అన్వేషించండి

Bhimaa Teaser : ‘భీమా’ టీజర్: బ్రహ్మ రాక్షసుడు వచ్చేశాడు, దున్నపోతుపై గోపిచంద్ ఎంట్రీ అదుర్స్

Bhimaa Teaser : గోపీచంద్ హీరోగా నటిస్తున్న 'భీమా' సినిమా నుంచి తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

Gopichand's Bhimaa Teaser : టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం 'భీమా'. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకి కన్నడ దర్శకుడు ఏ. హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవాని శంకర్, మాళవికా శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత గోపీచంద్ మళ్లీ ఖాకీ డ్రెస్ లో కనిపించబోతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ ఈరోజు టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

సుమారు నిమిషం నిడివితో ఉన్న ఈ టీజర్ లో గోపీచంద్ ఇంట్రడక్షన్ ని నెక్స్ట్ లెవెల్ లో చూపించారు. 'యధా యధా ధర్మస్య' అనే శ్లోకంతో మొదలైన ఈ టీజర్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా టీజర్ లో గోపీచంద్ ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. జస్ట్ చిన్న టీజర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. 'రాక్షసులను వెంటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చేసాడు' అంటూ బ్యాక్ గ్రౌండ్లో వచ్చే డైలాగ్ తో గోపీచంద్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ముఖ్యంగా ఖాకీ డ్రెస్ లో గోపీచంద్ దున్నపోతుపై ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. టీజర్ లో గోపీచంద్ లుక్ కూడా చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది.

పోలీస్ డ్రెస్ లో గోపీచంద్ యాక్షన్ అంటే కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంటూ టీజర్ చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇదే టీజర్ లో రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఫిబ్రవరి 16న సినిమాను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బానర్పై కేకే రాధామోహన్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. రవి బస్సుర్ సంగీతం అందిస్తున్నారు. స్వామీ జీ గౌడ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. వెంకట్, డాక్టర్ రవి వర్మ ఫైట్స్ అందించనున్నారు. మరోవైపు ఈ సినిమాతో గోపీచంద్ సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది.

ఎందుకంటే ఈ మ్యాచో హీరో కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద వరుస అపజయాలను అందుకుంటున్నాడు. గోపీచంద్ హిట్ కొట్టి చాలా కాలమైంది. రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన 'రామబాణం' బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. 'రామబాణం' ప్లాప్ తో గోపీచంద్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. దీంతో ఇప్పుడు రొటీన్ మూవీస్ కాకుండా తన రూట్ మార్చుకుని కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తూ నటిస్తున్న సినిమానే 'భీమా'. ఈ సినిమాని తెరకెక్కిస్తున్న హర్ష కన్నడలో ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు ఇప్పుడు 'భీమా' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అరంగేట్రం చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ దర్శకుడు కన్నడ అగ్ర హీరో శివరాజ్ కుమార్ తో 'వేద' అనే సినిమాని తెరకెక్కించాడు. హై వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కన్నడలో మంచి విజయాన్ని అందుకుంది.

Also Read : నా భర్త బోల్డ్ సీన్స్ చేయమని ఎంకరేజ్ చేశారు, అందుకే అలా - ఆనంది

టాప్ హెడ్ లైన్స్

Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 26th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పద్మాక్షి, సహస్రల్ని ఐస్ చేసి ఇంట్లో చోటు దక్కించుకున్న మహా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పద్మాక్షి, సహస్రల్ని ఐస్ చేసి ఇంట్లో చోటు దక్కించుకున్న మహా!
Romantic Drama OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి A రేటెడ్ రొమాంటిక్ మూవీ - తెలుగులోనూ చూడొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి A రేటెడ్ రొమాంటిక్ మూవీ - తెలుగులోనూ చూడొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు
నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
Fake Korrameenu Fish Identification: మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
Samantha Ruth Prabhu : ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
Embed widget