అన్వేషించండి
Advertisement
Hyd Civil Court Stay On RGV's Movie: 'మా ఇష్టం' విడుదల చేయడానికి వీల్లేదు - కోర్టు స్టే ఆర్డర్
Hyderabad Civil Court Stay On Maa Ishtam Movie: రామ్ గోపాల్ వర్మ నిర్మించిన తాజా సినిమా 'మా ఇష్టం' విడుదలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు స్టే విధించింది.
Naina Ganguly and Apsara Rani's Maa Ishtam will release On April 8th?: రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'మా ఇష్టం' సినిమా ఏప్రిల్ 8న (శుక్రవారం) విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. నైనా గంగూలీ, అప్సరా రాణీ ప్రధాన తారలుగా క్రైమ్ నేపథ్యంలో లెస్బియన్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఓ వర్గం ప్రేక్షకులను ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. మరికొన్ని గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందనగా... 'మా ఇష్టం'ను విడుదల చేయడానికి వీల్లేదంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. స్టే ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
'మా ఇష్టం' విడుదలను అడ్డుకోవాలంటూ నిర్మాత నట్టి కుమార్ కోర్టును ఆశ్రయించారు. గతంలో వర్మ తీసిన కొన్ని చిత్రాలకు ఆయన నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. మరికొన్ని చిత్రాలకు ఫైనాన్స్ చేశారట. తనకు ఇవ్వాల్సిన డబ్బులు వర్మ తిరిగి ఇవ్వడం లేదని, ఇవి ఇచ్చేవరకూ 'మా ఇష్టం' విడుదలను అడ్డుకోవాలని ఆయన కోరడంతో... కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. "ఎవరైనా ఈ చిత్రాన్ని ప్రదర్శించినా ప్రదర్శనకు సహకరించినా కాంటెంప్ట్ అఫ్ కోర్ట్ అవుతుంది" అని నట్టి కుమార్ పేర్కొన్నారు.
తెలుగులో 'మా ఇష్టం', హిందీలో 'ఖత్రా', తమిళంలో 'డేంజరస్' పేరుతో సినిమా విడుదల చేయడానికి వర్మ ప్లాన్ చేశారు. బెంగళూరు వెళ్లి ప్రమోషన్స్ కూడా చేసి వచ్చారు. ఇప్పుడు స్టే ఆర్డర్ రావడంతో ఆయన ఏం చేస్తారో చూడాలి. ఆల్రెడీ ఈ సినిమాను ప్రదర్శించమని ఇనాక్స్, పీవీఆర్ మల్టీప్లెక్స్ ఫ్రాంచైజీలు చెప్పిన సంగతి తెలిసిందే.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నెల్లూరు
అమరావతి
మొబైల్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement