F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకటేష్, వరుణ్ తేజ్ సల్సా - 'ఎఫ్ 3'లో స్పెషల్ సాంగ్ ప్రోమో చూశారా?
'ఎఫ్ 3' సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ ప్రోమోను నేడు విడుదల చేశారు.
Pooja Hegde Special Song Promo - F3 Movie: మోడ్రన్ జిగేలు రాణిగా పాన్ ఇండియా హీరోయిన్ పూజా హెగ్డే ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించిన సినిమా 'ఎఫ్ 3'. సమ్మర్ సొగ్గాళ్లు... అనేది క్యాప్షన్. ఇందులో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ ప్రోమోను ఈ రోజు విడుదల చేశారు.
'హాత్ మే పైసా...
మూతి మే సీసా...
పోరితో సల్సా...
రాతిరంతా జల్సా.. అధ్యక్షా... లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా!'' అంటూ సాగిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆలపించారు. పూర్తి పాటను (Life Ante Itta Vundaala Song from F3 Movie) మంగళవారం విడుదల చేయనున్నారు.
Also Read: విజయ్ దేవరకొండ, సమంత సినిమా 'ఖుషి' ఫస్ట్ లుక్ ఇదిగో, రిలీజ్ ఎప్పుడంటే?
View this post on Instagram
వెంకటేష్ సరసన తమన్నా (Tamannaah ), వరుణ్ తేజ్ జోడీగా మెహరీన్ కౌర్, మరో కథానాయికగా సోనాల్ చౌహన్... ఇతర ప్రధాన పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, సునీల్ నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. మే 27న సినిమా విడుదల కానుంది.
Also Read: 'కెజియఫ్ 2'ను గుర్తు చేసిన కమల్ హాసన్ 'విక్రమ్' ట్రైలర్