Hide And Seek Telugu Movie : క్రైమ్ అండ్ థ్రిల్ - 'దాగుడు మూతలు' ఆడుతున్న విశ్వంత్
యంగ్ హీరో విశ్వంత్ దుద్దుంపూడి కొత్త సినిమాకు 'హైడ్ అండ్ సీక్' టైటిల్ కన్ఫర్మ్ చేశారు. దర్శకుడు సుధీర్ వర్మ చేతుల మీదుగా ఆ సినిమా టైటిల్ లోగో విడుదలైంది.
నేచురల్ స్టార్ నాని 'జెర్సీ' సినిమాలో క్రికెటర్ నందు రోల్ చేసిన అబ్బాయి గుర్తు ఉన్నారా? అదేనండీ... విశ్వంత్ దుద్దుంపూడి (Viswant Duddumpudi). ఆ సినిమాలో స్పెషల్ రోల్ చేసినా... అంతకు ముందు 'కేరింత'లో నటించారు. హీరోగా అతనికి తొలి సినిమా అది. తర్వాత 'ఓ పిట్ట కథ', 'కథ వెనుక కథ', 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్' సినిమాలు హీరోగా చేశారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'గేమ్ చేంజర్'లో కూడా ఓ రోల్ చేస్తున్నారని సమాచారం. ఆ విశ్వంత్ దుద్దుంపూడి హీరోగా ఓ కొత్త సినిమా తెరకెక్కుతోంది.
విశ్వంత్ హీరోగా 'హైడ్ అండ్ సీక్'
విశ్వంత్ దుద్దుంపూడి కథానాయకుడిగా సహస్ర ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ 1గా ఓ సినిమా రూపొందుతోంది. అందులో శిల్పా మంజునాథ్ (Shilpa Manjunath), రియా సచ్ దేవ్ (Riya Sachdeva) కథానాయికలు. ఈ చిత్రం ద్వారా బసి రెడ్డి రానా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి 'హైడ్ అండ్ సీక్' (Hide And Seek Telugu Movie) టైటిల్ ఖరారు చేశారు.
టైటిల్ లోగో విడుదల చేసిన సుధీర్ వర్మ
'హైడ్ అండ్ సీక్' టైటిల్ లోగోను 'స్వామి రా రా', 'కేశవ', 'రణరంగం', రీసెంట్ మాస్ మహారాజా మూవీ 'రావణాసుర' దర్శకుడు సుధీర్ వర్మ విడుదల చేశారు. చిత్ర బృందానికి ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. టైటిల్ లోగో విడుదల చేసిన సుధీర్ వర్మకు సహస్ర ఎంటర్‌టైన్‌మెంట్ థాంక్స్ చెప్పింది.
View this post on Instagram
'హైడ్ అండ్ సీక్'... ఓ క్రైమ్ థ్రిల్లర్!
ఇప్పటి వరకు విశ్వంత్ దుద్దుంపూడి చేసిన సినిమాలకు 'హైడ్ అండ్ సీక్' పూర్తి భిన్నంగా ఉంటుందని దర్శకుడు బసి రెడ్డి రానా చెప్పారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని, ఎవరు ఎవరితో దాగుడు మూతలు ఆడారు? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందని ఆయన వివరించారు. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే సినిమాకు మేజర్ హైలైట్స్ అవుతాయన్నారు. హీరో హీరోయిన్లతో పాటు నటీనటులు అందరూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుండటంతో సినిమా చాలా బాగా వచ్చిందని బసి రెడ్డి రానా సంతోషం వ్యక్తం చేశారు.
Also Read : 'టక్కర్' రివ్యూ : మాస్ యాక్షన్ హీరో కావాలని సిద్ధార్థ్ ట్రై చేస్తే?
'హైడ్ అండ్ సీక్' సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యిందని సహస్త్ర ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత, చిత్ర నిర్మాత నరేంద్ర బుచ్చి రెడ్డిగారి తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, అవి పూర్తి అయ్యాక మంచి విడుదల తేదీ చూసుకుని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని ఆయన వివరించారు. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
Also Read : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?
సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కూర్పు : అమర్ రెడ్డి కుడుముల, కళా దర్శకత్వం : నిఖిల్ హాసన్, ఛాయాగ్రహణం : చిన్న రామ్, సంగీతం : లిజో కె జోష్, సమర్పణ: నిశాంత్, దర్శకత్వం: బసి రెడ్డి రానా, నిర్మాత: నరేంద్ర బుచ్చి రెడ్డిగారి.