Idli Kadai Vs Kantara Chapter 1: 'కాంతార'ను బీట్ చేసిన 'ఇడ్లీ కొట్టు'... అక్కడ ధనుష్ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు!
Idli Kadai Box Office Collection: 'కాంతార ఛాప్టర్ 1' జోరులో తెలుగు, కన్నడ గడ్డపై ధనుష్ 'ఇడ్లీ కొట్టు' గురించి వినిపించడం లేదు. కానీ, తమిళనాడులో ధనుష్ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి.

పాన్ ఇండియా లెవల్‌లో రిషబ్ శెట్టి 'కాంతార ఛాప్టర్ 1' (Kantara Chapter 1) మూవీ థియేటర్లకు వెళ్లేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రెండు రోజుల్లో ఆ సినిమా ఇండియా నెట్ కలెక్షన్లు వంద కోట్లు దాటాయి. 'కాంతార ఛాప్టర్ 1' జోరు ముందు తెలుగు - కన్నడ - హిందీ భాషల్లో నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'ఇడ్లీ కొట్టు' (తమిళ్ టైటిల్ 'ఇడ్లీ కడై') కనిపించకుండా పోయింది. కానీ తమిళనాడులో మాత్రం ధనుష్ సినిమాది పైచేయి. అక్కడ 'కాంతార'ను 'ఇడ్లీ కొట్టు' బీట్ చేసింది.
రిషబ్ శెట్టి కంటే ధనుష్ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు!
అక్టోబర్ 1న ధనుష్ 'ఇడ్లీ కొట్టు' విడుదల అయ్యింది. ఆ రోజు రాత్రి రిషబ్ శెట్టి 'కాంతార ఛాప్టర్ 1' పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయి. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిషబ్ శెట్టి 'కాంతార' ప్రీక్వెల్ థియేటర్లలోకి వచ్చింది.
'ఇడ్లీ కొట్టు' సినిమాకు ఓపెనింగ్ డే ఇండియాలో 11 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. అందులోనూ మేజర్ కలెక్షన్స్ తమిళనాడు నుంచి వచ్చాయి. తమిళ, తెలుగు భాషల్లో సినిమాను విడుదల చేశారు. కోలీవుడ్ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు రాగా... టాలీవుడ్ క్రిటిక్స్ మాత్రం సినిమా ఏవరేజ్ అని తేల్చారు. తమిళనాడులో ధనుష్ ఫాలోయింగ్ సైతం సినిమాకు కలిసి వచ్చింది.
అక్టోబర్ 2న 'ఇడ్లీ కొట్టు' ఇండియా నెట్ రూ. 9.75 కోట్లు. ఒక్క తమిళనాడులో 9 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ సాధించగా... తెలుగులో కేవలం 75 లక్షల రూపాయలు వచ్చాయి. ఆ రోజు థియేటర్లలోకి వచ్చిన 'కాంతార ఛాప్టర్ 1' అయితే తమిళనాడు మార్కెట్టులో రూ. 5.5 కోట్ల నెట్ సాధించింది. రిషబ్ శెట్టి సినిమా కంటే ధనుష్ సినిమాకు తమిళనాడులో డబుల్ కలెక్షన్స్ వచ్చినట్టు లెక్క. ఇక... అక్టోబర్ 3న 'ఇడ్లీ కొట్టు' తమిళనాడులో రూ. 5 కోట్ల నెట్ రాబట్టింది. రిషబ్ శెట్టి సినిమాకు రూ. 4.5 కోట్ల నెట్ వచ్చింది.
రిషబ్ శెట్టి సినిమాకు హిట్ టాక్ అడ్వాంటేజ్!
తెలుగులో రిషబ్ శెట్టి సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు, రేటింగులు రావడం... మౌత్ టాక్ బావుండటం అడ్వాంటేజ్ అయ్యింది. తెలుగులో మీడియం రేంజ్ హీరోలతో సమానంగా కలెక్షన్స్ రాబడుతోంది. తెలుగునాట ధనుష్ అంటే క్రేజ్ ఉంది. 'రాయన్', 'కుబేర' సినిమాలు మంచి కలెక్షన్స్ రాబట్టాయి. అయితే 'ఇడ్లీ కొట్టు' ప్రచార చిత్రాల్లో తమిళ్ ఫ్లేవర్ ఎక్కువ కనిపించడంతో పాటు సరైన ప్రచారం లేక వెనుకబడింది.
ఫస్ట్ వీకెండ్ అయ్యేసరికి తమిళనాడులో ధనుష్ సినిమా 30 నుంచి 35 కోట్ల నెట్ రాబట్టే అవకాశం ఉంది. అదే సమయంలో రిషబ్ శెట్టి సినిమా ఒక్క ఇండియాలో 200 కోట్ల నెట్ కలెక్ట్ చేయవచ్చని అంచనా. ఆ సినిమా రెండు రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ 150 కోట్లకు దగ్గరలో ఉంది.
Also Read: 'మయసభ'లో వైయస్సార్... 'ఘాటీ'లో విలన్... ఇప్పుడు హీరోగా ఇద్దరమ్మాయిలతో!




















