NTR Workouts For Devara : సెలవుల్లోనూ రెస్ట్ తీసుకొని 'దేవర' - విదేశాల్లో వర్కవుట్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు. అయినా సరే ఆయన వర్కవుట్స్ చేయడం మానలేదు. సెలవుల్లోనూ శరీరానికి రెస్ట్ ఇవ్వలేదు.
ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) విదేశాల్లో ఉన్నారు. భార్య ప్రణతి లక్ష్మి, అబ్బాయిలు అభయ్ రామ్ & భార్గవ్ రామ్ (Jr NTR Family)తో కలిసి ఆదివారం రాత్రి విహార యాత్రకు వెళ్ళారు. ఇది చాలా షార్ట్ ట్రిప్! ఓ వారం లోపు మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చేస్తారని తెలిసింది. అయితే, సెలవుల్లోనూ ఎన్టీఆర్ శరీరానికి రెస్ట్ ఇవ్వడం లేదు. విదేశాల్లో వర్కవుట్స్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ఎన్టీఆర్ వర్కవుట్స్ ఫోటో
ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిందీ చెప్పలేదు! కానీ, విదేశాల్లో ఆయన వర్కవుట్స్ చేస్తున్న సమయంలో దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ''హాలిడేలో ఉన్నప్పటికీ... మా 'దేవర' చెమట చిందుస్తున్నాడు'' అని 'దేవర' టీమ్ పేర్కొంది. 'ఆర్ఆర్ఆర్'తో పోలిస్తే... కొత్త సినిమాలో ఎన్టీఆర్ ఫిజిక్ వేరుగా ఉంటుందని తెలిసింది. క్యారెక్టర్ కోసం ఆయన కష్టపడుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా 'దేవర' (Devara Movie). 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది. మే 20న తన పుట్టినరోజు సందర్భంగా సినిమా చిత్రీకరణకు చిన్న విరామం ఇచ్చారు ఎన్టీఆర్! జూన్ తొలి వారం వరకు ఆ విశ్రాంతి కంటిన్యూ అవుతుందట!
Also Read : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!
జూన్ 5 నుంచి 'దేవర' కొత్త షెడ్యూల్!
అవును... జూన్ 5వ తేదీ నుంచి 'దేవర' కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ సహా ప్రధాన తారాగణం అంతా ఇందులో పాల్గొంటారని తెలిసింది. 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇటీవల హీరో పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ అభిమానులను, ప్రేక్షకులకు అమితంగా ఆకట్టుకుంటోంది.
ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై 'దేవర' సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలన అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్టీఆర్ జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్రలో సీరియల్ నటి చైత్ర రాయ్ నటిస్తున్నారు.
Also Read : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!
ఎన్టీఆర్ అంటే యాక్షన్! సాధారణ యాక్షన్ సన్నివేశాన్ని సైతం తన నటనతో నెక్స్ట్ లెవల్‌కు తీసుకు వెళతారు. ఇక, పవర్ ఫుల్ యాక్షన్ సీన్ అయితే ఆయన చెలరేగిపోతారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'లో ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సన్నివేశాన్ని అంత త్వరగా ఎవరు మర్చిపోతారు చెప్పండి! కొరటాల శివ కూడా ఎన్టీఆర్ కోసం ధీటైన యాక్షన్ ప్లాన్ చేశారట.
'దేవర'లో 'కెజిఎఫ్' నటుడు తారక్ పొన్నప్ప!
కన్నడ హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన 'కెజిఎఫ్' సినిమా గుర్తు ఉందా? అందులో మాఫియా డాన్స్ బాస్ శెట్టి ఆండ్రూ సెక్రటరీ పాత్ర చేసిన తారక్ పొన్నప్ప (Tarak Ponnappa) గుర్తు ఉన్నారా? . తెలుగులో ఆది సాయి కుమార్ హీరోగా వచ్చిన 'సిఎస్ఐ సనాతన్' సినిమాలో కూడా ఆయన నటించారు. అతను ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో నటించే అవకాశం అందుకున్నారు.