అన్వేషించండి

Actress Soumya Shetty: ఫ్రెండ్ ఇంటికే కన్నం, చోరీ చేసి గోవాలో ఎంజాయ్ చేస్తున్న నటి సౌమ్య శెట్టి అరెస్ట్

Youtuber Soumya Shetty Arrest: విశాఖలో బంగారు నగల చోరీ కేసును పోలీసులు చేధించారు. స్నేహితురాలి ఇంట్లో బంగారం చోరీ చేసిన నటి సౌమ్య శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Actress Soumya Shetty Arrest: రంగుల కలల ప్రపంచం.... అప్పటి వరకు అనామకురాలిగా ఉన్నవాళ్లను రాత్రికి రాత్రి స్టార్ ను చేయడానికి ఒకే ఒక క్లిక్ చాలు... అలా ఒక్కసారిగా వచ్చిన స్టార్ డమ్ ను సద్వినియోగం చేసుకుని భవిష్యత్ కు బాటలు వేసుకుంటే  జీవితం సాఫీగా సాగిపోతుంది. అలా కాదని ఒక్కసారిగా వచ్చిన ఫేమ్, పరిచయాలు, పార్టీలతో అడ్డదారుల్లో సాగితే వాటికోసం చేసే తప్పులతో  ఇదిగో ఇలా విశాఖ(Viska)కు చెందిన యూట్యూబర్(Youtuber) లా జైలుకు వెళ్లాల్సి వస్తుంది.
అందాల భామ చేతివాటం
మత్తిక్కించే తన కళ్లతో.. వీడియోలతో సామాజిక మాద్యమా(Social Media)ల్లో అనతికాలంలో మంచి పేరు తెచ్చుకుంది విశాఖ(Vizag)కు చెందిన సోషల్ మీడియ ఇన్ ఫ్లూయెన్సర్, నటి సౌమ్య శెట్టి. ఈ అమ్మడికి కళలంటే ప్రాణం.. సోషల్ మీడియాలో రీల్స్(Reels) చేసి పాపులర్ అయిన ఈ చిన్నది... ఇప్పుడు కటకలాపాలై మళ్లీ పాపులర్ అయ్యింది. విశాఖలోని దొండ పర్తిలో  రిటైర్డ్  పోస్టల్ ఎంప్లాయ్ ఇంట్లో చోరీ చేసి సుమారు 100 తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించిన నటి సౌమ్య శెట్టి.. ఆ డబ్బుతో గోవాలో ఎంచక్కా ఎంజాయి చేస్తూ దొరికిపోయింది.  
స్నేహితురాలిగా నమ్మించి మోసం
ఇన్ స్టాగ్రామ్(Instagram) లో వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకున్న సౌమ్య... ఒకటి, రెండు చిన్నాచితకా చిత్రాల్లోనూ నటించింది. విశాఖకే చెందిన మరో సోషల్ మీడియ ఇన్ ఫ్లూయెన్సర్(Social Media Influencer) మౌనికతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ తరుచూ వీడియోలు ఎలా చేయాలి. లైక్ లు రావాలంటే ఏం చేయాలని ఫోకస్ చేసేవారు. ఆ పరిచయం స్నేహంగా మారడంతో అప్పుడప్పుడు సౌమ్య మౌనిక ఇంటికి వస్తూపోతూ ఉండేది. ఈ క్రమంలో నేరుగా మౌనిక బెడ్ రూంకి వెళ్లేది. సౌమ్య గంటల తరబడి అక్కడే ఉండటంతో.. ఏంటని మౌనిక ప్రశ్నిస్తే... ఫోన్ మాట్లాడుతున్ననంటూ దాటవేసేది. అలా వెళ్లిన ప్రతిసారీ అమ్మడు చేతివాటం ప్రదర్శించేది. మౌనిక దాచుకున్న బంగారు నగలు గుట్టుచప్పుడు కాకుండా చోరీ చేసింది. సుమారు వందగ్రాముల వరకు బంగారం చోరీ చేసింది. కొన్ని రోజుల తర్వాత బంగారం మాయమైనట్లు గుర్తించిన మౌనిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరిపైనా అనమానం లేదని.. సౌమ్య తరుచూ ఇంటికి వచ్చేదని తెలిపారు. దీంతో ఆమె కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు అసలు దొంగ తనేనని తేల్చారు.
గోవాలో ఎంజాయ్
మౌనిక ఇంట్లో కొట్టేసిన బంగారంతో సౌమ్య గోవా టూర్లకు వెళ్లి ఎంజాయ్ చేసింది. అకస్మాత్తుగా ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన పోలీసులు... గట్టిగా నిలిదేసే సరికి నిజం ఒప్పుకుంది. మొత్తం వంద తులాల బంగారం పోయిందని మౌనిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా...సౌమ్య 75 తులాలు తీసినట్లు పోలీసులు నిర్ధారించారు. అందులో 50 తులాల బంగారం రికవరీ చేయగా... మిగిలిన బంగారం అమ్మేసి ఖర్చు చేశానని చెప్పింది. గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటా’ అంటూ బెదిరించినట్లు తెలుస్తోంది. సౌమ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 15 రోజుల రిమాండ్ కు తరలించారు. స్నేహితురాలని నమ్మి ఇంటికి పిలిస్తే... సౌమ్య ఇంతపని చేస్తుందనుకోలేదని మౌనిక కన్నీటి పర్యంతమైంది. 2016 ఓ మూవీ ఆడిషన్ లో తను పరిచయం అయ్యిందని.. అప్పటి నుంచి నమ్మకంగా స్నేహం చేసిందన్నారు. ఇంటికి వచ్చిన ప్రతిసారీ తన వాష్ రూమ్ వాడుకునేదని.. ఈ క్రమంలో బెడ్ రూంలో ఉన్న బంగారం కొట్టేసిందని తెలిపింది. ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు ఆమెను పట్టుకున్నారు. తస్కరించి అమ్మిన బంగారంతో సౌమ్య  ఐదులక్షలతో ప్యామిలీ మొత్తాన్ని గోవా ట్రిప్ నకు తీసుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అలాగే ఒక లక్షన్నరతో కారు రీమోడలింగ్ చేయించుకున్నట్లు తేలింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prasanth Reddy G V (@pixelsbypr)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Embed widget