VD11 - Kushi First Look: విజయ్ దేవరకొండ, సమంత సినిమా 'ఖుషి' ఫస్ట్ లుక్ ఇదిగో, రిలీజ్ ఎప్పుడంటే?
Vijay Devarakonda New Movie Update: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లుక్ ఎలా ఉందంటే...
Vijay Devarakonda First Look VD11 Movie: విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఓ సినిమా రూపొందుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ 11వ చిత్రమిది. ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాకు 'ఖుషి' (Vijay Devarakonda, Samatha Movie titled Kushi) టైటిల్ ఖరారు చేసినట్టు వెల్లడించారు.
డిసెంబర్ 23న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో 'ఖుషి' సినిమాను విడుదల (Vijay Devarakonda and Samantha's Kushi Release Date) చేయనున్నట్టు చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. ''సంతోషం, నవ్వులు, ప్రేమ, కుటుంబ అనుబంధాలు మేళవింపుగా 'ఖుషి' రూపొందుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ కు ఆనందాన్ని పంచుదాం'' అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
View this post on Instagram
కశ్మీర్ నేపథ్యంలో అందమైన ప్రేమకథతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. కొన్ని రోజులుగా కశ్మీర్‌లో షూటింగ్ చేస్తున్నారు. అక్కడే విజయ్ దేవరకొండ తన పుట్టినరోజును సైతం సెలబ్రేట్ చేసుకున్నారు.
సమంత బర్త్ డే సందర్భంగా విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ, యూనిట్ సభ్యులు ఆమెను సర్‌ప్రైజ్ చేశారు. ఒక ఫేక్ సీన్ తీశారు. అందులో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బావుంది. ప్రేమకథ కాబట్టి ఇద్దరూ అద్భుతంగా చేస్తున్నారని ఊహించవచ్చు.
Also Read: 'కెజియఫ్ 2'ను గుర్తు చేసిన కమల్ హాసన్ 'విక్రమ్' ట్రైలర్
మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.
Also Read: బాలయ్య సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ - రోల్ ఏంటంటే?
View this post on Instagram