అన్వేషించండి

Journey To Ayodhya: జర్నీ టు అయోధ్య - రామాయణం నేపథ్యంలో వేణు దోనేపూడి సినిమా

Latest Telugu Movie Based On Ramayanam: శ్రీరామ‌న‌వమి సంద‌ర్భంగా చిత్రాల‌యం స్టూడియోస్ అధినేత నిర్మాత వేణు దోనేపూడి 'జర్నీ టు అయోధ్య' (వ‌ర్కింగ్ టైటిల్‌) చిత్రాన్ని ప్రకటించారు.

రామాయ‌ణం తెలియని ప్రజలు, మర్యాదా పురుషోత్తముడు శ్రీ రామ చంద్రుని గురించి తెలియని భక్తులు ఉండరు. తరతరాలకు తరగని తేజస్సు శ్రీరాముని సొంతం. ఆయన గొప్పదనాన్ని ప్రజలకు చెబుతూ రామాయ‌ణం ఆధారంగా మన భారతదేశంలో పలు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఆ బాట‌లో నడుస్తూ మరో ఆ శ్రీరామ చంద్రుని రామాయ‌ణంను తెర‌కెక్కించ‌టానికి నిర్మాత వేణు దోనేపూడి (Venu Donepudi) సిద్ధం అయ్యారు.

అయోధ్యకు ప్రయాణం... రామచరితం!
చిత్రాల‌యం స్టూడియోస్ (Chitralayam Studios) నిర్మాణ సంస్థను స్థాపించిన వేణు దోనేపూడి... ఆ సంస్థలో ప్రొడక్షన్ నంబర్ 1గా 'విశ్వం' (Gopichand's Viswam Movie) ప్రొడ్యూస్ చేస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ రోజు ప్రొడక్షన్ నంబర్ 2 'జర్నీ టు అయోధ్య' అనౌన్స్ చేశారు. 

వీఎన్‌ ఆదిత్య‌ అందించిన కథతో...
తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారథ్యంలో!
Journey To Ayodhya Movie Crew List: చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్ 2కు 'జర్నీ టు అయోధ్య' వర్కింగ్ టైటిల్ అని వేణు దోనేపూడి చెప్పారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన దర్శకుడు వీఎన్‌ ఆదిత్య‌ (VN Aditya) అందించిన కథతో... ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని వివరించారు. వచ్చే ఏడాది చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు.

Also Readఎన్టీఆర్ 'టెంపర్', వరుణ్ 'తొలిప్రేమ' నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి - తాళి కట్టిన వెంటనే భర్తకు ముద్దు!

'జర్నీ టు అయోధ్య' సినిమా గురించి వేణు దోనేపూడి మాట్లాడుతూ... ''శ్రీరామ చంద్రుడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆయన గుణగణాలు ఈతరం యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జగదభిరాముడు, సకల గుణధాముడు, ధర్మ రక్షకుడు, ఏకపత్నివ్రతుడైన అయోధ్య రామయ్య గురించి సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే  శ్రీరామ నవమి నాడు సినిమా ప్రకటించడం సంతోషంగా ఉంది. వీఎన్ ఆదిత్య గారి నేతృత్వంలోని ఓ బృందం అయోధ్య స‌హా ప‌లు ప్రదేశాల్లో ఈ చిత్రానికి సంబంధించిన లోకేషన్స్ రెక్కీ నిర్వహిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఓ యువ దర్శకుడు తెరకెక్కించనున్నారు. ఆయనతో పాటు ఈ సినిమాలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్లడిస్తాం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారీగా ఎత్తున అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తాం. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేస్తాం'' అని చెప్పారు.

Also Readఅల్లు అర్జున్ వీరాభిమానిగా సన్నాఫ్ సుబ్రమణ్యం... ఒక్క పాటలో బన్నీ సినిమాల్లో బెస్ట్ సీన్స్!


గోపీచంద్ 'విశ్వం' ఫస్ట్ స్ట్రైక్‌కు సూపర్ రెస్పాన్స్!
ప్ర‌స్తుతం గోపీచంద్ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి చిత్రాల‌యం స్టూడియోస్ పతాకంపై వేణు దోనేపూడి 'విశ్వం' చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫస్ట్ స్ట్రైక్ పేరుతో ఆ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభించింది.

Also Readవందే భారత్ ట్రైనులో సిగరెట్ కాలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ... తస్మాత్ జాగ్రత్త, ఇది మీ కోసమే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Embed widget