Jr NTR: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సినిమా బ్యాక్‌డ్రాప్ అదేనా?
NTR Prashanth Neel Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా కేజీఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ చేయబోతున్న సినిమా గురించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో క్రేజీ అప్డేట్ వినబడుతోంది. అది ఏమిటంటే?
NTR 31 Movie Updates: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపై సందడి చేసి రెండు సంవత్సరాలు దాటింది. మార్చి 22, 2022లో 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా విడుదల అయితే... ఆ తర్వాత ఆయన నుంచి మరొక సినిమా రాలేదు. ఈ రెండేళ్ల గ్యాప్ కవర్ చేసేలా ఎన్టీఆర్ వరుస సినిమాలు చేయనున్నారు. సెప్టెంబర్ 27న 'దేవర'తో థియేటర్లలోకి రానున్నారు. ఆ సినిమా కంటే ముందు ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
యూరోపియన్ బ్యాక్‌డ్రాప్‌లో ఎన్టీఆర్ సినిమా?
ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ (Jr NTR)కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు తగ్గట్టుగా భారీ, క్రేజీ సినిమాలు చేసే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. కెజీఎఫ్, సలార్ వంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ తీసిన ప్రశాంత్ నీల్ సైతం ఎన్టీఆర్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని పవర్ ఫుల్ యాక్షన్ స్క్రిప్ట్ రెడీ చేశారట.
ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా, వరల్డ్ లెవల్ సినిమా చేయనున్న సంగతి ప్రేక్షకులు అందరికీ తెలుసు. ఆ సినిమా యూరోపియన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని లేటెస్ట్ బజ్. ఈ సినిమాలో హీరో రోల్ ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రాని విధంగా డిజైన్ చేశారట. ఎన్టీఆర్ రోల్ మ్యానరిజమ్స్ కూడా ప్రత్యేకంగా ఉండేలా చూసుకున్నారట.
'కేజీఎఫ్'ను కోలార్ గోల్డ్ ఫీల్డ్ మైన్స్ నేపథ్యంలో తీసిన ప్రశాంత్ నీల్... ప్రభాస్ 'సలార్' కోసం ఫిక్షనల్ సిటీ క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ సినిమా కోసం తొలిసారి ఆయన కూడా విదేశాలు దాటుతున్నారు. ఆగస్టు 2024 నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది.
Also Read: వేదిక ఈజ్ బ్యాక్... అప్పుడు 'ముని', ఇప్పుడు 'యక్షిణి'... హారర్‌తో హిట్స్
ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని దాన్ని ఆన్ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయ్యేలా ప్రెజంట్ చేస్తూ.... యూనిక్ మాస్ క్రేజ్ క్రియేట్ అయ్యేలా మరో రేంజికి వెళ్లాలా ప్రశాంత్ నీల్ సినిమా ప్లాన్ చేస్తున్నారట. అటు ఎన్టీఆర్, ఇటు ప్రశాంత్ నీల్... ఇద్దరి కెరీర్లలో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ అవుతుందని టాక్. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతోంది.
ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాలో రష్మిక?
Rashmika to act in Jr NTR's Dragon movie: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. అయితే, ఫిల్మ్ ఇండస్ట్రీలో బజ్ ప్రకారం... 'డ్రాగన్' టైటిల్ ఖరారు చేశారట. ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ఎవరు? అనేది అనౌన్స్ చెప్పలేదు. ఎన్టీఆర్ జోడీగా రష్మికా మందన్నా నటించే అవకాశాలు ఉన్నాయట.