అన్వేషించండి

So Disturbing Movies: థియేటర్ నుంచి పరుగులు పెట్టించిన భయానక సినిమాలివే - కొందరు మూర్ఛపోయారు, మరికొందరు వాంతులు చేసుకున్నారు

సినీ అభిమానులు ఎప్పుడో ఒకప్పుడు హారర్ సినిమాలను చూసే ఉంటారు. ఈ చిత్రాలు ఒక్కోసారి వెన్నులో వణుకు పుట్టిస్తాయి. అయితే, ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన కొన్ని మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

So Disturbing Movies: సినీ ప్రియులు అన్ని రకాల సినిమాలను ఇష్టపడుతారు. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, థ్రిల్లర్, హారర్ అనే తేడా లేకుండా అన్ని సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తారు. అయితే, ఇప్పుడు మనం తెలుసుకోబోయే సినిమాలు చాలా ప్రత్యేకమైనవి. ఈ సినిమాలు చూస్తే భయంతో వణుకు పుడుతుంది. కొన్ని సినిమాలు వాంతులు వచ్చేలా చేస్తాయి. మరికొన్ని థియేటర్ల నుంచి బయటకు పరుగులు తీసేలా చేస్తాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే?

1. టెర్రిఫైర్ 2

2016లో వచ్చిన ‘టెర్రిఫైర్’ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమా ‘టెర్రిఫైర్ 2’. రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అత్యంత జుగుప్సా కరమైన చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా చూసి చాలా మంది ప్రేక్షకులు థియేటర్లలోనే మూర్చపోయారట. మరికొంత మంది వాంతులు చేసుకుని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారట. ఈ సినిమా భయంకరంగా ఉంటుందని ఫిల్మ్ మేకర్ స్టీవ్ బార్టన్ ముందుగానే ప్రేక్షకులను హెచ్చరించడం విశేషం. 

2. టైటాన్(2021)

ఇది చాలా విచిత్రమైన కథతో కూడిన ఫ్రెంచ్ మూవీ. ఈ సినిమా ప్రీమియర్ సందర్భంగా 13 మంది స్పృహతప్పి పడిపోయారట. అంతేకాదు, మరికొందరు థియేటర్ల నుంచి బయటకు పరుగులు తీశారట. ఈ సినిమా జూలియా డుకోర్నౌ తెరకెక్కించారు. 

3. రా(2016)

డ్యూకోర్నౌ తెరకెక్కించిన ఈ సినిమాను చూడాలంటే నిజంగా ఎంతో ధైర్యం కావాలి. ఈ సినిమాలో కొంత మంది మానవ మాంసాన్ని తినడం ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో దాన్ని ప్రదర్శించినప్పుడు చాలా మంది వాంతులు చేసుకున్నారట.

4. మమ్మీ (2014)

సెవెరిన్ ఫియాలా, వెరోనికా ఫ్రాంజ్ కలిసి తెరకెక్కించిన ఈ సినిమాను చూసి థియేటర్లలో ప్రేక్షకులు స్పృహ తప్పి పడిపోయారు. ఈ మూవీలో ఇద్దరు పిల్లల తల్లి ముఖానికి శస్త్రచికిత్స చేస్తారు. ఆ తర్వాత ఆమె ముఖాన్ని చూసి ఆ పిల్లలు ఎలా భయపడతారు? అనేది ఈ సినిమాలో చూపించారు.   

5. యాంటీక్రిస్ట్(2009)

ఓ ఫ్యామిలీకి చెందిన చిన్న కొడుకు ప్రమాదంలో మరణించిన తర్వాత ఆ ఇంట్లో ఎలాంటి ఘటనలు జరిగాయి అనేది ఈ సినిమాలో చూపించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శన సమయంలో చాలా మంది థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయారు. కొంత మంది సృహతప్పి పడిపోయారు. ఫ్రాన్స్‌ లో కొంతకాలం ఈ సినిమాను నిషేధించారు. 

6. ఇర్రెవర్సిబుల్ (2002)

ఈ భయానక ఫ్రెంచ్ చిత్రాన్ని కేన్స్ లో ప్రదర్శిస్తుండగా, సుమారు 250 మంది బయటకు వెళ్లిపోయారు. కొందరు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. దర్శకుడు గాస్పర్ నోయే ఈ సినిమాను తెరకెక్కించారు.  

7. ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్(1999)

లోవ్స్ సినీప్లెక్స్ తెరకెక్కించిన ఈ సినిమా చాలా మంది ప్రేక్షకులను భయపెట్టింది. సినిమాకు వచ్చిన చాలా మంది కొద్ది సేపు చూడకముందే బయటకు వెళ్లిపోయారు.

8. V/H/S (2012)

ఈ సినిమా స్క్రీనింగ్ సమయంలో పలువురు ప్రేక్షకులు స్పృహ తప్పి పడిపోయారు. ఆడం వింగార్డ్, డేవిడ్ బ్రూక్నర్, టి వెస్ట్, గ్లెన్ మెక్‌క్వైడ్, జో స్వాన్‌బెర్గ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆరు వేర్వేరు హారర్ చిత్రాల సమూహం.

9. సా III (2006)

సా ఫ్రాంచైజీలోని మూడో చిత్రాన్ని చూసి ప్రేక్షకులు భయంతో వణికిపోయారు. గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా  విపరీతమైన హింస ఉంటుంది. ఈ సినిమా చూస్తూ చాలా మంది ప్రేక్షకులలు స్పృహ కోల్పోవడంతో థియేటర్ల దగ్గరికి అంబులెన్స్ లు రావడం విశేషం.

10. 127 అవర్స్ (2010)

ఆస్కార్ కు నామినేట్ అయిన ఈ సినిమాను చూస్తూ చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు.  బయోగ్రాఫికల్ సైకలాజికల్ సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను చూస్తూ ఏకంగా 16 మంది మూర్చపోయారు. ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా సంచలను కలిగించాయి. హింసకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి.

Read Also: అనంత్ అంబానీ వాచ్ ధర అన్ని కోట్లా? ఆశ్చర్యపోయిన జుకర్‌‌బర్గ్ దంపతులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget