Vishwambhara: 'విశ్వంభర' విడుదలకు 'ఇంద్ర' సెంటిమెంట్... రిలీజ్ ఆ రోజేనా?
Vishwambhara New Release Date: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'విశ్వంభర' సినిమా విడుదలకు 'ఇంద్ర' రిలీజ్ డేట్ సెంటిమెంట్ యాడ్ కానుందని లేటెస్ట్ టాక్.

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా పొందుతున్న లేటెస్ట్ సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర' (Vishwambhara Movie). సంక్రాంతికి థియేటర్లలోకి రావాల్సిన చిత్రమిది. 'గేమ్ చేంజర్' కోసం వాయిదా పడింది. అయితే ఇప్పటి వరకు కొత్త విడుదల తేదీ అనౌన్స్ చేయలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వినపడుతున్న లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం...
'ఇంద్ర' రిలీజ్ రోజే 'విశ్వంభర'?
'విశ్వంభర' విడుదల గురించి వారానికి ఒక కొత్త డేట్ వినపడుతోంది. చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమాలలో ఒకటైన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' రిలీజ్ డేట్ మే 9న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఒక సమయంలో వార్తలు వినిపించాయి. ఆ తర్వాత చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని పుకార్లు షికారు చేశాయి. ఫిలిం నగర్ వర్గాల లేటెస్ట్ అప్డేట్ ప్రకారం... ఇంద్ర రిలీజ్ డేట్ మీద 'విశ్వంభర' యూనిట్ కన్నేసిందట.
సమ్మర్ రేస్ నుంచి 'విశ్వంభర' తప్పుకొందని టాలీవుడ్ టాక్. జూలై 24న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారట. 'ఇంద్ర' కూడా అదే రోజున విడుదలై ఇండస్ట్రీ హిట్ అయింది. ఆ సెంటిమెంట్ 'విశ్వంభర'కు కూడా వర్కౌట్ అవుతుందా? లేదా? చూడాలి.
ఈ నెల 19న మొదటి పాట!
'విశ్వంభర' చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది. ఒక పాట కొంత ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ అంతా కంప్లీట్ చేసినట్టే. గ్రాఫిక్స్ మీద చిత్ర బృందం దృష్టి సారించింది. ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చూస్తోంది. అయితే ఈ నెల 19న నందిగామలోని హనుమంతుని విగ్రహం దగ్గర మొదటి పాట విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'విశ్వంభర' సెట్స్ నుంచి విడుదల అయిన ఫోటోలు చూస్తే ఒక హనుమంతుని విగ్రహం ఉంటుంది. పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు కూడా ఆ హనుమంతుని విగ్రహం ముందు చిరంజీవి ఫోటోలు దిగారు. సినిమాలో హనుమంతుడి ప్రస్తావన ఉంటుంది. అందుకని మొదటి పాటను హనుమంతుని విగ్రహం దగ్గర విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. చంద్రబోస్ సాహిత్యం, కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రానికి 'బింబిసార' ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించారు. చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటించిన ఈ సినిమాలో 'నా సామి రంగా' ఫేమ్ ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి తదితరులు ఇతర ప్రధాన తారాగణం. యువి క్రియేషన్స్ పతాకం మీద వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: ఆస్పత్రిలో అలేఖ్య చిట్టి... చావు తప్ప మరో దిక్కు లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న సుమ
View this post on Instagram





















