Jr NTR At Airport : నేను బోనస్‌గా దొరికేశా, అంతేగా - ఎన్టీఆర్ టైమింగ్ పీక్స్ అంతే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, హైదరాబాద్ ఎయిర్ పోర్టులో పాపరాజీ వీడియోగ్రాఫర్ మధ్య సంభాషణ నెటిజనులను ఆకట్టుకుంటోంది.
![Jr NTR At Airport : నేను బోనస్‌గా దొరికేశా, అంతేగా - ఎన్టీఆర్ టైమింగ్ పీక్స్ అంతే! Jr NTR interesting conversation with paparazzi photographer at hyderabad airport, Watch Jr NTR At Airport : నేను బోనస్‌గా దొరికేశా, అంతేగా - ఎన్టీఆర్ టైమింగ్ పీక్స్ అంతే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/24/46b3293570a8dde2ec3caf509d00bd861687592373540313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైమింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన (Jr NTR) స్పాంటేనిటీ గురించి, షూటింగులో ఎంత సరదాగా ఉంటారనేది చాలా మంది నటీనటులు చెబుతుంటారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమా ప్రచార కార్యక్రమాల్లో ప్రేక్షకులు మరింత చూశారు. లేటెస్టుగా ఈ రోజు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్, వీడియోగ్రాఫర్ మధ్య జరిగిన సంభాషణ నెటిజనులను ఆకట్టుకుంటోంది.
నేను బోనస్... అంతేగా!
NTR Off to Dubai Again : ఎన్టీఆర్ ఈ రోజు ఉదయం దుబాయ్ వెళ్ళారు. ఇది షార్ట్ ట్రిప్ అని తెలిసింది. దుబాయ్ వెళ్ళడానికి ఎయిర్ పోర్ట్ వెళ్ళినప్పుడు... అక్కడ ఓ వీడియోగ్రాఫర్ ఉన్నారు. అతడితో 'ఎందుకు వచ్చావ్?' అని ఎన్టీఆర్ అడిగారు. ప్రముఖ బాలీవుడ్ ర్యాపర్, సింగర్ బాద్షా వస్తున్నారని... ఆయన కోసం వెయిట్ చేస్తున్నాని ఆ వీడియోగ్రాఫర్ బదులు ఇచ్చారు. అప్పుడు ''అంటే నేను బోనస్ గా దొరికేశాను కదా! అంతే కదా'' అన్నారు ఎన్టీఆర్.
Also Read : నాలుగు వందల కోట్లతో పవన్ కళ్యాణ్ సినిమా - ఒక్కొక్కరూ చెప్పేది వింటుంటే?
View this post on Instagram
ఫ్యామిలీతో కలిసి కొన్ని రోజుల ముందు కూడా ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లి వచ్చారు. ఒక వైపు 'దేవర' షెడ్యూల్స్ చేస్తూ... మరో వైపు చిన్న చిన్న ట్రిప్స్ వస్తున్నారు.
Also Read : డ్రగ్స్ కేసుతో సంబంధం లేదంటున్న అషు రెడ్డి - ఫోన్ నంబర్ బయట పెట్టొద్దని వార్నింగ్!
నవంబర్ నెలాఖరుకు టాకీ పూర్తి!
నవంబర్ నెలాఖరుకు 'దేవర' టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని చిత్ర బృందం యొక్క సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఆ తర్వాత పాటల కోసం రెండు మూడు వారాలు కేటాయిస్తే చాలు అంటున్నారు! ఈ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి 'దేవర' వర్క్ మొత్తం ఫినిష్ అవుతుంది. ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ ఫ్రీ అవుతారని తెలుస్తోంది. 'దేవర' టాకీ కంప్లీట్ అవ్వగానే కొత్త సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారు.
'దేవర'కు కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహిస్తున్నారు. 'జనతా గ్యారేజ్' తర్వాత వీళ్ళిద్దరి కలయికలో వస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలన అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్టీఆర్ జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్రలో సీరియల్ నటి చైత్ర రాయ్ నటిస్తున్నారు.
NTR @tarak9999 Anna at shamshabad airport 🔥🤩. Off to dubai ✈️. #Devara #ManOfMassesNTR pic.twitter.com/m9ti88QTGY
— JrNtr_Abhimani9999 (@abhimani9999) June 24, 2023
ప్రశాంత్ నీల్... వార్ 2!
'దేవర' తర్వాత రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఎన్టీఆర్ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యశ్ 'కెజియఫ్', ప్రభాస్ 'సలార్' సినిమాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అది ఈ ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. అందులో కథానాయికగా ప్రియాంకా చోప్రా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు 'వార్ 2' కూడా స్టార్ట్ చేయనున్నారు. దానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)