అన్వేషించండి

Iran America Conflict: ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తే ప్రపంచానికి ఇబ్బందులే - ఏం జరుగుతుందో తెలుసా?

Trump War Signals: ఇరాన్ పై అమెరికా దాడి చేస్తే ప్రపంచదేశాలకు చాలా సమస్యలు వస్తాయి. అమెరికాకూ ఇబ్బందులు తలెత్తుతాయి.

America attacks Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు వెలువడుతున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరాన్‌లో కొనసాగుతున్న అంతర్గత నిరసనలు, ఆందోళనకారులపై ప్రభుత్వం చేస్తున్న అణచివేతను కారణంగా చూపిస్తూ, ట్రంప్  Help is on the way అని ప్రకటించడం యుద్ధ మేఘాలను కమ్మేలా చేసింది. ఒకవేళ అమెరికా నిజంగా దాడికి దిగితే, దాని పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి. 

అమెరికాపై  ఇరాన్  దాడి ముప్పు

అమెరికా దాడి చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఇరాన్ తన వద్ద ఉన్న అత్యాధునిక క్షిపణి వ్యవస్థతో పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను ముఖ్యంగా ఖతార్, యూఏఈలలోనివి  లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా, అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్‌పై కూడా ఇరాన్ విరుచుకుపడవచ్చు. అమెరికా ప్రధాన భూభాగంపై నేరుగా దాడి చేసే సామర్థ్యం ఇరాన్‌కు పరిమితమే అయినా, సైబర్ దాడుల ద్వారా అమెరికా బ్యాంకింగ్, పవర్ గ్రిడ్ వ్యవస్థలను స్తంభింపజేసే ప్రమాదం ఉంది. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు, హిజ్బుల్లా వంటి గ్రూపులు కూడా అమెరికా ప్రయోజనాలపై దాడులకు దిగవచ్చు.

 అంతర్జాతీయ ముడిచమురు సంక్షోభం

యుద్ధం మొదలైతే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు గుండెకాయ వంటి  హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయవచ్చు. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20  ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇది జరిగితే ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి . దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తాయి. ఫలితంగా అనేక దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉంది.

 మిత్రదేశాల వైఖరి

అమెరికా దాడి చేస్తే బ్రిటన్ వంటి కొన్ని దేశాలు మద్దతు తెలిపే అవకాశం ఉన్నప్పటికీ, సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులు తమపై జరుగుతాయని అవి భయపడుతున్నాయి. అందుకే అవి ఈ ఘర్షణకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు, రష్యా , చైనాలు అమెరికా చర్యను తీవ్రంగా వ్యతిరేకించవచ్చు, ఇది ప్రపంచాన్ని రెండు ధృవాలుగా విడగొట్టే  మూడో ప్రపంచ యుద్ధం వంటి పరిస్థితులకు దారితీయవచ్చునన్న ఆందోళన ఉంది. 

భారత్‌పై ప్రభావం ఎంత?

భారత్‌పై ఈ యుద్ధ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. భారత్ తన చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతి చేసుకుంటుంది. ధరలు పెరిగితే దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25% అదనపు సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇది భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు ప్రాజెక్టు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.  గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు నివసిస్తున్నారు. యుద్ధం వ్యాపిస్తే వారి భద్రత , ఉపాధి పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది.
 
మొత్తంమీద, ఇరాన్‌పై అమెరికా దాడి అనేది కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణగా మిగిలిపోదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, మధ్యప్రాచ్యంలో ఏళ్ల తరబడి కొనసాగే అశాంతికి దారితీస్తుంది.   

టాప్ హెడ్ లైన్స్

US PERM Labor Certification Suspension: అమెరికాలో ఐటీ దిగ్గజాలకు భారీ షాక్ - పెర్మ్ సస్పెన్షన్.. భారత టెక్కీల గ్రీన్ కార్డ్ ఆశలు గల్లంతు!
అమెరికాలో ఐటీ దిగ్గజాలకు భారీ షాక్ - పెర్మ్ సస్పెన్షన్.. భారత టెక్కీల గ్రీన్ కార్డ్ ఆశలు గల్లంతు!
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
Embed widget