By: ABP Desam | Updated at : 08 Sep 2023 11:44 AM (IST)
మారి ముత్తు (Photo Credit : marimuthu/Google)
సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రముఖులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత శుక్రవారం మలయాళ నటి అపర్ణ నాయర్ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె మరణంతో మలయాళ ఇండస్ట్రీలో విషాదఛయాలు అలుముకున్నాయి. ఆమె మరణాన్ని మరవక ముందే సెప్టెంబర్ 2 న ప్రముఖ తమిళ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ఆర్.ఎస్ శివాజీ మృతి చెందారు. ఇక అదే తమిళ ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు డైరెక్టర్ మారిముత్తు మృతి చెందారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆయన మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ధ్రువీకరించారు.
ఈరోజు ఉదయం మారి ముత్తు ఓ సీరియల్ కి డబ్బింగ్ చెప్పారు. ఆ సమయంలోనే ఆయనకి ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు. 57 ఏళ్ల వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించడం తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమాలో ఆయన ప్రధాన పాత్రలో నటించారు. జైలర్ లో పన్నీరు పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. సినిమాలో విలన్ కు నమ్మకస్తుడిగా ఉండే పాత్రలో తన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పటివరకు సుమారు 100కు పైగా సినిమాల్లో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు మారి ముత్తు.
రీసెంట్ తమిళ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ 'విక్రమ్' సినిమాలో కూడా ఆయన నటించారు. అలాగే ఇటీవల ఆయన రాసిన 'హే ఇందమ్మ' అనే పద్యం విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఇండస్ట్రీలో మొదట సహాయ దర్శకుడిగా తన జర్నీని స్టార్ట్ చేసిన మారి ముత్తు, ఆ తర్వాత నటుడిగా మారారు. 1999లో అజిత్ నటించిన 'వాలి' సినిమాతో నటుడిగా రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 2008లో 'కన్నుమ్ కన్నుమ్' అనే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. డైరెక్టర్ గా మారకముందు మణిరత్నం, వసంత సీమన్, SJ సూర్య లాంటి ప్రఖ్యాత దర్శక నిర్మాతల దగ్గర సహాయ దర్శకుడిగా మంచి నైపుణ్యాన్ని కనబరిచారు.
Also Read : 'తురుమ్ ఖాన్‌లు' రివ్యూ : ముగ్గురు హీరోలు నవ్వించారా? టార్చర్ పెట్టారా?
తమిళ ఇండస్ట్రీలో నటులు, దర్శకులు, నిర్మాతలు అందరితో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. కేవలం సినిమాల్లోనే కాకుండా టెలివిజన్ రంగంలో కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. సన్ టీవీలో 'యాంటీ స్విమ్మింగ్' అనే సీరియల్ లో నటించి బుల్లితెర ఆడియన్స్ ని అలరించారు. ఆ సీరియల్ తో టీవీ రంగంలో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇక చివరగా రజనీకాంత్ 'జైలర్' సినిమాలో మంచి పాత్ర పోషించి అలరించారు. ఇక ఆయన మరణ వార్త తమిళ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణం పట్ల పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. మంచి నటుడిని కోల్పోయామంటూ ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనవుతున్నారు.
Also Read : సిద్ధార్థ్ చేతుల మీదుగా విడుదలైన 'రామన్న యూత్' ట్రైలర్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!
Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా
అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి
Skanda Overseas Reviews : ఓవర్సీస్ ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టిన 'స్కంద' టీమ్
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్కోట్ వన్డేలో టీమ్ఇండియా ఓటమి
TS TET: తెలంగాణ 'టెట్' పేపర్-1లో 36.89 శాతం, పేపర్-2లో 15.30 శాతం ఉత్తీర్ణత
/body>