Animal Movie : 'యానిమల్' క్లైమాక్స్ ఫైట్ కూడా కాపీయేనా? - వైరల్ అవుతున్న ఓల్డ్ వీడియో, ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
Animal : యానిమల్ మూవీ క్లైమాక్స్ ఫైట్ 'ఆషిక్' అనే హిందీ సినిమాకి కాపీ అంటూ ఓ వీడియో సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతోంది.
Animal Movie : ‘అర్జున్ రెడ్’డి మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన 'యానిమల్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ని అందుకుందో తెలిసిందే. డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లో స్టడీ కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.860 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని రణ్ బీర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతోపాటు ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకున్నప్పటికీ యానిమల్ పై విమర్శలు ఏమాత్రం తగ్గలేదు.
ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాపై ఎన్నో నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ వాటిని మూవీ టీం ఏమాత్రం పట్టించుకోలేదు. కాగా ఈ సినిమాలో ఫైట్ సీన్స్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ తో పాటు క్లైమాక్స్ ఫైట్ సీన్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది. రణబీర్, బాబి డియోల్ ఇద్దరూ తలపడుతున్న సమయంలో బ్యాగ్రౌండ్ లో ఎమోషనల్ సాంగ్ రావడం ఆడియన్స్ కి సరికొత్త అనుభూతి ఇచ్చింది. ఈ ఫైట్ లో ఇద్దరూ షర్ట్ లెస్ బాడీతో కొట్టుకోవడం హైలైట్ గా నిలవగా.. తాజాగా ఈ క్లైమాక్స్ ఫైట్ సీన్ కాపీ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
2001లో వచ్చిన 'ఆషిక్' అనే సినిమాలో సీన్‌ను కాపీ కొట్టారంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన వాళ్లంతా సందీప్ వంగా 'యానిమల్' లో సేమ్ టు సేమ్ ఇదే సీన్ ని కాపీ కొట్టారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో గమ్మత్తైన విషయం ఏమిటంటే 'ఆషికి' సినిమాలో బాబీ డియోల్ రాహుల్ దేవ్ తో తలపడితే.. ఇక్కడ యానిమల్ లో మాత్రం రణ్ బీర్ తో బాబీ డియోల్ ఫైట్ చేస్తాడు. ఒక్క రణ్ బీర్ తప్పించి మిగతాదంతా సేమ్ టూ సేమ్ ఉండటంతో ఈ రెండు సినిమాల క్లైమాక్స్ ఫైట్ వీడియోలను నెటిజెన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు.
కాగా గతంలోనూ యానిమల్‌పై కాపీ ఆరోపణలు వచ్చాయి. యానిమల్ ట్రైలర్‌ను విడుదలైన వెంటనే హువా మైన్ పాటలో రష్మిక, రణబీర్ ఫ్లైట్ సీన్‌ను ‘50 షేడ్స్ ఆఫ్ గ్రే’ చిత్రం కాపీ కొట్టారని, మరో ఫైట్ సీక్వెన్స్ కొరియన్ చిత్రం నుంచి కాపీ చేశారంటూ రకరకాల విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ నేపథ్యంలో రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించగా.. బాలీవుడ్ హీరోయిన్ తృప్తి దిమ్రి ప్రత్యేక పాత్రలో కనిపించింది. టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ల లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read : ‘భీమా’ టీజర్: బ్రహ్మ రాక్షసుడు వచ్చేశాడు, దున్నపోతుపై గోపిచంద్ ఎంట్రీ అదుర్స్