By: ABP Desam | Updated at : 16 May 2022 11:38 AM (IST)
కేవీ అనుదీప్
'జాతి రత్నాలు'తో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించిన యువ దర్శకుడు కేవీ అనుదీప్. ఆ సినిమా తర్వాత, ఇప్పుడు తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌తో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా శివ కార్తికేయన్ 20వ సినిమా అది. అందుకని, SK 20 అంటున్నారు. ఒకవైపు SK 20 పనుల్లో బిజీగా ఉన్న కేవీ అనుదీప్, మరోవైపు ఇంకో సినిమాకు కథ అందించారు.
కేవీ అనుదీప్ అందించిన కథతో 'ఫస్ట్ డే ఫస్ట్ షో' (First Day First Show Movie) అనే సినిమా రూపొందుతోంది. దీనికి ఇద్దరు యువకులు.... వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారు. 'సిరి సిరి మువ్వ', 'శంకరాభరణం', 'సాగర సంగమం' వంటి చిత్రాలు నిర్మించిన పూర్ణోదయా పిక్చర్స్ ఏడిద నాగేశ్వరరావు వారసులు ఈ సినిమాకు నిర్మాతలు. శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్, మిత్రవింద మూవీస్ పతాకంపై శ్రీరామ్ ఏడిద సమర్పణలో శ్రీజ ఏడిద ఈ సినిమాను నిర్మించనున్నారు.
Also Read: పూజా హెగ్డేతో వెంకటేష్, వరుణ్ తేజ్ సల్సా - 'ఎఫ్ 3'లో స్పెషల్ సాంగ్ ప్రోమో చూశారా?
A ride filled with joy and laughter- #FirstDayFirstShow coming your way very soon...
Story by @anudeepfilm
Directed by @lnputtamchetty & #Vamshi.
Music by @radhanmusic @PoornodayaFilms @SrijaEnt @MitravindaFilms #FDFS #FDFStheMovie pic.twitter.com/ib5ZEebU1l — Poornodaya Pictures (@PoornodayaFilms) May 16, 2022
'ఫస్ట్ డే ఫస్ట్ షో'కు కేవీ అనుదీప్ కథ అందించడంతో పాటు కళ్యాణ్, వంశీధర్ గౌడ్ తో కలిసి స్క్రీన్ ప్లే అందించారు. వంశీధర్ గౌడ్, ఆయన మాటలు రాశారు. త్వరలో సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
Also Read: విజయ్ దేవరకొండ, సమంత సినిమా 'ఖుషి' ఫస్ట్ లుక్ ఇదిగో, రిలీజ్ ఎప్పుడంటే?
Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్
Jabardasth: బిగ్ బాస్ బ్యూటీకి 'జబర్దస్త్' ఛాన్స్ - అనసూయ రేంజ్ లో క్లిక్ అవుతుందా?
Ramya Raghupathi: ఆమెకు మాటిచ్చాను, నరేష్‌కు విడాకులు ఇవ్వను: రమ్య రఘుపతి
Dasara Movie: 'దసరా' మూవీ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Supritha: 'మా బట్టలు మా ఇష్టం, మీరేమైనా కొనిస్తున్నారా?' సురేఖావాణి కూతురు ఫైర్!
TTD TSRTC Darshan Tickets : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు టీటీడీ గుడ్ న్యూస్, ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి వెయ్యి టికెట్లు జారీ
MS Dhoni Treatment: ధోనీకి మోకాళ్ల నొప్పులు! ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న ఛాంపియన్!
OnePlus Nord 2T 5G: వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీ వచ్చేసింది - రూ.30 వేలలోపే ఫ్లాగ్షిప్ ఫీచర్లు!
IND vs ENG 5th Test: ఆడకూడని బంతులకు ఓపెనర్లు ఔట్ - లంచ్‌కు టీమ్ఇండియా 53-2