Ileana Pregnancy : ఇలియానా స్వీట్ సర్‌ప్రైజ్ - పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్?
Ileana D'cruz announces her pregnancy : ఇలియానా తాను గర్భవతి అని వెల్లడించారు. అయితే, ఆ బిడ్డకు తండ్రి ఎవరు? అనేది చెప్పలేదు. తాను తల్లి కాబోతున్నట్లు మాత్రమే పేర్కొన్నారు.
Ileana Pregnancy : తల్లి కాబోతున్న కథానాయికల జాబితాలో ఇలియానా డి క్రూజ్ చేరారు. ఈ రోజు ఉదయం త్వరలో తాను అమ్మ కాబోతున్నట్లు గోవా సుందరి సోషల్ మీడియాలో వేదికగా వెల్లడించారు. అయితే, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ఆ బిడ్డకు తండ్రి ఎవరు? అనేది ఆమె చెప్పలేదు. తనకు పెళ్లి అయినట్లు ఇప్పటి వరకు ఎక్కడా ఇలియానా అనౌన్స్ చేయలేదు. దాంతో 'ఇలియానాకు ఎప్పుడు పెళ్లి అయ్యింది?' అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఇండస్ట్రీ ప్రముఖులకు ఇలియానా ప్రేమ విషయం తెలుసు. అందువల్ల, అందరూ ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
అసలు, ఇలియానా ఏం పోస్ట్ చేశారంటే?
Ileana D'cruz : 'అండ్ సో ద అడ్వెంచర్ బిగిన్స్' (ఇప్పటి నుంచి సాహసయాత్ర మొదలు అయ్యింది) - ఈ కొటేషన్ రాసిన ఉన్న టీ షర్టును ఇలియానా పోస్ట్ చేశారు. ఆ తర్వాత మెడలో 'అమ్మ' (Mama) అని రాసి ఉన్న చైన్ ధరించిన ఫోటోను పోస్ట్ చేశారు. ఈ రెండూ చూస్తే ఆమె గర్భవతి అని చెప్పడం పెద్ద కష్టం ఏమీ కాదు. ''త్వరలో వస్తుంది. నా లిటిల్ డార్లింగ్ ని కలవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'' అని క్యాప్షన్ ఇచ్చారు.
చిన్నారికి వెల్కమ్ చెప్పిన అమ్మమ్మ!
ఇలియానా పోస్ట్ కింద ఆమె తల్లి సమీరా డి క్రూజ్ ''వెల్కమ్ సూన్ టు ద వరల్డ్ మై న్యూ గ్రాండ్ బేబీ. కాంట్ వెయిట్'' అని కామెంట్ చేశారు. ఇలియానా సోదరి లేదా సోదరుడికి పిల్లలు ఉన్నారని అర్థమవుతోంది. ఆల్రెడీ సమీరా అమ్మమ్మ అయ్యారు. కొత్తగా రాబోయే మనవరాలు లేదా మనవడికి ఆమె వెల్కమ్ చెప్పారు. ఇంకా చాలా మంది ఇలియానాకు కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నారు.
కట్రీనాకు కాబోయే మరదలు ఇలియానా!
ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్, ఇలియానా కొన్నాళ్ళు డేటింగ్ చేశారు. ఆ సమయంలో ఇద్దరూ చెట్టపట్టాలు వేసుకుని మీడియాకు కనిపించారు. అయితే, ఏమైందో? ఏమో? వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో వెంకటేష్ 'మల్లీశ్వరి', నందమూరి బాలకృష్ణ 'అల్లరి పిడుగు' సినిమాల్లో నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కట్రీనా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్ లారెంట్ మైఖేల్ (Sebastian Laurent Michel)కు ఇలియానా దగ్గర అయ్యారు.
Also Read : హైదరాబాదుకు జాను వచ్చిందిరోయ్ - ఎన్టీఆర్ 30 కోసమే!
View this post on Instagram
'కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి కట్రీనా కైఫ్ (Katrina Kaif) వచ్చారు. అప్పటికి కొన్ని రోజుల ముందు జరిగిన ఆమె బర్త్ డే వేడుకల్లో ఇలియానా సందడి చేశారు. ఆ విషయం గురించి కరణ్ జోహార్ ప్రశ్నించగా... తన సోదరుడితో ఇలియానా డేటింగ్ విషయాన్ని పరోక్షంగా కట్రీనా కన్ఫర్మ్ చేశారు. అదీ సంగతి! కొన్ని రోజులుగా డేటింగులో ఉన్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా? లేదా? అనేది ఇంకా తెలియదు.
యాక్టింగ్ కెరీర్ విషయానికి వస్తే... ఇలియానా స్క్రీన్ మీద కనిపించి రెండేళ్ళు అవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన అభిషేక్ బచ్చన్ 'ది బిగ్ బుల్' ఆమె నటించిన లాస్ట్ సినిమా. తెలుగులో అయితే మాస్ మహారాజా రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' తర్వాత మళ్ళీ నటించలేదు. అంతకు ముందు కూడా సుమారు ఆరేళ్ళు తెలుగు తెరకు దూరంగా ఉన్నారు.
Also Read : ఆ పబ్‌లో తెలుగు పాటలే వినబడతాయ్ - వర్మ మెచ్చిన బీర్ టెయిల్