సమంత పెళ్లి జరిగింది





















