Ram Charan Shirt Cost : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?
శర్వానంద్ రిసెప్షన్‌లో రామ్ చరణ్, ఉపాసన దంపతులు సందడి చేశారు. ఆ వేడుకకు చరణ్ వేసుకొచ్చిన షర్ట్ రేటు ఎంతో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) క్లోజ్ ఫ్రెండ్స్. శర్వా పెళ్ళికి రామ్ చరణ్ వెళ్ళారు. ఆయనతో పాటు ఆ పెళ్లిలో సతీమణి ఉపాసన కొణిదెల కనిపించలేదు. ప్రెగ్నెంట్ కాబట్టి ప్రయాణం ఎందుకని వెళ్ళలేదు ఏమో! అయితే... హైదరాబాద్‌లో జరిగిన రిసెప్షన్‌కు రామ్ చరణ్, ఉపాసన దంపతులు వచ్చారు. కాసేపు సందడి చేశారు.
ఆ షర్ట్ రేటు ఎంతో తెలుసా?
శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ చాలా సింపుల్‌గా కనిపించారు. ఆయన లుక్ కూడా! అయితే, ఆ లుక్ వెనుక రేటు మాత్రం సింపుల్ కాదండోయ్! అవును... రామ్ చరణ్ ధరించిన షర్ట్ రేటు ఎక్కువే. లో (loewe) బ్రాండ్ షర్ట్ వేసుకున్నారు మెగా పవర్ స్టార్. అది మీరూ కొనుక్కోవచ్చు. కాకపోతే 75 వేల రూపాయలు మన అకౌంటులో ఉండాలి. ఉంటే... ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు.
రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు శుక్రవారం రెండు ఫంక్షన్లకు అటెండ్ అయ్యారు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి నిశ్చితార్థంలోనూ సందడి చేశారు. ఆ వేడుకలోనూ సేమ్ డ్రస్ వేసుకున్నారు. ఈ ఏడాది ఈ దంపతులు ఇద్దరూ తల్లిదండ్రులు కానున్నారు. ఆ మూమెంట్ కోసం మెగా ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది.
Also Read : బాలకృష్ణతో త్రివిక్రమ్ సందడి - ఎన్‌బికె 109 ఓపెనింగ్‌లో బర్త్‌డే సెలబ్రేషన్
ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న సినిమాలకు వస్తే... సమాజానికి పనికి వచ్చే చక్కటి సందేశంతో పాటు వాణిజ్య హంగులు మేళవించి భారీ చిత్రాలు తెరకెక్కించే స్టార్ దర్శకుడు శంకర్ తో కలిసి 'గేమ్ చేంజర్' సినిమా చేస్తున్నారు. అది పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఆ తర్వాత సుకుమార్ శిష్యుడు, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా చేస్తారు. 'విక్రమ్' ఫేమ్ లోకేష్ కనగరాజ్, 'కెజిఎఫ్' & 'సలార్' ఫేమ్ ప్రశాంత్ నీల్, ఇంకా కొంత మంది దర్శకులతో చర్చలు జరుపుతున్నారు. బుచ్చి బాబు తర్వాత ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారు? అనేది కొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది.
Also Read : అల్లు అరవింద్ మాటలను నిజం చేసిన లావణ్య, వైరల్ అవుతున్న ఓల్డ్ వీడియో!
చిన్న సినిమాలు నిర్మించడం కోసం...
ఇప్పుడు రామ్ చరణ్ నిర్మాతగానూ బిజీ కానున్నారు. చిన్న సినిమాలు నిర్మించడం కోసం, కంటెంట్ బేస్డ్ సినిమాలను ప్రేక్షకులకు అందించడం కోసం స్నేహితుడు విక్రమ్ రెడ్డి (యువి క్రియేషన్స్ నిర్మాతలలో ఒకరు)తో కలిసి వి మెగా పిక్చర్స్ సంస్థ స్థాపించారు. నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) కథానాయకుడిగా రూపొందుతున్న 'ది లైట్ హౌస్' ఆ సంస్థలో తొలి సినిమా. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో ఆ సినిమా రూపొందుతోంది. మరికొన్ని సినిమాలు నిర్మించే ఆలోచనలో కూడా ఉన్నారట.
అఖిల్ హీరోగా చరణ్ నిర్మాణంలో సినిమా?
వి మెగా పిక్చర్స్ నిర్మాణంలో అఖిల్ కథానాయకుడిగా ఓ సినిమా రూపొందే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ టాక్. నిఖిల్ కాకుండా అక్కినేని హీరోగా మొదటి సినిమా ఉంటుందని చాలా మంది భావించారు. 'ఏజెంట్' తర్వాత అఖిల్ చేయబోయే సినిమా యువి క్రియేషన్స్ సంస్థలో ఉంటుంది. ఆ తర్వాత వి మెగా పిక్చర్స్ సినిమా ఉండొచ్చు.