News
News
వీడియోలు ఆటలు
X

Tollywood: మెగా మేనల్లుడితో అక్కినేని వారసుడికి ఇబ్బందులు తప్పవా?

'ఏజెంట్' పై అఖిల్ అక్కినేని చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ స్పై థ్రిల్లర్ ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ చిత్రానికి 'విరూపాక్ష' రూపంలో ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది.

FOLLOW US: 
Share:
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ "ఏజెంట్''. స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. అప్పుడెప్పుడో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా కోవిడ్ కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఏప్రిల్ 28న తెలుగు మలయాళ భాషల్లో విడుదలకు సిద్దమైంది. అయితే మరో మూడు రోజుల్లో రాబోతున్న ఈ చిత్రానికి 'విరూపాక్ష' రూపంలో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
 
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'విరూపాక్ష'. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ మిస్టికల్ థ్రిల్లర్ గత శుక్రవారం గ్రాండ్ గా రిలీజైంది. ఫస్ట్ డేనే హిట్ టాక్ తెచ్చుకొని, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే 44 కోట్ల కలెక్షన్స్ రాబట్టి, ఫస్ట్ వీకెండ్ లోనే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను లాభాల బాట పట్టించింది. ట్రెండ్ చూస్తుంటే మరికొన్ని రోజులు థియేటర్లలో ఈ సినిమా సందడి కనిపించేలా ఉంది. అదే జరిగితే ఈ వారం విడుదల కాబోతున్న 'ఏజెంట్' మూవీ ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నారు. 
 
'ఏజెంట్' సినిమాపై అఖిల్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో సక్సెస్ రుచి చూసిన అక్కినేని వారసుడు.. ఈసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టార్గెట్ గా బరిలోకి దిగుతున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి యాక్షన్ హీరోగా మారాలని ఆరాట పడుతున్నాడు. దీని కోసం ఎంత చెయ్యాలో అంతా చేస్తున్నాడు. ఏజెంట్ సినిమా కోసం గత మూడేళ్లుగా తీవ్రంగా కష్టపడిన అఖిల్.. ఇప్పుడు ప్రమోషన్స్ మొత్తాన్ని తన భుజాన వేసుకుని సినిమాని జనాల్లోకి తీసుకెళ్తున్నాడు.
 
ఇప్పటికే 'ఏజెంట్' నుంచి విడుదలైన టీజర్, గ్లింప్స్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకటీ రెండు పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో వైల్డ్ సాలే అనే స్పెషల్ ఐటెమ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అఖిల్ ప్రమోషన్లను ముమ్మరం చేశాడు. వరుస పెట్టి ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాడు. ఇదంతా సినిమాపై ట్రేడ్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ తెచ్చి పెడుతుందో చూడాలి.
 
కాగా, 'ఏజెంట్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ , సరెండర్2సినిమా బ్యానర్స్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. దీని కోసం దాదాపు 80 కోట్ల వరకూ ఖర్చూ అయిందని టాక్. ఇది అఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ అందించారు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. హిప్ హాప్ తమిళ సంగీతం సమకూర్చగా.. భీమ్స్ సిసిరిలియో ఒక సాంగ్ కంపోజ్ చేశాడు. రసూల్ ఏల్లోర్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
Published at : 25 Apr 2023 10:25 AM (IST) Tags: Tollywood News Akhil Akkineni Sai Dharam Tej Agent Virupaksha

సంబంధిత కథనాలు

Ram Sita Ram Song: ఆహా ఎంత అద్భుతం! ఆకట్టుకుంటున్న‘ఆదిపురుష్‌’ ‘రామ్ సీతా రామ్’ సాంగ్

Ram Sita Ram Song: ఆహా ఎంత అద్భుతం! ఆకట్టుకుంటున్న‘ఆదిపురుష్‌’ ‘రామ్ సీతా రామ్’ సాంగ్

HanuMan Movie: ‘హనుమాన్‘ చిత్రంలో 1600 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ - మరి రిలీజ్?

HanuMan Movie: ‘హనుమాన్‘ చిత్రంలో 1600 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ - మరి రిలీజ్?

Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?

Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?

అఖిల్‌‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!

అఖిల్‌‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!

Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Bro Movie Update: మామా అల్లుళ్ల  పోజు అదిరింది ‘బ్రో’-  పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

టాప్ స్టోరీస్

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!