Anandhi: నా భర్త బోల్డ్ సీన్స్ చేయమని ఎంకరేజ్ చేశారు, అందుకే అలా - ఆనంది
Mangai Movie: పెళ్లి తర్వాత బోల్డ్ సీన్స్‌లో నటించడం కుదరదు అని చెప్పేస్తారు హీరోయిన్స్. కానీ ఆనందిని మాత్రం తన భర్తే అలాంటి సీన్స్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారని చెప్పుకొచ్చింది.
Anandhi about Bold Scenes: మామూలుగా నార్త్‌తో పోలిస్తే.. సౌత్‌లో హీరోయిన్స్ గ్లామర్ షోకు దూరంగా ఉంటారని అంటుంటారు. కానీ ఈరోజుల్లో ఆ గ్యాప్ అనేది తగ్గిపోయింది. గ్లామర్ పాత్రల్లో నటించాలా వద్దా, ఎక్స్‌పోజింగ్ చేయాలా, వద్దా అనేది హీరోయిన్స్ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంది. కానీ బాలీవుడ్‌లో పెళ్లయిన హీరోయిన్స్ నటించినంత బోల్డ్‌గా సౌత్‌లో పెళ్లి అయిన తర్వాత హీరోయిన్స్ నటించలేరు. పెళ్లి అవ్వగానే సౌత్‌లో చాలామంది హీరోయిన్స్ నటించడమే మానేస్తారు. కానీ తన భర్త తనను ఎలాంటి పాత్రలో చేయడానికి అయినా ఎంకరేజ్ చేస్తాడని, బోల్డ్ సీన్స్ కూడా చేయమని చెప్తాడని ఒక సౌత్ హీరోయిన్ ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.
కోలీవుడ్‌లో తెలుగమ్మాయి
ఎంతోమంది తెలుగు భామలకు టాలీవుడ్‌లో అవకాశాలు లేక ఇతర భాషలకు వెళ్లి సెటిల్ అయిపోయారు. అలాంటి వారిలో ఒకరు ఆనంది. ముందుగా ఆనంది ఒక తెలుగమ్మాయిగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయినా.. ఇక్కడ తనకు అంతగా ఆదరణ లభించలేదు. అందుకే కోలీవుడ్ నుండి వచ్చిన అవకాశాలను యాక్సెప్ట్ చేసింది. అక్కడ ఆనంది, స్క్రిప్ట్ సెలక్షన్‌కు, నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక హీరోయిన్‌గా పెద్దగా గుర్తింపు రాకముందే ఆనంది పెళ్లి పీటలెక్కింది. ఒక బాబుకు జన్మనిచ్చింది కూడా. పెళ్లికి ముందు కూడా ఆనంది పెద్దగా బోల్డ్ సినిమాల్లో, సీన్స్‌లో నటించేది కాదు. కానీ పెళ్లి తర్వాత తన భర్త అలాంటి సీన్స్ చేయడానికి భయం వద్దంటూ ఎంకరేజ్ చేశారని బయటపెట్టింది ఈ తెలుగమ్మాయి.
నా భర్త ఎంకరేంజ్ చేశారు
ప్రస్తుతం ఆనంది ‘మాంగాయ్’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. అయితే ముందుగా ఈ మూవీలో చాలా బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఉన్నాయని తను నటించడానికి ఒప్పుకోలేదు. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఇలాంటి ఒక సినిమా చేయడం కరెక్ట్ కాదని, ఇలాంటి పాత్ర చేయడానికి తను రెడీగా లేనని మేకర్స్‌కు చెప్పేసింది. ఆ తర్వాత మళ్లీ తానే ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేసింది. దాని వెనుక కారణాన్ని ఆనంది.. తాజాగా బయటపెట్టింది. ‘‘నా భర్త ఈ సినిమా చేయమని ఎంకరేజ్ చేశారు. పాత్రకు అవసరమైతే బోల్డ్ సీన్స్‌ను కూడా భయం లేకుండా చేయమన్నారు. అప్పుడు నేను ఆ సినిమాను ఓకే చేసి బోల్డ్ సీన్స్‌లో ఈజీగా నటించగలిగాను’’ అని తెలిపింది.
అప్పుడప్పుడే తెలుగు ఆఫర్లు
ఒరిజినల్‌గా తెలంగాణలోని వరంగల్‌కు చెందిన ఆనంది.. ఇండస్ట్రీలో హీరోయిన్‌గా సెటిల్ అయిపోవాలని అనుకుంది. కెరీర్ మొదట్లో ‘బస్ స్టాప్’లాంటి ఒకట్రెండు తెలుగు చిత్రాల్లో నటించింది. కానీ తనకు ఇక్కడ అంత గుర్తింపు రాలేదు. అప్పుడే తమిళ సినిమా ఆఫర్లు తనను వెతుక్కుంటూ వచ్చాయి. డిఫరెంట్ కథలు, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ఆనంది.. కోలీవుడ్‌లో తనకంటూ గుర్తింపును సంపాదించుకుంది. ఇక కోలీవుడ్‌లో సెటిల్ అయిపోయిన తర్వాత కూడా ‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘జాంబి రెడ్డి’లాంటి ఒకట్రెండు తెలుగు సినిమాల్లో మెరిసి ఆడియన్స్‌ను అలరించింది. తన పర్ఫార్మెన్స్ బాగున్నా కూడా తెలుగు మేకర్స్ ఎవరూ తనను క్యాస్ట్ చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అందుకే ఇప్పుడు తన చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ప్రస్తుతం ఆనంది ‘మాంగాయ్’ అనే చిత్రంలో నటిస్తోంది. గుబేంత్రన్ కామాచి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా షూటింగ్ జరుపుకోనుంది. ‘మాంగాయ్’కు ఏ ఆర్ జాఫర్ సాధిక్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Also Read: అమ్మ నన్ను ఆ తెలుగు బూతుతో తిట్టేది - జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్