అన్వేషించండి

Leo 2: ‘లియో 2’పై లోకేష్ కనగరాజ్ పాజిటివ్ అప్‌డేట్ - అసలు ఏమన్నాడంటే?

Lokesh Kanagaraj Next Movie: ‘లియో 2’ సినిమా గురించి లోకేష్ కనగరాజ్ మాట్లాడారు. ఈ సినిమా కచ్చితంగా సాధ్యమే అన్నారు.

Lokesh Kanagaraj: తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘లియో’ గతేడాది మిక్స్‌డ్ టాక్‌తో కూడా భారీ విజయం అందుకుంది. ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’లో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ‘లియో’ క్లైమ్యాక్స్‌లో సీక్వెల్ ఉంటుందన్న హింట్ కూడా ఇచ్చారు. లోకేష్ కనగరాజ్ కూడా ‘లియో 2’ ఉంటుందన్న విషయాన్ని గట్టిగానే చెప్పారు.

పొలిటికల్ ఎంట్రీతో...
కానీ విజయ్ పొలిటికల్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. ప్రస్తుతం చేస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ కాకుండా అప్పటికి కమిట్ అయిన మరొక్క సినిమా చేసి పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇస్తానని విజయ్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ‘లియో 2’ ఉండదని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు.

ఇటీవల ఒక కామిక్ బుక్ ఈవెంట్లో పాల్గొన్న లోకేష్ కనగరాజ్‌కు కూడా మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. ‘లియో 2’ ఉంటుందా? ఉండదా? అని లోకేష్‌ను ప్రశ్నించారు. దీనికి లోకేష్ ‘విజయ్ లక్ష్యం వేరేగా ఉంది. లియో 2 పూర్తిగా సాధ్యమే. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి సినిమా చేస్తాను.’ అని సమాధానం ఇచ్చారు.

ఇదే కార్యక్రమంలో ఆయన రజనీకాంత్‌తో చేస్తున్న ‘తలైవర్171’ సినిమా గురించి కూడా మాట్లాడారు. ఈ సినిమాకు సంబంధించిన రైటింగ్ ప్రాసెస్ ఇంకా జరుగుతుందని, రెండు మూడు నెలల్లో షూటింగ్‌కు వెళ్తామని తెలిపారు.

గతంలోనే ‘తలైవర్171’  సినిమాకు సంబంధించి దర్శకుడు లోకేష్ కీలక విషయాలను వెల్లడించారు. అసలు ఈ కథను రజనీకాంత్ కు ఎలా చెప్పారు? చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారు? సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అనే విషయాల గురించి వివరించారు. ఈ సినిమా గురించి తెలిసిన వెంటనే కమల్ హాసన్ తనకు ఫోన్ చేసిన అభినందించినట్లు వెల్లడించారు. “ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2024 ఏప్రిల్ కల్లా ఈ పనులు కంప్లీట్ అవుతాయి. పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. చాలా సంవత్సరాల తర్వాత రజనీ ఇలాంటి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కథ విని రజనీకాంత్ చాలా సంతోషించారు. అనిరుధ్ తో కలిసి వెళ్లి ఆయనకు కథ వినిపించా. స్టోరీ విని ఆయన నన్ను కౌగిలించుకుని ఆల్ ది బెస్ట్ చెప్పారు. సూపర్ స్టార్ ఓకే చెప్పడంతో నాకు చాలా సంతోషం కలిగింది” అని లోకేష్ కనగరాజ్ వెల్లడించారు.

ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం షారుఖ్ ఖాన్ ను సంప్రదించారట. తాను ఇప్పటికే చాలా సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తున్నట్లు చెప్పిన ఆయన, ఇకపై తన సొంత సినిమాల మీద ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారట. దీంతో మరో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌ను ఈ సినిమాలో ముఖ్యపాత్ర కోసం అడిగారట. రణ్‌వీర్ సింగ్ ఈ ప్రాజెక్టు పట్ల ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో శివకార్తికేయన్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. 

టాప్ హెడ్ లైన్స్

Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Karthika Deepam 2 Serial Today August 19th: కార్తీకదీపం 2 సీరియల్: అందరి ముందు సూరజ్‌కి ప్రపోజ్ చేసిన జ్యోత్స్న! ఓకే చెప్పేసిన సూరజ్! క్లైమాక్స్ లెక్కుంది ఎపిసోడ్!
కార్తీకదీపం 2 సీరియల్: అందరి ముందు సూరజ్‌కి ప్రపోజ్ చేసిన జ్యోత్స్న! ఓకే చెప్పేసిన సూరజ్! క్లైమాక్స్ లెక్కుంది ఎపిసోడ్!
Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget