By: ABP Desam | Updated at : 15 May 2022 06:31 PM (IST)
బాలయ్య సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ
'అఖండ' సినిమాతో సక్సెస్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను చాలా రోజుల క్రితమే మొదలుపెట్టారు. ఈ సినిమాలో బాలయ్య లుక్ ని సైతం రివీల్ చేశారు. మాస్ లుక్ లో అభిమానులను ఆకట్టుకున్నారు బాలయ్య.
ఈ సినిమాలో తమిళ, కన్నడ ఇండస్ట్రీల నుంచి కొంతమంది నటులను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. వారిలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ లాంటి తారలు ఉన్నారు. ఇందులో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతిహాసన్ కనిపించనుంది. అలానే సినిమాలో మరో హీరోయిన్ కనిపించబోతుందని సమాచారం. ఈ రోల్ కోసం చాలా మందిని అనుకున్నారు. ఫైనల్ గా మలయాళీ ముద్దుగుమ్మ హానీ రోజ్ ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఆమె హీరోకి జంటగా కనిపిస్తుందా..? లేక సిస్టర్ రోలా..? అనే విషయంలో క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ కి మించి ఒక పాత్ర ఉంది. అదే హీరో సిస్టర్ క్యారెక్టర్. దానికోసం హానీ రోజ్ ని తీసుకొని ఉంటారని అంటున్నారు. ఈ విషయంలో దర్శకనిర్మాతలు క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇక హానీ రోజ్ మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించింది. తెలుగులో 'ఆలయం', 'ఈ వర్షం సాక్షిగా' వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. అన్నాచెల్లెళ్ల మధ్య నడిచే ఈగో వార్ నేపథ్యంలో సినిమా నడుస్తుందని అంటున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు.
Also Read: హరీష్ శంకర్ లిస్ట్ లో క్రేజీ ఆఫర్ - సల్మాన్ తో సినిమా?
Chinmayi Sripada: డాడీ డ్యూటీస్‌లో రాహుల్ రవీంద్రన్ - చిల్డ్రన్ ఫోటోలు షేర్ చేసిన చిమ్మాయి
Virata Parvam: విరాట పర్వానికి కమల్ హాసన్‌కు లింకేంటి? వెంకటేష్ ప్రభు కార్తీక్ రాజా పేరు ధనుష్‌గా ఎలా మారింది?
MS Raju On Ticket Rates: థియేటర్లలో పెద్ద చిత్రాలే విడుదల చేయాలా? - నిర్మాత ఎంఎస్ రాజు సంచలన వ్యాఖ్యలు
Happy Birthday Release Date: వారం ముందుకొచ్చిన లావణ్యా త్రిపాఠి 'హ్యాపీ బర్త్ డే'
Guppedantha Manasu జూన్ 25 ఎపిసోడ్: నీ దూరం భరించలేను-దగ్గరకొస్తే సహించలేనన్న రిషి, జీవితకాలం మీతో ప్రయాణిస్తానన్న వసు- ప్రేమ వెన్నెల కురుస్తోంది!
PM Modi Bengaluru Visit: ప్రధాని వస్తున్నారని హడావుడిగా రోడ్డు వేశారు, ఇప్పుడేమో తలలు పట్టుకుంటున్నారు
Watch Video: మియా ఖలీఫాను గుర్తు పట్టి బుక్ అయ్యాడు, కాస్ట్లీ బ్యాగ్‌తో భార్యను కూల్ చేశాడు-ఈ వీడియో చూశారా
Secunderabad Roits: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ఆవుల సుబ్బారావే ప్రధాన సూత్రధారి- తేల్చిన రైల్వే పోలీసులు- రిమాండ్‌కు తరలింపు
Special Hotel In Vizag: వైజాగ్‌లో సూరీడు నడిపించే హోటల్ గురించి తెలుసా?