అన్వేషించండి

Ileana Health: బిడ్డ పుట్టిన నాలుగు నెలలకు షాకింగ్ న్యూస్ చెప్పిన ఇలియాన, ఏం జరిగిందంటే?

Postpartum Depression: బెల్లీ బ్యూటీ ఇలియాన ఈ మధ్యే తల్లయిన సంగతి తెలిసిందే. అయితే బిడ్డ పుట్టిన నాలుగు నెలల తర్వాత ఆమె ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది.

Ileana About Her Health Issue: బెల్లీ బ్యూటీ ఇలియాన ఈ మధ్యే తల్లయిన సంగతి తెలిసిందే. తన రిలేషన్‌ను సీక్రెట్‌గా ఉంచిన ఇల్లి సడెన్‌గా గర్భం దాల్చనంటూ గతేడాది ప్రకటించి అందరికి షాకిచ్చింది. దీంతో ఆమె భర్త ఎవరా? అని అంతా ఆలోచనలో పడ్డారు. తల్లికాబోతున్నట్టు చెప్పిన ఇలియాన భర్త ఎవరో చెప్పలేదంటబ్బా అని అంతా చెవులు కొరుకున్నారు. ఈ క్రమంలో ఆమె విపరీతమైన ట్రోలింగ్‌కి గురైంది. తరచూ బిడ్డ తండ్రి ఎవరని ప్రశ్నిస్తూ.. ఇలియానని ఇబ్బంది పెట్టారు. అయినా అవేవి పట్టించుకోని ఇలియాన అమ్మతనాన్ని అస్వాదిస్తూ తరచూ తన ప్రెగ్నెన్సీ జర్నీని సోషల్ మీడియా వేదికగా పంచుకునేది.చివరికి ట్రోలింగ్స్, విమర్శల మధ్య గతేడాది ఆగష్టులో పండంటి బాబుకు  జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. అప్పుడే తన భర్తను పరిచయం చేసింది. బాబుకు ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టినట్టు చెప్పిన ఇల్లి బేబీ తన భర్త పేరును కూడా రివీల్ చేసింది. అతడి ఫోటో షేర్ చేసి మైఖేల్ డోలన్ అని పరిచయం చేసింది. దాంతో ట్రోల్ చేసిన వారు సైతం ఇలియానకు శుభాకాంక్షలు తెలిపారు. 

మైఖేల్, డాక్టర్స్ వల్లే బయటపడ్డాను

ఇదిలా ఉంటే బిడ్డ పుట్టిన నాలుగు నెలల తర్వాత ఇలియాన ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. బిడ్డ పుట్టాక తాను తీవ్ర ఒత్తిడికి గురయ్యానంటూ తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌(Postpartum Depression)కు (డెలివరి తర్వాత వచ్చే ఒత్తిడి) గురయ్యాను. ఎప్పుడూ ఏడ్చేదాన్ని. రాత్రిళ్లు సడెన్ మెలుకువ వచ్చి ఏడ్చేదాన్ని. దీంతో బాబును వేరుగా మరో గదిలో పడుకోబెట్టావాళ్లం. అప్పుడు డాక్టర్లే తనని చూసుకున్నారు. నేను ఒక్కదాన్నే గదిలో బాగా ఏడ్చేదాన్ని.  ఆ టైంలో నా భర్త మైఖేల్, డాక్టర్లు నాకు మంచి సపోర్టు ఇచ్చారు. మైఖేల్ నాకు తోడుగా నిలబడ్డాడు. నన్ను, మా బిడ్డను జాగ్రత్తగా చూసుకున్నాడు. ప్రతి క్షణం మా ఇద్దిరిని కనిపెట్టుకు‌నే ఉన్నాడు. ఎలాంటి ఆలోచన లేకుండా బాగా పడుకొమ్మని చెప్పేవాడు. బాబుని నేను చూసుకుంటా అని నాకు భరోసా ఇచ్చేవాడు. నిజం చెప్పాలంటే తనవల్లే నేను ఒత్తిడిని నుంచి తొందరగా భయటపడ్డాను. ఆ సమయంలో నా బిడ్డ సంరక్షణను డాక్టర్లే చూసుకున్నారు. వారికి ఎప్పటికీ నేను కృతజ్ఞు‌రాలిని’ అంటూ చెప్పుకొచ్చింది.  

మిస్టరీగా ఉంచడం కూడా మంచిదే..

అలాగే ట్రోల్స్‌పై స్పందించింది. మైఖేల్‌తో రిలేషన్‌ను  భయటపెట్టకపోవడం కారణం ఉంది. నా గత రిలేషన్, బ్రేకప్ గురించి అందరికి తెలిసిందే. ఆ తర్వాత నేను నా ప్రజెంట్ రిలేషన్, భర్త గురించి చెప్పడానికి కాస్తా భయపడ్డాను. నేను చెప్పగానే అంతా దానిపై మాట్లాడుకుంటారు. ఎవరికి తోచినట్టు వారు ఆలోచించకుని నెగిటివ్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది నాకు ఇష్టం లేదు. నా భర్త, నా ఫ్యామిలీ గురించి చెడుగా మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే మైఖేల్‌తో నా రిలేషన్‌‌ను సస్పెన్స్‌లో ఉంచా. దాని వల్ల కూడా ట్రోల్స్‌కు గురయ్యాను. కానీ ఒకే. నా రిలేషన్ మిస్టరీగా ఉంచి అందరిలో ఆసక్తి పెంచాను’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది.

Also Read: 'యానిమల్' క్లైమాక్స్ ఫైట్ కూడా కాపీయేనా? - వైరల్ అవుతున్న ఓల్డ్ వీడియో, ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget