News
News
వీడియోలు ఆటలు
X

‘ఫర్హానా’ టీజర్ - ఐశ్వర్య రాజేష్ నుంచి ఇంత బోల్డ్ కంటెంట్ ఊహించి ఉండరు!

వైవిధ్యమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు 'ఫర్హానా' గా పలకరించడానికి రెడీ అయింది. అగ్ర కథానాయిక రష్మిక మందన్న చేతుల మీదుగా తాజాగా టీజర్ విడుదలైంది.

FOLLOW US: 
Share:
కెరీర్ ప్రారంభం నుంచీ గ్లామర్ షోకు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో మాత్రమే నటిస్తూ వస్తోన్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. తమిళంలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు అనువాదంతో తెలుగు ప్రేక్షకులని కూడా పలకరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ‘ఫర్హానా’గా రావడానికి రెడీ అయింది.
 
ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఫర్హానా'. మాన్ స్టర్, ఒరు నాల్ కూత్తు వంటి తమిళ చిత్రాలను అందించిన నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాశ్, ఎస్.ఆర్.ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా శనివారం టీజర్ ను ఆవిష్కరించారు.
 
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడక్షన్ లో 'రెయిన్ బో' సినిమా చేస్తున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న 'ఫర్హానా' టీజర్ ను లాంచ్ చేసి, చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందజేసింది.  టీజర్ లోకి వెళ్తే, ఇందులో ఫర్హానా అనే సంప్రదాయం, కట్టుబాట్లు కలిగిన ముస్లిం మహిళగా ఐశ్వర్య కనిపించనుంది. తన పిల్లలకి మంచి చదువు చెప్పించడానికి, కుటుంబాన్ని పోషించడానికి ఆమె ఓ కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
కస్టమర్స్ కోరిక మేరకు తమ అందచందాలతో ఆనందపరిచే జాబ్ ఆమెది. ఇంట్లో వాళ్లకి తెలియకుండా ఆ ఉద్యోగం చేస్తోంది. అయితే ఫర్హానా చేస్తున్న జాబ్ గురించి తన ఫ్యామిలీలో తెలియడంతో ఆమె జీవితం తలకిందులైనట్లు టీజర్ ని బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది? తన సమస్యల నుంచి ఎలా బయటపడింది? అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే. 
 
ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ తో బలమైన పాత్రలతో ఫర్హానా మూవీని తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. కథంతా ఫర్హానా పాత్ర చుట్టూ తిరుగుతున్నప్పటికీ.. ఇందులో మధ్యతరగతి మహిళల జీవితాలు, వారి స్వతంత్ర భావాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
 
ఇప్పటికే పలు విమన్ సెంట్రిక్ సినిమాలలో అలరించిన ఐశ్వర్య రాజేష్.. ఇప్పుడు ఫర్హానా అనే మధ్యతరగతి ముస్లిం మహిళగా మంచి నటన కనబరిచింది. శ్రీ రాఘవ, ‘జితన్’ రమేష్, కిట్టి, అనుమోల్, ఐశ్వర్య దత్తా తదితరులు ఇతర పాత్రలు పోషించారు. గోకుల్ బెనాయ్ దీనికి సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. నేషనల్ అవార్డ్ విన్నర్ సాబు జోసెఫ్ ఎడిటింగ్ చేశారు. 'రాధే శ్యామ్' ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు. 
 
‘ఖైదీ’ ‘ఖాకీ’ ‘సుల్తాన్’ ‘ఒకే ఒక జీవితం’, వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో.. తెలుగులోనూ 'ఫర్హానా' మూవీపై ఆసక్తి నెలకొంది. సమ్మర్ కానుకగా మే 12న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
 
సీనియర్ నటుడు రాజేష్‌ కుమార్తె, హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలైన ఐశ్వర్య రాజేష్.. 'రాంబంటు' చిత్రంలో చిల్డ్ ఆర్టిస్టుగా నటించింది. 'కౌసల్య కృష్ణమూర్తి' అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో 'మిస్ మ్యాచ్' 'వరల్డ్ ఫేమస్ లవర్' 'టక్ జగదీశ్' 'రిపబ్లిక్' 'డ్రైవర్ జమున' వంటి సినిమాలో మెరిసింది. ఈ ఏడాది 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' 'రన్ బేబీ రన్' 'సొప్పన సుందరి' చిత్రాలతో అలరించిన ఐశ్వర్య.. 'ఫర్హానా' తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Published at : 23 Apr 2023 05:12 PM (IST) Tags: Aishwarya Rajesh Rashmika Mnadanna Farhana Farhana Teaser Farhana From May12

సంబంధిత కథనాలు

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

టాప్ స్టోరీస్

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !