అన్వేషించండి

Amitabh Bachchan: అవన్నీ ఫేక్ వార్తలు - తన ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చిన బిగ్ బీ అమితాబ్!

అమితాబ్ బచ్చన్ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుడంతో గుండె సమస్య తలెత్తినట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆ వార్తలన్నీ అవాస్తవాలని తేలాయి.

Amitabh Bachchan On His Health News: బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం గురించి పలు రకాల వార్తలు వినిపించాయి. కొద్ది రోజులుగా ఆయనకు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. మార్చి 15న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు వార్తలు వచ్చాయి. ఇంటి దగ్గరే ఆయనకు సమస్య తలెత్తడంతో ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటలకు తరలించినట్లు టాక్ వినిపించింది. గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోవడం వల్లే సమస్య ఏర్పడిందని ఊహాగానాలు వినిపించాయి. వెంటనే ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు యాంజియోప్లాస్టీ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు ప్రచారం జరగడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

అవన్నీ ఫేక్ వార్తలన్న అమితాబ్ బచ్చన్     

అమితాబ్ బచ్చన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన బయట కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అమితాబ్ తన కొడుకు అభిషేక్ తో కలిసి వచ్చారు. థానే దాదోజీ కొండదేవ్ స్టేడియం వేదికగా మాఝీ ముంబై, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా మధ్య జరిగిన ఈ మ్యాచ్ తిలకించారు. అమితాబ్ పక్కనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూర్చొని కనిపించారు. స్టేడియంలో అతడిని  చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. బిగ్ బీ హాస్పిటల్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి కదా? అని షాక్ అయ్యారు. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు అమితాబ్ ను ప్రశ్నించారు. అవన్నీ ఫేక్ వార్తలు అంటూ ఆయన కొట్టిపారేశారు. పూర్తిగా తెలియకుండా వార్తలు ప్రసారం చేయడం మంచిదికాదని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన అభిమానులు రిలాక్స్ అయ్యారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

భారీ ప్రాజెక్టులలో నటిస్తున్న బిగ్ బీ

ఇక ప్రస్తుతం అమితాబ్ వరుస సినిమాలు చేస్తున్నారు. తెలుగులో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ ‘కల్కి 2898 AD’లో కనిపించబోతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో హాలీవుడ్ రేంజిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇందులో బాలీవుడ్ భామలు దీపికా పడుకునే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తుండగా.. విశ్వ నటుడు కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 9న ఈ సినిమా థియేటర్లలో అడుగు పెట్టబోతోంది. అటు కోలీవుడ్‌లో రజనీ కాంత్‌ తో కలిసి అమితాబ్ ‘వెట్టయాన్‌’ సినిమాలో నటిస్తున్నారు. చాలా ఏండ్ల తర్వాత ఇద్దరు దిగ్గజ నటులు కలిసి నటిస్తుండంతో ఈ సినిమాపైనా భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Read Also: ఒకే ఒక్క క్యారెక్టర్ నన్ను సినిమాలకు దూరం చేసింది- అసలు విషయం చెప్పిన అందాల రాశీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu: కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu: కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
Duleep Trophy: అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
Travis Head: అలా ఎలా  కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
అలా ఎలా కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
Yashasvi Jaiswal: 147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
Embed widget