Anant Ambani watch: అనంత్ అంబానీ వాచ్ ధర అన్ని కోట్లా? ఆశ్చర్యపోయిన జుకర్‌బర్గ్ దంపతులు
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రి-వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గుజరాత్ జామ్ నగర్ ప్రపంచ ప్రముఖులతో సందడిగా మారింది. ఈ వేడుకలో అనంత్ ధరించి వాచ్ చూసి జుకర్ బర్గ్ దంపతులు ఆశ్చర్యపోయారు.
Zuckerberg's Couple Was Surprised To Hear The Price Of Anant Ambani's Watch: భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అనంత్ అంబానీ, రాధికా మార్చంట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ వేడుక కోసం ప్రపంచ ప్రముఖులు గుజరాత్ లోని జామ్ నగర్ కు తరలి వచ్చారు. వారిని ఎంటర్ టైన్ చేసేందుకు సంగీత్ వేడుక నిర్వహించారు. ఇందులో పాప్ సింగర్ రిహన్నతో అదిరిపోయే ఫర్ఫార్మెన్స్ చేయించారు. ఇందుకోసం ఆమె పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జుకర్ బర్గ్ దంపతులకు నచ్చిన అనంత్ వాచ్
ప్రస్తుతం గుజరాత్ అంతా అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ గురించే చర్చించుకుంటున్నారు. జామ్ నగర్ లో ఎక్కడ చూసినా ప్రముఖులే కనిపిస్తున్నారు. మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ అనంత్ పెళ్లి ముచ్చట్లే ట్రెండ్ అవుతున్నాయి. ఈ వేడుకల కోసం ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్, ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్ వచ్చారు. వీరిద్దరు అనంత్ అంబానీతో సరదాగా ముచ్చటించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అనంత్ అంబానీ వారి కోసం చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అని అడిగారు. అతిథి మర్యాదలన్నీ ఓకే కదా అన్నారు. ఇండియాలో ఏ ఏ ప్రదేశాలు చూడాలి అనుకుంటున్నారో చెప్తే, ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. ఆ సమయంలో జుకర్ బర్గ్ సతీమణి ప్రిసిల్లాను అనంత్ చేతికి ఉన్న ఖరీదైన డిజైనర్ వాచ్ ఆకట్టుకుంది. ఆ గడియారాన్ని పట్టుకుని వివరాలు అడిగింది. ఆ వాచ్ రిచర్డ్ మిల్లే కంపెనీకి చెందినదని అనంత్ తెలిపారు. దాని ఖరీదు రూ.14 కోట్లు అనడంతో జుకర్ బర్గ్ తో సహా అక్కడ ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అనంత్ వాచ్ ధర అన్ని కోట్లా? అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Mark Zuckerberg & his wife Priscilla was surprised to see Anant Ambani's watch. Anant was seen carrying beautiful audemars piguet royal oak open worked skeleton worth INR 14 crore. 🤑#AnantRadhikaWedding | #AnantAmbani pic.twitter.com/DEql5XFWUA
— Radhika Chaudhary (@Radhika8057) March 3, 2024
రూ. 1000 కోట్లతో అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు
ఇక అనంత్ అంబానీ ప్రి-వెడ్డింగ్ వేడుకల కోసం ముఖేష్ అంబానీ దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీగా ఖర్చు చేసి పలువురు స్టార్లతో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. పెళ్లికి వచ్చిన అతిరథ మహారధుల కోసం నచ్చిన వంటకాలను సిద్ధం చేశారట. ఏకంగా 2500 రకాల వంటకాలను వడ్డించారని టాక్ వినిస్తోంది. ఈ వంటలను తయారు చేసేందుకు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన పాకశాస్త్ర నిపుణులను పిలిపించారట. వారి పర్యవేక్షణలో ఈ వంటకాలు జరిగినట్టు తెలుస్తోంది.
Read Also: ఫ్రెండ్ ఇంటికే కన్నం, చోరీ చేసి గోవాలో ఎంజాయ్ చేస్తున్న నటి సౌమ్య శెట్టి అరెస్ట్