Johnny Depp: ఇండియన్ రెస్టారెంట్‌లో హాలీవుడ్ నటుడు జానీ డెప్, ఒక్క నైట్ డిన్నర్‌కు 48 లక్షలు
మాజీ భార్య అంబర్ హార్డ్ మీద జానీ డెప్ కేసు గెలిచిన సంగతి తెలిసిందే. ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఆయన వారణాసికి వెళ్లారు.
ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ డెప్ వారణాసికి వెళ్లారు. ఇటీవల మాజీ భార్య అంబర్ హార్డ్ మీద ఆయన పరువు నష్టం దావా కేసులో విజయం సాధించిన సంగతి తెలిసిందే. స్నేహితుడు, గిటారిస్ట్ జెఫ్ బెక్‌తో కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అన్నట్టు... వారణాసి అంటే ఇండియాలో ఉన్న వారణాసి కాదు. అసలు వివరాల్లోకి వెళితే...
How Johnny Depp Celebrates His Win Over Amber Heard: యూకేలోని బర్మింగ్‌హామ్‌లో వారణాసి పేరుతో రెస్టారెంట్ ఉంది. అంబర్ హార్డ్ మీద కేసు గెలిచిన నాలుగు రోజులకు ఆ రెస్టారెంట్‌కు జానీ డెప్ వెళ్లారు. ఆయన కోసం రెస్టారెంట్ అంతా క్లోజ్ చేశారు. సాధారణ ప్రజలను అనుమతించలేదు. జూన్ 1న జానీ డెప్, అంబర్ హార్డ్ కేసులో తీర్పు వచ్చింది. ప్రస్తుతం బర్మింగ్‌హామ్‌లో మ్యూజిక్ కాన్సర్ట్స్ - పెర్ఫార్మన్స్ ఇస్తున్న జానీ డెప్ అండ్ కో జూన్ 5న వారణాసికి వెళ్లారు. మొత్తం 20 మందితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.
Also Read: 'హైపర్' ఆదిని అరెస్ట్ చేసిన పోలీసులు
హాలీవుడ్ వెబ్ సైట్ కథనం ప్రకారం... జానీ డెప్ డిన్నర్ బిల్ సుమారు 60 వేల డాలర్లు అయ్యిందట. భారతీయ కరెన్సీలో సుమారు 48 లక్షల రూపాయలు. జానీ డెప్ అండ్ కోతో వారణాసి రెస్టారెంట్ స్టాఫ్ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read: శర్వానంద్ సినిమాలో రాశీ ఖన్నాతో పాటు ప్రియమణి కూడా - అసలు కథ ఏంటంటే?
View this post on Instagram