అన్వేషించండి

Allu Arjun: అల్లు అర్జున్ వీరాభిమానిగా సన్నాఫ్ సుబ్రమణ్యం... ఒక్క పాటలో బన్నీ సినిమాల్లో బెస్ట్ సీన్స్!

Maruthi Nagar Subramanyam Movie Songs: రావు రమేష్ హీరోగా రూపొందుతున్న 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో 'మేడమ్ సార్ మేడమ్ అంతే' సాంగ్ నేడు విడుదలైంది. దీని స్పెషాలిటీ ఏమిటంటే... బన్నీ సినిమాలు గుర్తు చేయడం!

మేడమ్ సార్ మేడమ్ అంతే... 'అల వైకుంఠపురములో' ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పే మాట. ఇప్పుడు ఆ మాటలతో ఓ పాట వచ్చింది. విలక్షణ నటుడు రావు రమేష్ హీరోగా నటించిన సినిమా 'మారుతి నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో రెండో పాట 'మేడమ్ సార్ మేడమ్ అంతే' (Madam Sir Lyrical Video)ను ఈ రోజు విడుదల చేశారు. 

అల్లు అర్జున్ వీరాభిమానిగా అంకిత్ కొయ్య...
రొమాంటిక్ పాటలో బన్నీ సినిమాల్లో సీన్లు!
'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాలో రావు రమేష్ తనయుడిగా అంకిత్ కొయ్య నటించారు. ఆయన జోడీగా రమ్య పసుపులేటి కనిపించనున్నారు. వాళ్లిద్దరి మీద 'మేడమ్ సార్ మేడమ్ అంతే' పాటను తెరకెక్కించారు. అల్లు అర్జున్ వీరాభిమాని ఈ సన్నాఫ్ సుబ్రమణ్యం. ప్రేమించిన అమ్మాయి తన ముందుకు వచ్చిన ప్రతిసారీ... తన అభిమాన హీరో సినిమాల్లోని హీరోయిన్ ఇంట్రడక్షన్ సన్నివేశాల్లో ఆమెను ఊహించుకుంటాడు.

'సన్నాఫ్ సత్యమూర్తి'లో పూజా హెగ్డేను అల్లు అర్జున్ తొలిసారి చూసేది ఎప్పుడో తెలుసా? స్విమ్మింగ్ ఫూల్ నుంచి పూజ బయటకు వస్తున్నప్పుడు. 'దేశముదురు' సినిమాలో హన్సికను సన్యాసినిగా ఉన్నప్పుడు చూస్తారు బన్నీ. 'జులాయి'లో బస్ స్టాప్ దగ్గర ఇలియానాను! ఈ సీన్లతో పాటు 'ఆర్య'లో హీరో హీరోయిన్ల ఫస్ట్ మీటింగ్ కూడా 'మేడమ్ సార్ మేడమ్ సార్' పాటలో రీ క్రియేట్ చేశారు.

Also Readకల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?

కళ్యాణ్ నాయక్ సంగీతంలో సిద్ శ్రీరామ్ పాట!
'మారుతి నగర్ సుబ్రమణ్యం' చిత్రానికి కళ్యాణ్ నాయక్ సంగీత దర్శకుడు. ఆయన అందించిన బాణీకి భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించగా... 'మేడమ్ సార్ మేడమ్ సార్' పాటను ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించారు.

Also Readఎన్టీఆర్ 'టెంపర్', వరుణ్ 'తొలిప్రేమ' నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి - తాళి కట్టిన వెంటనే భర్తకు ముద్దు!


'మేడమ్ సార్ మేడమ్ అంతే' సాంగ్ విడుదలైన సందర్భంగా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''రావు రమేష్ గారి ఫస్ట్ లుక్, టైటిల్ సాంగ్ ఆల్రెడీ విడుదల చేశాం. వాటికి మంచి స్పందన లభించింది. భాస్కరభట్ల గారు తొలి పాటతో పాటు ఈ 'మేడమ్ సార్ మేడమ్ అంతే'కూ అద్భుతమైన లిరిక్స్ అందించారు. సినిమాలో అంకిత్ కొయ్య పాత్రకు, అల్లు అర్జున్ గారికి చిన్న కనెక్షన్ ఉంటుంది. ప్రస్తుతానికి అదేమిటో సస్పెన్స్. రమ్య పసుపులేటి ఈతరానికి చెందిన అమాయకపు అమ్మాయి పాత్రలో నటించారు. వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు నవ్విస్తాయి, కవ్విస్తాయి. లిధా మ్యూజిక్‌ ద్వారా పాటల్ని విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని చెప్పారు.

Also Readవందే భారత్ ట్రైనులో సిగరెట్ కాలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ... తస్మాత్ జాగ్రత్త, ఇది మీ కోసమే


రావు రమేష్, ఇంద్రజ ఓ జంటగా... అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా నటిస్తున్న ఈ సినిమాలో హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సాహిత్యం: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ - భాస్కరభట్ల రవికుమార్ - కళ్యాణ్ చక్రవర్తి, కళా దర్శకత్వం: సురేష్ భీమంగని, కూర్పు: బొంతల నాగేశ్వర్ రెడ్డి, ఛాయాగ్రహణం: ఎంఎన్ బాల్ రెడ్డి, క్రియేటివ్‌ హెడ్‌: గోపాల్‌ అడుసుమల్లి, సహ నిర్మాతలు: రుషి మర్ల - శివప్రసాద్ మర్ల, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల - మోహన్ కార్య, కథ - కథనం - సంభాషణలు - దర్శకత్వం: లక్ష్మణ్ కార్య.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Kidney Health : కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Embed widget