అన్వేషించండి

దసరా బరిలో అక్కినేని హీరో - 'దేవర' కి పోటీగా 'తండేల్'?

Thandel : నాగచైతన్య 'తండేల్' సినిమా దసరా టైంలోనే అంటే ఎన్టీఆర్ 'దేవర'కి పోటీగా రిలీజ్ కానున్నట్లు సమాచారం.

 Devara Vs Thandel : టాలీవుడ్ లో ఈ ఏడాది తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజీయస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో ఎన్టీఆర్ 'దేవర' కూడా ఒకటి. 'RRR' లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న 'దేవర' పార్ట్-1 ని వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదల చేస్తున్నట్లు మూవీ టీం ముందే అనౌన్స్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల దేవర రిలీజ్ ని పోస్ట్ పోన్ చేశారు.

అదే రిలీజ్ డేట్ కి విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' రాబోతుండడంతో 'దేవర' రిలీజ్ పోస్ట్ పోన్ అయిందని కన్ఫర్మ్ అయింది. ఈ క్రమంలోనే 'దేవర' లేటెస్ట్ రిలీజ్ డేట్ ని తాజాగా మూవీ టీం ప్రకటించింది. 'దేవర' పార్ట్-1 ని దసరా కానుకగా అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. సరిగ్గా అదే సమయంలో 'దేవర' తో పోటీపడేందుకు నాగచైతన్య సిద్ధమైనట్లు తాజా సమాచారం.

'దేవర' తో 'తండేల్' పోటీ

అక్కినేని నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న 'తండేల్' కూడా దసరా సమయంలోనే రిలీజ్ కాబోతున్నట్లు తెలిసింది. చైతు కెరియర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా 'తండెల్' రూపొందుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని కూడా దసరా టైంలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ 'దేవర' మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది. ఇక నాగచైతన్య 'తండెల్' కూడా సరిగ్గా అదే సమయంలో అంటే ఎన్టీఆర్ 'దేవర'కి పోటీగా థియేటర్స్ లో సందడి చేయనున్నట్లు వార్తలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ దసరాకి బాక్స్ ఆఫీస్ దగ్గర 'దేవర', 'తండేల్' సినిమాల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మరో విశేషమేంటంటే ఈ రెండు సినిమాలు సముద్రం బ్యాక్ డ్రాప్ తోనే వస్తున్నాయి. 

'దేవర' లో తండ్రీ, కొడుకులుగా ఎన్టీఆర్

'దేవర' మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మూవీ టీం తాజాగా కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ ని విడుదల చేయగా ఈ పోస్టర్లో ఎన్టీఆర్ యంగ్ లుక్ లో కనిపించాడు. అంతేకాదు ఈ పోస్టర్ మీద దేవర పేరులో 'వర' అని రెడ్ కలర్ థీమ్ ని హైలైట్ చేశారు. దీంతో ఇందులో ఎన్టీఆర్ తండ్రి, కొడుకులుగా అలరించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ప్రకాశ్ రాజ్‌, శ్రీకాంత్‌, టామ్‌ షైన్‌ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సమర్పణలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ బ్యానర్‌పై మిక్కిలినేని సుధాకర్‌, హరిక్రష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కుతున్న 'తండేల్'

డైరెక్టర్ చందు మొండేటి 'తండేల్' సినిమాని రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తెరకెక్కిస్తున్నారు.  గుజరాత్‌ రాష్ట్రం సూరత్ లోని ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా 'తండేల్' సినిమా తెరకెక్కుతోంది. ఈ కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగుతుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్థాన్ వరకూ చేరుకుంటుందట. దీని కోసం చిత్ర బృందం చాలా రీసెర్చ్ చేశారు. హీరో నాగ చైతన్య మత్స్యకారుల జీవనశైలి గురించి తెలుసుకోవడమే కాదు వారి బాడీ లాంగ్వేజ్ లోకి మారడానికి, సిక్కోలు యాసలో మాట్లాడటానికి చాలా శ్రమించినట్లు మూవీ టీమ్ చెప్పింది.

Also Read : ‘లియో 2’పై లోకేష్ కనగరాజ్ పాజిటివ్ అప్‌డేట్ - అసలు ఏమన్నాడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
Rayudu Vs Kohli: రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Haimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP DesamAjith Kumar Team Wins in 24H Dubai Race | దుబాయ్ కార్ రేసులో గెలిచిన అజిత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
Rayudu Vs Kohli: రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
Viral Video: రూ.10 కోసం ఇంత దారుణమా? - విశ్రాంత ఐఏఎస్‌పై బస్ కండక్టర్ దాడి, వైరల్ వీడియో
రూ.10 కోసం ఇంత దారుణమా? - విశ్రాంత ఐఏఎస్‌పై బస్ కండక్టర్ దాడి, వైరల్ వీడియో
Kumbh mela: గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
TTD News: 'సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దు' - సమన్వయ లోపం ప్రచారం ఖండించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
'సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దు' - సమన్వయ లోపం ప్రచారం ఖండించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
Sobhan Babu Birthday: సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
Embed widget